Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunday Fasting: ఆదివారం ఉపవాసం ఎలా ఉండాలి, పూజా విధానం, ప్రాముఖ్యత ఏమిటంటే

ఎవరి జాతకంలోనైనా సూర్యునికి సంబంధించిన ఏదైనా దోషం ఉన్నట్లయితే సూర్య భగవానుని పూజించడం, ఆదివారం ఉపవాసం ఉండడం వల్ల మేలు జరుగుతుంది. సూర్యభగవానుని ఆరాధించడం వల్ల జీవితంలో సుఖసంతోషాలు, అదృష్టాలు లభిస్తాయి. ఆదివారం పూజ  మతపరమైన ప్రాముఖ్యత..  ఉపవాసం చేయడానికి సరైన మార్గం ఏమిటో మనం తెలుసుకుందాం.

Sunday Fasting: ఆదివారం ఉపవాసం ఎలా ఉండాలి, పూజా విధానం, ప్రాముఖ్యత ఏమిటంటే
Sunday Astro Tips
Follow us
Surya Kala

|

Updated on: Nov 26, 2023 | 6:55 AM

హిందూ మతంలో ఆదివారం చేసే ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. హిందువుల విశ్వాసం ప్రకారం ఆదివారం రోజున సూర్య భగవానుని పూజించాలనే నియమం ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడు ఇతర గ్రహాలకు రాజుగా పరిగణిస్తారు. ఎవరి జాతకంలోనైనా సూర్యునికి సంబంధించిన ఏదైనా దోషం ఉన్నట్లయితే సూర్య భగవానుని పూజించడం, ఆదివారం ఉపవాసం ఉండడం వల్ల మేలు జరుగుతుంది. సూర్యభగవానుని ఆరాధించడం వల్ల జీవితంలో సుఖసంతోషాలు, అదృష్టాలు లభిస్తాయి. ఆదివారం పూజ  మతపరమైన ప్రాముఖ్యత..  ఉపవాసం చేయడానికి సరైన మార్గం ఏమిటో మనం తెలుసుకుందాం.

ఆదివారం ఉపవాసం, పూజా విధానం

ఆదివారం భాస్కరుని అనుగ్రహం పొందడానికి సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి. అనంతరం శుభ్రమైన రాగి పాత్రను తీసుకుని అందులో నీటిని తీసుకొని సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. అప్పుడు పూజా స్థలంలో ఎర్రని చాప లేదా ఏదైనా ఎర్రటి దుప్పటిపై కూర్చుని సూర్య భగవానుని పూజించడం ప్రారంభించండి. సూర్య భగవానుడి బీజ్ మంత్రంతో జపమాలతో ఐదు మార్లు  జపించండి. ఆ తర్వాత ఆదివారం ఉపవాసం, ఆదిత్య హృదయ స్తోత్రం పఠించండి.

సూర్య నారాయణునికి ధూపం, అక్షత, పాలు, ఎర్రటి పువ్వులు, అర్ఘ్యం సమర్పించడం ఒక ప్రత్యేక ఫలంగా పరిగణించబడుతుంది. ఆదివారం పూజ సమయంలో సూర్య భగవానుడికి ఎర్రచందనం సమర్పించిన తర్వాత, దానిని ప్రసాదంగా నుదుటిపై ధరించండి. సూర్యదేవుడి నమస్కారం ముందు.. మీరు నిలబడి ఉన్న ప్రదేశం చుట్టూ తిరిగి అర్ఘ్యం సమర్పించి నమస్కరించండి.

ఇవి కూడా చదవండి

ఉపవాస సమయంలో ఏమి తినాలి..  ఏమి తినకూడదు

ఆదివారం ఉపవాస సమయంలో గోధుమ రొట్టె లేదా బెల్లం కలిపి తినాలని నియమం ఉంది. ఈ ఉపవాస సమయంలో ఉప్పు అస్సలు తీసుకోరాదు. అటువంటి పరిస్థితిలో ఈ ఆహారం లేదా పానీయానికి ఉప్పు కలపవద్దు. ఉప్పుని ఏ విధంగానూ తినవద్దు. ఆదివారం వ్రత ఉద్యాపన చేసే సమయంలో కనీసం నలుగురు బ్రాహ్మణులకు ఆహారాన్ని అందించండి. ఎర్రటి బట్టలు, పండ్లు, స్వీట్లు, పువ్వులు, కొబ్బరికాయ, దక్షిణ ఇచ్చి వారి ఆశీర్వాదం పొందండి.

ఆదివారం ఉపవాసం మతపరమైన ప్రాముఖ్యత

సనాతన సంప్రదాయం ప్రకారం జీవితంలో కీర్తి, ఆనందం, శ్రేయస్సు పొందడానికి సూర్య భగవానుని పూజించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఆదివారం ఉపవాసం సూర్యుని అనుగ్రహాన్ని పొందడానికి, సంతోషంగా, ఆరోగ్యంగా , గౌరవప్రదంగా ఉండటానికి ఉత్తమ మార్గంగా పరిగణించబడుతుంది. మత విశ్వాసాల ప్రకారం సూర్యభగవానుని ఆరాధించడం వల్ల జాతక దోషాలు తొలగిపోతాయి. ప్రతికూల శక్తులు  దూరంగా ఉంటాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

డిస్పోజబుల్‌ కప్స్‌, కవర్స్‌.. డేంజర్‌ బెల్స్‌ వీడియో
డిస్పోజబుల్‌ కప్స్‌, కవర్స్‌.. డేంజర్‌ బెల్స్‌ వీడియో
ఒకే ఒక్క సినిమా చేసింది.. కట్ చేస్తే రూ.44,250 కోట్లకు మహారాణి. 
ఒకే ఒక్క సినిమా చేసింది.. కట్ చేస్తే రూ.44,250 కోట్లకు మహారాణి. 
జనసేన కార్యకర్త కొడుకును భుజంపైకి ఎక్కించుకున్న పవన్‌ కల్యాణ్‌..
జనసేన కార్యకర్త కొడుకును భుజంపైకి ఎక్కించుకున్న పవన్‌ కల్యాణ్‌..
మొక్కలు పుష్పించడం లేదా.. బియ్యం బెస్ట్ ఎరువు.. ఎలా యూజ్ చేయాలంటే
మొక్కలు పుష్పించడం లేదా.. బియ్యం బెస్ట్ ఎరువు.. ఎలా యూజ్ చేయాలంటే
వారి నుంచి రూ.416 కోట్ల రికవరీ..కేంద్ర మంత్రి సమాధానం ఇదే..!
వారి నుంచి రూ.416 కోట్ల రికవరీ..కేంద్ర మంత్రి సమాధానం ఇదే..!
ఐసీయూలో అమ్మ.. ఐపీఎల్‌ వద్దనుకుని సేవలు చేస్తోన్న స్టార్ హీరోయిన్
ఐసీయూలో అమ్మ.. ఐపీఎల్‌ వద్దనుకుని సేవలు చేస్తోన్న స్టార్ హీరోయిన్
స్వీట్స్ అంటే ఇష్టమా.. షుగర్ ఫ్రీ మఖానా ఖీర్ రెసిపీ.. మీ కోసం
స్వీట్స్ అంటే ఇష్టమా.. షుగర్ ఫ్రీ మఖానా ఖీర్ రెసిపీ.. మీ కోసం
లోకేష్‌తో మీటింగ్.. ఇప్పాల రవీంద్రారెడ్డి ఎవరో తెలుసా..?
లోకేష్‌తో మీటింగ్.. ఇప్పాల రవీంద్రారెడ్డి ఎవరో తెలుసా..?
సిగ్గులొలుకుతున్న ఈ చిన్నది ఎవరో కనిపెట్టరా.. ?
సిగ్గులొలుకుతున్న ఈ చిన్నది ఎవరో కనిపెట్టరా.. ?
మ్యాక్స్‌వెల్‌కు శ్రేయస్‌ అయ్యర్‌ క్షమాపణలు!
మ్యాక్స్‌వెల్‌కు శ్రేయస్‌ అయ్యర్‌ క్షమాపణలు!