Fried Chicken: ఫ్రైడ్ చికెన్ కొనేందుకు డబ్బులివ్వలేదనీ.. భార్యను హత మార్చిన భర్త

ఫ్రైడ్ చికెన్ కొనేందుకు డబ్బు ఇవ్వలేదనీ ఓ వ్యక్తి భార్యను హతమార్చాడు. టైలరింగ్‌ పని చేస్తు్న్న అతను కత్తెరతో దారుణంగా భార్య గొంతుకోసి చంపాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో శనివారం (నవంబర్‌ 25) చోటు చేసుకుంది. ఏరియా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) సిద్ధార్థ గౌతమ్ తెలిపారు. ఘజియాబాద్‌లోని ప్రేమ్‌నగర్ కాలనీకి చెందిన షాహిద్ హుస్సేన్‌ కాపురం ఉంటున్నాడు. షాహిద్‌ వృత్తి రిత్యా టైలర్‌. అతని భార్య నూర్ బానో (46), పిల్లలు ఉన్నారు. మార్కెట్‌లో ఫ్రైడ్ చికెన్ కొనేందుకు డబ్బులు ఇవ్వాలని..

Fried Chicken: ఫ్రైడ్ చికెన్ కొనేందుకు డబ్బులివ్వలేదనీ.. భార్యను హత మార్చిన భర్త
Fried Chicken
Follow us

|

Updated on: Nov 26, 2023 | 11:03 AM

ఘజియాబాద్‌, నవంబర్‌ 26: ఫ్రైడ్ చికెన్ కొనేందుకు డబ్బు ఇవ్వలేదనీ ఓ వ్యక్తి భార్యను హతమార్చాడు. టైలరింగ్‌ పని చేస్తు్న్న అతను కత్తెరతో దారుణంగా భార్య గొంతుకోసి చంపాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో శనివారం (నవంబర్‌ 25) చోటు చేసుకుంది. ఏరియా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) సిద్ధార్థ గౌతమ్ తెలిపారు. ఘజియాబాద్‌లోని ప్రేమ్‌నగర్ కాలనీకి చెందిన షాహిద్ హుస్సేన్‌ కాపురం ఉంటున్నాడు. షాహిద్‌ వృత్తి రిత్యా టైలర్‌. అతని భార్య నూర్ బానో (46), పిల్లలు ఉన్నారు. మార్కెట్‌లో ఫ్రైడ్ చికెన్ కొనేందుకు డబ్బులు ఇవ్వాలని శుక్రవారం రాత్రి షాహిద్‌ తన భార్య నూర్‌ను అడిగాడు. ఆమె డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది.

కొన్ని నిమిషాల తర్వాత ఆమె బయటకు వెళ్లి చికెన్ కొనుగోలు చేసింది. అయినా దంపతుల మధ్య వాదన కొనసాగింది. దీంతో కోపోద్రిక్తుడైన హుస్సేన్ ఆమె మెడపై కత్తెరతో పొడిచాడు. గమనించిన ఇరుగు పొరుగు ఆమెను ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మరణించినట్లు ధృవీకరించారు. పిల్లల కళ్ల ముందే భార్యను చంపడంతో ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఏసీపీ సిద్ధార్థ గౌతమ్ తెలిపారు. నూర్‌ను హత్య చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు.

మరో ఘటన.. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలో ఫ్యాన్‌ ఊడి విద్యార్ధికి గాయాలు

ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలోని తరగతి గదిలో ఫ్యాన్‌ ఊడి పడిపోవడంతో ఓ విద్యార్థి గాయపడ్డాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా బంటుమిల్లి గ్రామానికి చెందిన అన్వర్‌ అనే బాలుడు స్థానిక మండల పరిషత్‌ ఉర్దూ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. శనివారం తరగతి గదిలో పాఠం వింటున్న సమయంలో ఉదయం 11.30 గంటలప్పుడు ఫ్యాన్‌కు ఆధారంగా ఉన్న ఇనుప రాడ్‌ విరిగిపోయింది. దీంతో ఫ్యాన్‌ ఊడి విద్యార్థిపై అమాంతం పడింది. ఈ ప్రమాదంలో బాలుడి ముక్కుకు తీవ్ర గాయమైంది. వెంటనే ఉపాధ్యాయులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు విద్యార్ధిని పరీక్షించి ఆరు కుట్లు వేశారు. గాయపడిన కుమారుడిని చూసి విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యాను ఊడిపోయే స్థితిలో ఉన్నా ఉపాధ్యాయులు గమనించకపోవడాన్ని గ్రామస్థులు తప్పుపట్టారు. ప్రస్తుతం సదరు పాఠశాలలో నాడు-నేడు పనులు కొనసాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.