AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మద్యం కిక్కులో రైల్వే ట్రాక్‌పై లారీ నడిపిన మందుబాబు.. అదే టైంకి అటుగా వచ్చిన రైలు! ఆ తర్వాత ఏం జరిగిందంటే..

మద్యం మత్తులో ఓ వ్యక్తి లారీని రైలు పట్టాలపై నడిపాడు. అయితే లారీ టైర్లు రైలు పట్టాల మధ్యలో చిక్కుకుపోవడంతో దానిని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఇంతలో అదే ట్రాక్‌పై వస్తున్న ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లోని లోకో పైలట్‌ పట్టాలపై లారీ ఉండటాన్ని గమనించి.. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. దీంతో ట్రక్కును కొద్దిగా తాకుతూ రైలు ఆగిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. పంజాబ్‌లోని లూథియానాలో శుక్రవారం (నవంబర్‌ 24) రాత్రి వేళ ఈ సంఘటన జరిగింది..

Viral Video: మద్యం కిక్కులో రైల్వే ట్రాక్‌పై లారీ నడిపిన మందుబాబు.. అదే టైంకి అటుగా వచ్చిన రైలు! ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Drunk Man Leaves Truck On Rail Tracks
Srilakshmi C
|

Updated on: Nov 26, 2023 | 9:06 AM

Share

లూథియానా, నవంబర్‌ 26: మద్యం మత్తులో ఓ వ్యక్తి లారీని రైలు పట్టాలపై నడిపాడు. అయితే లారీ టైర్లు రైలు పట్టాల మధ్యలో చిక్కుకుపోవడంతో దానిని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఇంతలో అదే ట్రాక్‌పై వస్తున్న ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లోని లోకో పైలట్‌ పట్టాలపై లారీ ఉండటాన్ని గమనించి.. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. దీంతో ట్రక్కును కొద్దిగా తాకుతూ రైలు ఆగిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. పంజాబ్‌లోని లూథియానాలో శుక్రవారం (నవంబర్‌ 24) రాత్రి వేళ ఈ సంఘటన జరిగింది.

మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్‌ షేర్పూర్ ఫ్లైఓవర్ సమీపంలోని లూథియానా-ఢిల్లీ రైల్వే ట్రాక్‌ పైకి లారీని నడిపాడు. రైలు పట్టాల మధ్యలో ఇరుక్కుపోవడంతో అది ముందుకు కదలలేదు. దీంతో ఆ లారీని అక్కడే వదిలేసి డ్రైవర్‌ లూథియానా రైల్వే స్టేషన్ వైపు వెళ్లిపోయాడు. ఇంతలో గోల్డెన్ టెంపుల్ ఎక్స్‌ప్రెస్ అదే ట్రాక్‌పై వచ్చింది. మరి కాసేపట్లో స్టేషన్‌కు చేరుకోవల్సి ఉండగా రైల్వే ట్రాక్‌పై లారీ ఉండటాన్ని లోకోపైలట్‌ గమనించాడు. అప్రమత్తమైన ఎక్స్‌ప్రెస్ రైలు లోకో పైలట్ సమయానికి బ్రేకులు వేసి రైలును ఆపు చేశాడు.

ఇవి కూడా చదవండి

దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. లారీని తాకుతూ రైలు కొంతదూరంలో ఆగింది. రైల్వే ట్రాక్‌పై లారీ ఇరుక్కున్న సమాచారం అందడంతో లూథియానా రైల్వే స్టేషన్‌లోని ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సహాయంతో రైల్వే ట్రాక్‌పై నుంచి ట్రక్కును తొలగించారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.

రైల్వే ట్రాక్‌పై లాకీ ట్రక్కు ఇరుక్కుపోయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో పోలీసు బృందం లారీ ట్రక్కును ట్రాక్ నుంచి తొలగిస్తున్న దృశ్యాలు చూడొచ్చు.లూథియానా నుంచి న్యూఢిల్లీకి వెళ్లాల్సిన స్వర్ణ్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (12030)ని కూడా ముందుజాగ్రత్త చర్యగా నిలిపివేశారు. గవర్నమెంట్ రైల్వే పోలీసులు (జిఆర్‌పి), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్), రైల్వే ట్రాఫిక్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు క్రేన్ సహాయంతో లారీ ట్రక్కును ట్రాక్ నుంచి తొలగించారు. అనంతరం నిలిచిపోయిన రైళ్లు కొంత ఆలస్యంగా బయలుదేరాయి. ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న లారీ డ్రైవర్‌ కోసం వెతుకుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.