Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: రీల్స్‌‌కి లైక్ కొట్టలేదు..16 ఏళ్ల యువతి బ్రేకప్ స్టోరీ వైరల్.. ప్రేమికురాలిపై పగపట్టిన దోమ ఫ్యామిలీ..

16 ఏళ్ల అమ్మాయి తన ప్రేమ గురించి ఇంకా చెబుతూ.. హర్షిత్ నిర్లక్ష పూరిత ప్రవర్తన గురించి తరువాత తనకు తెలిసింది. తాను పంపిన ఏ రీల్‌కి సమాధానం ఇవ్వలేదు లైక్స్ కొట్టలేదని తెలిపింది అంతేకాదు విరాట్ కోహ్లి అనుష్కను ఎలా చూసుకుంటాడో, అతను నన్ను ఆ విధంగా చూసుకోలేదు. తర్వాత తాను ఒకరోజు హర్షిత్ మీద కోపంతో అతని క్లాసు రూమ్ కి వెళ్లి అతని చెంపపై గట్టిగా కొట్టినట్లు వెల్లడించింది. అప్పుడు అతని చెంప మీద ఒక దోమ ఉంది.

Viral News: రీల్స్‌‌కి లైక్ కొట్టలేదు..16 ఏళ్ల యువతి బ్రేకప్ స్టోరీ వైరల్.. ప్రేమికురాలిపై పగపట్టిన దోమ ఫ్యామిలీ..
Funny Break Up Love Story
Follow us
Surya Kala

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 27, 2023 | 7:38 PM

ప్రస్తుతం వివాహంతో ప్రపంచ వ్యాప్తంగా ఒక్కయ్యే జంటల కంటే సహజ జీవనం చేసే జంటలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.  అయితే ఈ రిలేషన్ షిప్ ఎంతకాలం కొనసాగుతుందనేది చెప్పలేం. కొన్ని సంబంధాలు 15-20 రోజులు లేదా ఒక నెలలో ముగుస్తాయి. మరికొన్ని సంవత్సరాలు కొనసాగుతాయి. ఎవరి సంబంధం ఎంతకాలం కొనసాగుతుందనేది ఆయా జంటల ప్రేమ నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతే.. ఆ సంబంధం ముగియడానికి ఎక్కువ సమయం పట్టదు. ప్రస్తుతం ఇలాంటి బ్రేకప్ స్టోరీ ఒకటి సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే ఈ బ్రేకప్ కు కారణం చాలా ఫన్నీగా ఉంది.  మొత్తం విషయం తెలిసిన తర్వాత.. ఎవరైనా ఖచ్చితంగా నవ్వుతారు.

బ్రేకప్ కు చెందిన మ్యాటర్ ఏంటంటే.. ఓ 16 ఏళ్ల అమ్మాయి ప్రేమకు బ్రేకప్ కు మధ్య ఓ దోమ విలన్‌గా మారింది. దోమల కుటుంబం తన జీవితాన్ని దుర్భరం చేసిందని ఆ యువతి పేర్కొంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడ్డిట్‌లో అమ్మాయి తన ప్రేమ..  బ్రేకప్ మొత్తం కథను వివరించింది. ‘తనకు ప్రేమ, డేటింగ్ వంటి విషయాల పట్ల అంతగా ఆసక్తి లేదని వెల్లడించింది. అయితే తన బెస్ట్ ఫ్రెండ్ హర్షిత్ తనను అమితంగా ఆకట్టుకున్నాడు. అయినా సరే తాను 6 నెలలు వెయిట్ చేసి అప్పుడు హర్షిత్ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆ అమ్మాయి చెప్పింది.

ఇవి కూడా చదవండి

ఫన్నీ పోస్ట్ చూడండి

16 ఏళ్ల అమ్మాయి తన ప్రేమ గురించి ఇంకా చెబుతూ.. హర్షిత్ నిర్లక్ష పూరిత ప్రవర్తన గురించి తరువాత తనకు తెలిసింది. తాను పంపిన ఏ రీల్‌కి సమాధానం ఇవ్వలేదు లైక్స్ కొట్టలేదని తెలిపింది అంతేకాదు విరాట్ కోహ్లి అనుష్కను ఎలా చూసుకుంటాడో, అతను నన్ను ఆ విధంగా చూసుకోలేదు. తర్వాత తాను ఒకరోజు హర్షిత్ మీద కోపంతో అతని క్లాసు రూమ్ కి వెళ్లి అతని చెంపపై గట్టిగా కొట్టినట్లు వెల్లడించింది. అప్పుడు అతని చెంప మీద ఒక దోమ ఉంది. చెంపపై దెబ్బ కొట్టిన సమయంలో ఆ దోమ చనిపోయిందని బాలిక చెప్పింది. ఇప్పుడు ఆ దోమ కుటుంబం తన కలలో కనిపిస్తోంది. అంతేకాదు తనపై పగబట్టిన ఆ దోమ ఫ్యామిలీ తనపై పగ తీర్చుకోవాలని, చూస్తోంది. డెంగ్యూ రావాలని దోమ ఫ్యామిలీ ఆలోచిస్తోందని వెల్లడించింది.

అమ్మాయి పోస్ట్ లో ఆ అబ్బాయిని చాలా తిట్టింది. అంతేకాదు ఢిల్లీలోని  కరోల్ బాగ్ దోమలన్నీ అతని వెంట పడాలని తాను కోరుకుంటున్నాను అని రాసింది. ఈ ఫన్నీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కూడా ఫన్నీ కామెంట్స్ చేయడం ప్రారంభించారు. ‘దోమ దెయ్యమైందని..నీపై పగబట్టి.. శత్రుత్వంతో ప్రతీకారం తీర్చుకుంటుందని’ అని హాస్యాస్పదంగా ఒకరు కామెంటే చేయగా.. మరోకరు ఇప్పటి వరకూ ‘ఆర్యన్ అనే అబ్బాయిలు ఎక్కువ విషపూరితమైనవారని తాను భావించానని అయితే ఇప్పడు ఆ జాబితాలో హర్షిత్ కూడా చేరినట్లు చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..