26/11 Mumbai: ముంబైలో ఉగ్రవాదులు రాసిన రక్త చరిత్రకు నేటితో 15 ఏళ్లు పూర్తి.. యావత్ దేశం నివాళులు

ముంబైకి గర్వకారణమైన గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో ఉన్న 105 ఏళ్ల నాటి తాజ్‌మహల్ హోటల్‌ను టార్గెట్ చేసిన ఉగ్రవాదులు.. డిన్నర్ టైమ్‌లో హోటల్‌పై దాడి చేశారు. అకస్మాత్తుగా విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో హోటల్‌లో ఉన్న వారందరూ ఒక చోటకు చేరుకున్నారు. ఈ దాడుల్లో తాజ్ మహల్ హోటల్‌లో 31 మంది చనిపోయారు.

26/11 Mumbai: ముంబైలో ఉగ్రవాదులు రాసిన రక్త చరిత్రకు నేటితో 15 ఏళ్లు పూర్తి.. యావత్ దేశం నివాళులు
Mumbai Blasts Convict
Follow us
Surya Kala

|

Updated on: Nov 26, 2023 | 9:33 AM

భారతదేశ చరిత్రలో నవంబర్ 26వ తేదీ అత్యంత భయంకరమైన రోజుగా లిఖించబడింది. ఈ రోజు మది తలపుల్లోకి వస్తే చాలు దేశప్రజల మనసుల్లో కోపాన్ని రేకెత్తిస్తుంది. 2008 నవంబర్ 26 తేదీని దేశం ఎప్పటికీ మరచిపోదు. ఈ రోజున ఉగ్రవాదులు అత్యంత క్రూరమైన దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 18 మంది భద్రతా సిబ్బందితో సహా 166 మంది మరణించారు.

ఈ ఏడాది ఉగ్రదాడి జరిగి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా యావత్ దేశం నివాళులు అర్పిస్తున్నారు. 2008లో ఇదే రోజున పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు ముంబైలోని రెండు ఫైవ్ స్టార్ హోటళ్లు, హాస్పిటల్, రైల్వే స్టేషన్, యూదుల కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని దేశ భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తారు.

15 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే

26 నవంబర్ 2008 రోజు ముంబై కూడా యధావిధిగా తన విధులలో బిజీబిజీగా ఉంది. వీధుల నుంచి మార్కెట్ల వరకు సందడి నెలకొంది. ప్రతిరోజూ లాగానే ఆ రోజు కూడా ప్రజలు మెరైన్ డ్రైవ్‌లో సముద్రపు అలలను ఆస్వాదించారు. ఉగ్రవాదులు మృత్యువు సముద్రపు కెరటాల్లా తమవైపు కదులుతుందని ఎవరికీ తెలియదు. వెన్నెల రాత్రి సమీపిస్తుండడంతో మార్కెట్లలో రోజులాగే జనం రద్దీ పెరుగుతోంది.. అయితే ఆ ప్రతి రాత్రిలా గడవ లేదు. రాత్రి కాగానే మృత్యు దేవత ముంబైలో కరాళ నృత్యం చేయడం ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి

లష్కరే తోయిబాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు ముంబైలోకి  సముద్ర మార్గం ద్వారా ప్రవేశించారు.  దేశంలో మరణ హోమాన్ని సృష్టించమే ఆ ఉగ్రవాదుల లక్ష్యం. ముంబైలో ఉగ్రవాదులు సృష్టించిన నరమేధానికి మొత్తం ప్లాన్ చాలా నెలల ముందే సిద్ధం చేసుకున్నారు. భారత సైన్యాన్ని మోసగించడానికి, వారు మొదట భారతీయ పడవను హైజాక్ చేసి, దానిలోని ప్రజలందరినీ చంపారు. అనంతరం ముష్కరులు పడవలో రాత్రి 8 గంటలకు కోలాబా సమీపంలోని చేపల మార్కెట్ వద్ద సముద్ర తీరంలో దిగి, టాక్సీలో తమ తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. దర్యాప్తు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దాడి చేసిన ముష్కరుల బృందం రెండు గ్రూపులుగా విడిపోయి దాడులకు పాల్పడ్డారు.

దాడులు ఎక్కడ జరిగాయంటే

నారిమన్ హౌస్‌లోని యూదుల కేంద్రమైన చాబాద్ హౌస్‌పై దాడి చేశారు. ఈ దాడిలో చాబాద్ మూవ్‌మెంట్ డైరెక్టర్ గాబ్రియేల్ హోల్జ్‌బర్గ్, అతని భార్య రివ్కాతో సహా ఆరుగురు మరణించారు, అయితే వారి రెండేళ్ల కుమారుడు మోషే ప్రాణాలతో బయటపడ్డాడు.

విచక్షణారహితంగా కాల్పులు

ఉగ్రవాదులు లియోపోల్డ్ కేఫ్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ కేఫ్‌కు ఎక్కువగా విదేశీయులు వస్తుంటారు. కేఫ్‌కు చేరుకున్న దుండగులు వెంటనే విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కేఫ్‌లో జరిగిన కాల్పుల్లో 10 మంది చనిపోయారు.

ఎక్కడ మంది చనిపోయారంటే..

ఉగ్రవాదులు దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటైన ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT)ని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ రైల్వే స్టేషన్ లో భారీ సంఖ్యలో ప్రయాణికులు ఉన్నారు. దుండగులు ఇక్కడికి చేరుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. స్టేషన్‌లో జరిగిన కాల్పుల్లో అజ్మల్ అమీర్ కసబ్, ఇస్మాయిల్ ఖాన్ పాల్గొన్నారు. స్టేషన్‌లో జరిగిన కాల్పుల్లో గరిష్టంగా 58 మంది మరణించారు.

ఆసుపత్రిలో కలకలం

ఉగ్రవాది అజ్మల్ కసబ్ , అతని సహచరులలో ఒకరితో కలిసి CSMT స్టేషన్ నుండి బయటకు వచ్చిన తర్వాత కామా ఆసుపత్రిలోకి ప్రవేశించారు. దాదాపు ఐదు గంటల పాటు ఆస్పత్రిలో భయానక వాతావరణం నెలకొంది. ఈ దాడిలో కామా ఆసుపత్రికి చెందిన ఇద్దరు వాచ్‌మెన్‌లు మరణించగా, పలువురు ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ ఆస్పత్రి సిబ్బంది , ఉద్యోగులు ఒక్క రోగికి శరీరంపై చిన్న గీత కూడా పడనివ్వలేదు.

నారిమన్ పాయింట్‌లోని ఒబెరాయ్ హోటల్‌లో దాడి పాల్పడిన ఉగ్రవాదులు భారీ మందుగుండు సామగ్రితో ప్రవేశించారు. ఆ సమయంలో హోటల్‌లో 350 మందికి పైగా ఉన్నారు. ఇక్కడ దాడి చేసిన ఉగ్రవాదులు  చాలా మందిని బందీలుగా చేసుకున్నారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ సైనికులు దాడి చేసిన ఉగ్రవాదుల్లో ఇద్దరినీ చంపారు.

హోటల్‌లో 31 మంది మృతి

ముంబైకి గర్వకారణమైన గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో ఉన్న 105 ఏళ్ల నాటి తాజ్‌మహల్ హోటల్‌ను టార్గెట్ చేసిన ఉగ్రవాదులు.. డిన్నర్ టైమ్‌లో హోటల్‌పై దాడి చేశారు. అకస్మాత్తుగా విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో హోటల్‌లో ఉన్న వారందరూ ఒక చోటకు చేరుకున్నారు. ఈ దాడుల్లో తాజ్ మహల్ హోటల్‌లో 31 మంది చనిపోయారు.

60 గంటల పాటు కొనసాగిన ఎన్‌కౌంటర్

స్టేషన్, కేఫ్ నుండి ప్రారంభమైన ఈ దాడుల పర్వం తాజ్ హోటల్‌లో ముగిసింది. ఉగ్రవాదులకు, భద్రతా సిబ్బందికి మధ్య దాదాపు 60 గంటలకు పైగా ఎన్‌కౌంటర్ కొనసాగింది. అయినప్పటికీ ఉగ్రవాదులను అంతమొందించలేకపోయారు. ఆ తర్వాత భద్రతా సిబ్బంది NSG కమాండోలను పిలిచి ఉగ్రవాదులందరినీ హతమార్చారు. ఉగ్రవాదుల్లో ఒకరైన కసబ్‌ను పోలీసులు సజీవంగా పట్టుకుని ఉరితీశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..