Unique Love: రియల్ వీర్ జరా స్టోరీ.. పాక్ అమ్మాయి, భారత్ అబ్బాయి ప్రేమ.. వధువుకి 45 రోజులు వీసా మంజూరు..

ఒక భారతీయ యువకుడు పాకిస్తాన్‌కు చెందిన అమ్మాయిని ప్రేమిస్తాడు. తనకు ఎదురైన ఇబ్బందులు ఎదుర్కొని ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఇది రీల్ లైఫ్ వీర్ జరా కథ. అయితే  తాజాగా నిజ జీవితంలో వీర్ జరా కథ గురించి తెలుసుకుందాం.. జవేరియా ఖానుమ్, సమీర్ ఖాన్ కథ. జవారియా ఖానుమ్ పాకిస్థాన్‌ కి చెందిన యువతి. సమీర్ ఖాన్ భారత్‌కు చెందిన యువకుడు. కరాచీలో నివసించే జవేరియా పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో నివసించే సమీర్‌తో ప్రేమలో పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వీరి ప్రేమ పెళ్లిగా మారడం అంత సులభం కాదు.

Unique Love: రియల్ వీర్ జరా స్టోరీ.. పాక్ అమ్మాయి, భారత్ అబ్బాయి ప్రేమ.. వధువుకి 45 రోజులు వీసా మంజూరు..
Pak Girl Indian Boy Love
Follow us
Surya Kala

|

Updated on: Dec 05, 2023 | 12:54 PM

బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, నటి ప్రీతి జింటా నటించిన సూపర్ హిట్ రొమాంటిక్ చిత్రం ‘వీర్ జరా’ ను గుర్తు చేస్తూ రియల్ జీవితంలో ప్రేమ కథ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వీర్ జరా విడుదలై ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ప్రజల అభిమాన చిత్రాల్లో ఒకటిగా ఈ చిత్రం నిలిచిపోయింది. ఈ చిత్రంలో ఒక భారతీయ యువకుడు పాకిస్తాన్‌కు చెందిన అమ్మాయిని ప్రేమిస్తాడు. తనకు ఎదురైన ఇబ్బందులు ఎదుర్కొని ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఇది రీల్ లైఫ్ వీర్ జరా కథ. అయితే  తాజాగా నిజ జీవితంలో వీర్ జరా కథ గురించి తెలుసుకుందాం..

జవేరియా ఖానుమ్, సమీర్ ఖాన్ కథ. జవారియా ఖానుమ్ పాకిస్థాన్‌ కి చెందిన యువతి. సమీర్ ఖాన్ భారత్‌కు చెందిన యువకుడు. కరాచీలో నివసించే జవేరియా పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో నివసించే సమీర్‌తో ప్రేమలో పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వీరి ప్రేమ పెళ్లిగా మారడం అంత సులభం కాదు.

మక్బూల్ అహ్మద్ కృషి ఫలించింది

జవేరియా , సమీర్ ల ప్రేమకథలో అతిపెద్ద సమస్య రెండు దేశాల మధ్య సరిహద్దుగా మారింది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికి భారత ప్రభుత్వం జావేరియాకు వీసా ఇవ్వలేదు. ఆ యువతి తన పెళ్లి కోసం భారతదేశానికి రాలేకపోయింది. అయితే వీరి ప్రేమని పెళ్లి వరకూ తీసుకుని వెళ్లడానికి మక్బూల్ అహ్మద్ రంగంలోకి దిగాడు. జవేరియా, సమీర్ ల ప్రేమకథలోకి ప్రవేశించాడు.

ఇవి కూడా చదవండి

జవేరియాకు 45 రోజుల వీసా

పంజాబ్‌లోని ఖాడియాన్‌కు చెందిన సామాజిక కార్యకర్త మక్బూల్ అహ్మద్ ఖాదియన్.  ఈ జంటను ఏకం చేయడానికి ప్రయత్నించాడు. అతని ప్రయత్నాలు ఫలించాయి. ఆ తర్వాత భారత ప్రభుత్వం జావేరియాకు వీసా ఇచ్చి, భారత్‌కు రావడానికి వీలు కల్పించింది. భారత ప్రభుత్వం జవేరియాకు 45 రోజుల వీసా ఇచ్చింది.

కోల్‌కతాలో జరగనున్న జవేరియా, సమీర్‌ల వివాహం

జవేరియా ఖానుమ్ ఈరోజు అట్టారీ-వాఘా సరిహద్దు మీదుగా పాకిస్తాన్ నుండి అమృత్‌సర్‌కు చేరుకుంటుంది. ఆ తర్వాత అంతర్జాతీయ విమానాశ్రయం నుండి నేరుగా కోల్‌కతాకు చేరుకుంటుంది. కొద్ది రోజుల తర్వాత  జవేరియా , సమీర్ వివాహం చేసుకుని ఒక్కటి కానున్నారు. 45 రోజుల తర్వాత జవేరియా దీర్ఘకాలిక వీసా కోరుతూ భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేయనుంది.

అట్టారీ సరిహద్దులో జవేరియాకు స్వాగతం

కరాచీ నివాసితులైన అజ్మత్ ఇస్మాయిల్ ఖాన్, అతని కుమార్తె జవేరియా ఖనుమ్‌కు అమృత్‌సర్‌లోని అట్టారీ సరిహద్దు వద్ద స్వాగతం పలుకుతారు. వరుడు సమీర్ తన తండ్రి అహ్మద్ కమల్ ఖాన్ యూసుఫ్జాయ్ తో కలిసి స్వయంగా స్వాగతం పలకనున్నారు. ప్రస్తుతం సమీర్ తన తండ్రితో పాటు పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలోని ఖాడియాన్ అనే గ్రామంలో తనకు తెలిసిన కొంతమందితో కలిసి ఇప్పటికే అక్కడికి చేరుకున్నాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..