Viral News: డిఎన్ఏ టెస్ట్‌లో అన్నాచెల్లెళ్లు అని తెలిసినా పెళ్లి చేసుకున్న జంట.. ఛీఛీ అంటున్న నెటిజన్లు

ఈ వింత ఘటన అమెరికాలోని ఉటాలో చోటు చేసుకుంది. 20 ఏళ్ల కెనా టిక్‌టాక్‌లో ఒక వీడియోను షేర్ చేసి..  తన భాగస్వామిగా ఎంచుకున్న వ్యక్తి మరెవరో కాదు.. తన బంధువు అని వెల్లడించింది. ఈ విషయం విన్న  అందరూ ఆశ్చర్యపోయారు. ఆరు నెలల డేటింగ్ తర్వాత తాము ఇద్దరం కజిన్స్ అని డీఎన్‌ఏ టెస్ట్ ద్వారా తెలిసిందని వెల్లడించారు. 

Viral News: డిఎన్ఏ టెస్ట్‌లో అన్నాచెల్లెళ్లు అని తెలిసినా పెళ్లి చేసుకున్న జంట.. ఛీఛీ అంటున్న నెటిజన్లు
Viral NewsImage Credit source: kennahags
Follow us
Surya Kala

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 26, 2023 | 3:29 PM

ప్రపంచ వ్యాప్తంగా విభిన్న సంప్రదాయాలున్నాయి. అందులో ఒకటి పెళ్లిళ్లు జరిగే విధానం. వివాహానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా వివిధ ఆచారాలు.. సంప్రదాయాలు ఉన్నప్పటికీ.. వీటన్నిటిలో ఒకటి కామన్ పాయింట్ గా ఒక విషయం ఉంది. అది పెళ్లి చేసుకునే జంటలు మధ్య రిలేషన్ విషయంలో.. ప్రపంచ వ్యాప్తంగా సోదర సంబంధ వ్యక్తులకు వివాహం చేయడాన్ని ఇష్టపడరు. అయితే మారిన కాలంతో పాటు వచ్చిన మార్పుల్లో భాగంగా సోదర వరస లేదా.. సవతి కొడుకు వంటి వారిని పెళ్లి చేసుకున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే అగ్రరాజ్యం అమెరికాలో అన్నా చెల్లెల్లు పెళ్లి చేసుకున్నారు. ఒక జంట డేటింగ్ చేస్తున్న సమయంలో వారికీ తాము అన్నాచెల్లెళ్లం అని తెలిసింది. అయినప్పటికీ ఈ జంట వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తాము ఇద్దరం ఒకరినొకరు చాలా ఇష్టపడుతున్నామని..  ప్రేమించుకుంటున్నామని యువతి చెప్పింది. అయితే ఈ నిర్ణయం కారణంగా ఈ జంట సోషల్ మీడియాలో చాలా దారుణమైన వ్యతిరేకతను ఎదుర్కొంటుంది.

ఈ వింత ఘటన అమెరికాలోని ఉటాలో చోటు చేసుకుంది. 20 ఏళ్ల కెనా టిక్‌టాక్‌లో ఒక వీడియోను షేర్ చేసి..  తన భాగస్వామిగా ఎంచుకున్న వ్యక్తి మరెవరో కాదు.. తన బంధువు అని వెల్లడించింది. ఈ విషయం విన్న  అందరూ ఆశ్చర్యపోయారు. ఆరు నెలల డేటింగ్ తర్వాత తాము ఇద్దరం కజిన్స్ అని డీఎన్‌ఏ టెస్ట్ ద్వారా తెలిసిందని వెల్లడించారు.

తన అన్నని వివాహం చేసుకున్న చెల్లి

indy100 నివేదిక ప్రకారం DNA నివేదిక ద్వారా తాను ప్రేమించిన వ్యక్తి గురించి తనకు అతను ఏమౌవుతాడో తెలుసుకున్న తర్వాత కూడా తన ఆలోచన మార్చుకోలేదు. ఒక సంవత్సరం తర్వాత కెనా తన ప్రియుడిని అంటే తనకు అన్న అయిన సొంత బంధువును వివాహం చేసుకుంది. జెనా టిక్‌టాక్‌ ద్వారా వెల్లడించిన ఈ విషయం ప్రస్తుతం చర్చకు దారితీసింది. ఇలా చేస్తారని కామెంట్ చేస్తున్నారు. అయినప్పటికీ కెన్నా తన మనసు మారదంటూ తన భర్తతో తన బంధాన్ని చూపించే విధంగా మరొక వీడియో క్లిప్‌ను పంచుకుంది. అందులో ఆమె అతన్ని కౌగిలించుకోవడం..  ముద్దు పెట్టుకోవడం కనిపించింది.

ఇవి కూడా చదవండి

ఈ జంటను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

వీరిద్దరి బంధాన్ని పూర్తిగా తిరస్కరించారు.ట్రోల్ చేయడం ప్రారంభించారు. TikTok వినియోగదారులు ఈ సంబంధం చట్టవిరుద్ధం మాత్రమే కాకుండా.. అటువంటి సంబంధం నుండి పుట్టే సంతానంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని అంటున్నారు.

దాయాదుల మధ్య వివాహాలు నిషేధించబడిన అమెరికాలోని 24 రాష్ట్రాలలో ఉటా ఒకటి అన్న సంగతి తెలిసిందే. అయితే న్యూయార్క్, ఫ్లోరిడా సహా 19 ఇతర ప్రదేశాలలో ఇటువంటి వివాహాలు అనుమతించబడతాయి. అందుకే ఉటాకి చెందినపప్టికీ కెన్నా, ఆమె భర్త ఇప్పుడు సన్‌షైన్ స్టేట్‌లో నివసిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..