Lemon: మద్యంలో నిమ్మకాయ పిండుకుంటున్నారా.? ఏమవుతుందో తెలుసా.?

అయితే నిమ్మకాయతో ఎన్ని లాభాలు ఉన్నాయి సరిగ్గా తీసుకోకపోతే అన్నే నష్టాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మనుక తెలిసో, తెలియకో నిమ్మకాయను ఉపయోగించే విధానం ద్వారా ఆరోగ్యానికి దుష్ప్రభావాలు కలుగుతాయి. నిమ్మకాయను ఎట్టి పరిస్థితుల్లో కొన్ని పదార్థాలతో కలిపి తీసుకోకూడదు. చాలా మంది ఆల్కహాల్‌లో నిమ్మకాయ పిండుకొని సేవిస్తుంటారు...

Lemon: మద్యంలో నిమ్మకాయ పిండుకుంటున్నారా.? ఏమవుతుందో తెలుసా.?
Lemon
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 26, 2023 | 8:05 AM

నిమ్మకాయతో కలిగే ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విటమిన్‌ సికి పెట్టింది పేరైన నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. విటమిన్‌ సి రోగనిరోధక శక్తి పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆహారం జీర్ణం కావడంలోనూ నిమ్మకాయ ఉపయోడపతుతుంది. ఉదయాన్నే నిమ్మరసం తాగడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గుకుండా ఉంటుంది.

అయితే నిమ్మకాయతో ఎన్ని లాభాలు ఉన్నాయి సరిగ్గా తీసుకోకపోతే అన్నే నష్టాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మనుక తెలిసో, తెలియకో నిమ్మకాయను ఉపయోగించే విధానం ద్వారా ఆరోగ్యానికి దుష్ప్రభావాలు కలుగుతాయి. నిమ్మకాయను ఎట్టి పరిస్థితుల్లో కొన్ని పదార్థాలతో కలిపి తీసుకోకూడదు. చాలా మంది ఆల్కహాల్‌లో నిమ్మకాయ పిండుకొని సేవిస్తుంటారు. ఇది మంచిది కాదంటా. ఇంతకీ నిమ్మకాయను ఏ పదార్థాలతో కలిపి తీసుకోకూడదు, తీసుకుంటే కలిగే నష్టాలు ఏంటి.? లాంటి వివరాలు మీకోసం..

* ఇంట్లో పనీర్‌ తయారు చేసుకోవాలంటే పాలను విరగ్గొట్టడానికి మరుగుతున్న పాలలో నిమ్మరసం పిండుతుంటారు. అయితే దీనివల్ల పాలలో ఉండే యాసిడ్‌ ప్రోటీన్లు దెబ్బతింటాయి. దీంతో యాసిడ్‌ రిఫ్లెక్షన్‌ ఏర్పడి గుండెల్లో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు ఏర్పడతాయి. అందుకే పనీర్‌లో నిమ్మరసం కలపడం మంచిది కాదు.

* ఇక కొన్ని రకాల సలాడ్స్‌లో నిమ్మరసం పిండుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే కొన్ని రకాల పండ్లో నిమ్మరసం కలపడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బొప్పాయి, నిమ్మ, నారింజ వంటి సిట్రస్‌ పండ్లతో నిమ్మరసం కలిపి తీసుకుంటే ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి.

* ఇక ఆల్కహాల్‌లో నిమ్మరసం కలుపుకొని తీసుకునే వారు మనలో చాలా మందే ఉంటారు. ముఖ్యంగా కాక్టెయిల్స్, రెడ్‌ వైన్‌, బీర్స్‌ వంటి వాటిలో నిమ్మరసాన్ని కలుపుకొని తాగుతుంటారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. నిమ్మలోని ఎసిడిటీ రెడ్‌వైన్‌లోని టానిన్‌లను ప్రభావితం చేయడం వల్ల వైన్‌ చేదెక్కడంతోపాటు దుష్ఫ్రభావాలూ కలుగుతాయి.

* స్పైసీ ఫుడ్‌లో నిమ్మరసాన్ని కలుపుకోవడం సర్వసాధారణమైన విషయం బిర్యానీ మొదలు, చికెన్‌ కర్రీ వరకు అన్నింటిలో నిమ్మకాయ రసాన్ని పిండుకొని తింటుంటాం. అయితే ఇది మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల శరీరంలో వేడి పెరగడంతో పాటు జీర్ణక్రియ సమస్యలు ఏర్పడతాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..