AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హోలీ 2026 ట్రెండ్.. రంగుల పండుగలో డైనోసార్ ఎంట్రీ…పిల్లల ఫస్ట్ ఛాయిస్ ఇదే

హోలీ సందడి మాటల్లో చెప్పలేనిది. అలాంటి హోలీలో ఆధునికత తోడై మరింత అద్భుతంగా మార్చేస్తుంది. హోలీ కోసం ప్రత్యేకమైన డైనోసార్ ఆకారంలో ఉన్న వాటర్ గన్ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. దీనికి ఇప్పటికే 7.8 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. ట్రిగ్గర్ నొక్కినప్పుడు నీరు విడుదల కావడంతో వింత శబ్దం చేసే ఈ వాటర్ గన్ పట్ల వినియోగదారులు సరదాగా స్పందిస్తున్నారు.

హోలీ 2026 ట్రెండ్.. రంగుల పండుగలో డైనోసార్ ఎంట్రీ…పిల్లల ఫస్ట్ ఛాయిస్ ఇదే
Dinosaur Pichkari Holi
Jyothi Gadda
|

Updated on: Mar 04, 2026 | 10:55 AM

Share

హోలీ అంటే ప్రతి ఒక్కరికీ ఎంతో ఇష్టమైన పండుగ. ఇది అందమైన రంగుల వేడుక. సంబంధాలను తిరిగి నింపుకోవడానికి మనకు దొరికిన అద్భుత అవకాశం. మనస్సును ఉత్తేజపరిచేందుకు, మానసిక స్థితిని తేలికపరచడానికి హోలీ ఒక అవకాశం. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి, చిన్నా పెద్ద అందరూ ఒకచోట చేరి ఆడిపాడే ఆనందోత్సహం. నవ్వులు, కేరింతాలు, సరదాలు, సంతోషాలు, పాటలు, డ్యాన్స్‌లు ఇలా ఒక్కటేమిటి.. హోలీ సందడి మాటల్లో చెప్పలేనిది. అలాంటి హోలీలో ఆధునికత తోడై మరింత అద్భుతంగా మార్చేస్తుంది. హోలీ కోసం ప్రత్యేకమైన డైనోసార్ ఆకారంలో ఉన్న వాటర్ గన్ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. దీనికి ఇప్పటికే 7.8 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. ట్రిగ్గర్ నొక్కినప్పుడు నీరు విడుదల కావడంతో వింత శబ్దం చేసే ఈ వాటర్ గన్ పట్ల వినియోగదారులు సరదాగా స్పందిస్తున్నారు.

హోలీకి సందర్భంగా మార్కెట్లు రంగులతో, వాటర్ గన్లతో కళకళలాడతాయి. ఈ యేడు ఒక ప్రత్యేకమైన వాటర్ గన్ నెట్టింట సందడి చేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఇది ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది. అంతే ఆనందపరుస్తుంది. @bhakti_ramesh_98 అనే ఖాతా ద్వారా Instagramలో షేర్ చేయబడిన ఈ వీడియోలో ఒక జంట బైక్‌పై వెళ్తున్నారు. వెనుక కూర్చున్న మహిళ డైనోసార్ ఆకారపు వాటర్ గన్ పట్టుకుంది. ఆమె ట్రిగ్గర్ నొక్కిన వెంటనే, డైనోసార్ నోరు తెరుస్తుంది. బలమైన నీటి ప్రవాహం బయటకు వస్తుంది. ఆసక్తికరంగా నీటితో పాటు వింతైన ఆ…ఆ…ఆ.. అంటూ శబ్దం కూడా వస్తుంది. దీంతో ఆమె పడి పడి నవ్వుతోంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఈ ఫన్నీ క్లిప్ 7.8 మిలియన్లకు పైగా వీక్షించారు. ఇంటర్‌నెట్‌లో వేగంగా షేర్ అవుతోంది. ప్రజలు దీనిని డైనోసార్ పిచ్కారి అని పిలుస్తున్నారు. అయితే, ఇది ఇంటరాక్టివ్ వాటర్ టాయ్, పోర్టబుల్ డైనోసార్ వాటర్ స్ప్రే వంటి వివిధ పేర్లతో ఆన్‌లైన్‌లో అమ్ముడవుతోంది. ఇది ఉపయోగించడానికి సులభమైన రీఫిల్‌ను కూడా కలిగి ఉంది. సోషల్ మీడియాలో డైనోసార్ పిచ్కారీలతో పిల్లలు ఆడుకుంటున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. రంగులు చిమ్ముతూ డైనోసార్ స్టైల్‌లో నీరు స్ప్రే చేయడం పిల్లల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. కొందరు యువత కూడా ప్రత్యేక ఫోటోషూట్ల కోసం ఈ పిచ్కారీలను ఉపయోగిస్తున్నారు.

ఈ వీడియోతో యూజర్లు చాలా సరదాగా గడుపుతున్నారు. కొందరు మొదట్లో ఆ శబ్దం తమ నుండే వస్తున్నట్లు అనిపించిందని చెబుతుండగా, మరికొందరు తారక్ మెహతా కా ఊల్టా చాష్మా అనే టీవీ షోలోని దయా బెన్ నవ్వుతో పోలుస్తున్నారు. ఈ వాటర్ గన్ ఎక్కడ దొరుకుతుందో అని చాలా మంది అడుగుతున్నారు. కానీ, ఇంకా అధికారిక సమాచారం తెలియలేదు. కానీ, ఈసారి హోలీ వేడుకల్లో డైనోసార్ పిచ్కారి మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పిల్లల కోసం కొత్త డిజైన్లు, సృజనాత్మక ఆలోచనలు మార్కెట్‌లోకి వస్తుండటం హోలీ సంబరాలకు మరింత రంగులు అద్దుతోంది. ఈ డైనోసార్ పిచ్కారి హోలీకి కొత్త జోష్ తీసుకొచ్చింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us