Viral News: ఆ దేశంలో ఏడాది జైలు శిక్ష అనుభవించి రిలీజైన 9 మేకలు.. నేరం ఏమిటంటే
పందెం కోళ్లను అరెస్ట్ చేసి జైలులో పెట్టిన సంఘటనలు ఆంధ్రప్రదేశ్ లో తరచుగా వెలుగులోకి వస్తూ ఉంటాయి. అయితే మేకలకు శిక్ష విధించడమే కాకుండా దాదాపు ఏడాది కాలంగా బందిఖానాలో ఉండి ఇప్పుడు విడుదలైన క్రిమినల్ మేకల గురించి విన్నారా. నమ్మడం నమ్మక పోవడం అనే మీ ఇష్టం.. అయితే ఇది నిజంగా జరిగింది. బంగ్లాదేశ్ కి చెందిన ఓ షాకింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మేకలు చేసిన నేరం ఏమిటో తెలుసుకుందాం?
నేరము శిక్ష అనేది ఇప్పటిది కాదు పురాతన కాలం నుంచి వస్తున్నదే.. అయితే ప్రపంచ వ్యాప్తంగా వివిధ నేరాలకు వివిధ రకాల శిక్షలను ఆ దేశ పరిస్థితులను బట్టి ఉంటాయి. ముఖ్యంగా నేరాలు చేసి కటకటాల వెనుక శిక్ష అనుభవిస్తున్న మనుషుల గురించి అందరికీ తెలిసిందే.. అయితే అప్పుడప్పడు కోడి పందాల సమయంలో పందెం కోళ్లను అరెస్ట్ చేసి జైలులో పెట్టిన సంఘటనలు ఆంధ్రప్రదేశ్ లో తరచుగా వెలుగులోకి వస్తూ ఉంటాయి. అయితే మేకలకు శిక్ష విధించడమే కాకుండా దాదాపు ఏడాది కాలంగా బందిఖానాలో ఉండి ఇప్పుడు విడుదలైన క్రిమినల్ మేకల గురించి విన్నారా. నమ్మడం నమ్మక పోవడం అనే మీ ఇష్టం.. అయితే ఇది నిజంగా జరిగింది. బంగ్లాదేశ్ కి చెందిన ఓ షాకింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మేక చేసిన నేరం ఏమిటో తెలుసుకుందాం?
ఢాకా ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం ఈ షాకింగ్ కేసు బంగ్లాదేశ్‌లోని కీర్తన్‌ఖోలా నది ఒడ్డున ఉన్న బరిషాల్ నగరానికి చెందినది. మొత్తం తొమ్మిది మేకలకు శిక్ష పడింది. మరి ఈ మేకలు చేసిన నేరం ఏమిటో తెలుసా.. నగరంలోని స్మశానవాటికలోని గడ్డి, చెట్లకు ఉన్న ఆకులను ఆస్వాదిస్తూ తినడమే అవి చేసిన ఏకైక నేరం. చేసిన నేరానికి శిక్షగా దాదాపు ఒక సంవత్సరం జైలులో శిక్ష అనుభవించి నవంబర్ 24 శుక్రవారం విడుదలయ్యాయి.
నివేదిక ప్రకారం కొత్తగా ఎన్నికైన బారిసల్ సిటీ కార్పొరేషన్ (బీసీసీ) మేయర్ అబుల్ ఖైర్ అబ్దుల్లా ఈ మేకలను విడుదల చేయాలని ఆదేశించారు. అనంతరం ఈ మేకలను వాటి యజమానికి అప్పగించారు. గతేడాది డిసెంబర్ 6న ఈ మేకలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఈ తొమ్మిది మేకలు జైలులోనే నిర్బంధంలో జీవిస్తున్నాయి.
ఈ మేకల యజమాని షహర్యార్ సచిబ్ రాజీబ్ తన మేకలను విడుదల చేయాలనీ అవి అమాయకమైన జీవులు తెలిసి చేసిన తప్పు కాదంటూ ఇటీవల బీసీసీ మేయర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత మేయర్ అబుల్ ఖైర్ మేకలను విడిచిపెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
గతంలో కూడా కుక్క అరెస్టు
జంతువును అరెస్టు చేయడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది జనవరిలో అమెరికాకు చెందిన మిచిగాన్ పోలీసులు కుక్కను అరెస్టు చేసిన తర్వాత దాని మగ్‌షాట్‌ను విడుదల చేసి ప్రజలను ఆశ్చర్యపరిచారు. తమ అధికారి ఆహారాన్ని దొంగిలిస్తున్నప్పుడు కుక్కను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని మిచిగాన్‌లోని వైండోట్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. విచారణకు సహకరించడం లేదంటూ కుక్కను పోలీసులు అరెస్ట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..