- Telugu News Photo Gallery Spiritual photos World's first 3D printed Hindu temple is being built in Siddipet which spans 4,000 sq ft and is 35.5 feet tall
3D Temple: తెలంగాణాలో ప్రపంచంలోనే మొట్టమొదటి 3డి ప్రింటెడ్ దేవాలయం.. రేపటి నుంచి భక్తులకు దర్శనం
వాస్తుశిల్ప సౌందర్యం, సాంకేతిక పరిఙ్ఞానంతో అసాధారణమైన రీతిలో నిర్మించిన ఆధ్యాత్మిక అద్భుతం సిద్దిపేటలోని ‘ప్రపంచంలోనే మొట్టమొదటి 3డి ప్రింటెడ్ హిందూ దేవాలయం’ విశేషంగా ఆకట్టుకొంటుంది. సింప్లిఫోర్జ్ క్రియేషన్స్‌తో కలిసి అప్సుజా ఇన్‌ఫ్రాటెక్ ఆధ్వర్యంలో సిద్దిపేటలోని చార్విత మెడోస్‌లో ఈ వినూత్న దేవాలయాన్ని ప్రారంభించారు.
Updated on: Nov 23, 2023 | 1:39 PM

సిద్దిపేట నడిబొడ్డున బూరుగుపల్లి, వాయుపురి వేదికగా నెలకొల్పిన ఈ ఐకానిక్ టెంపుల్ సాంస్కృతిక వారసత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ దేవాలయ ప్రారంభోత్సవంలో అప్సుజా ఇన్‌ఫ్రాటెక్ మేనేజింగ్ డైరెక్టర్ హరి కృష్ణ జీడిపల్లి, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అమిత్ ఘూలే, సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ వసీం చౌదరి పాల్గొన్నారు.

నెలల తరబడి కష్టపడి, అంకితభావంతో రూపొందించబడిన ఈ ఆలయం సాంప్రదాయ, అత్యాధునిక సాంకేతికత సమ్మిళిత్వాన్ని ప్రదర్శిస్తుంది. ఈ నిర్మాణ అద్భుతం, 35.5 అడుగుల పొడవు మరియు 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇది మానవ చాతుర్యం, భక్తికి విస్మయపరిచే నిదర్శనంగా నిలుస్తుంది.

ప్రతిష్టాపన పూర్తయిన తర్వాత నవంబర్ 24వ తేదీ నుంచి ప్రజల సందర్శన కోసం అందుబాటులో ఉంటుంది. ఈ ఆలయం ఆధ్యాత్మిక సౌరభం, వాస్తుశిల్ప వైభవవం భక్తులను మంత్ర ముగ్ధులను చేస్తుంది.

ఈ సంధర్భంగా అప్సుజా ఇన్‌ఫ్రాటెక్ మేనేజింగ్ డైరెక్టర్ హరికృష్ణ జీడిపల్లి మాట్లాడుతూ.. నవీనత, సంప్రదాయాల సమన్వయంతో దైవ దర్శనానికి జీవం పోస్తూ సిద్దిపేటలోని చర్విత మెడోస్‌లో 3డిలో నిర్మించిన హిందూ దేవాలయం మన అంకితభావానికి నిదర్శనమన్నారు.

సాంకేతికతను ఆధ్యాత్మికతతో విలీనం చేయడం, కాలాన్ని మించిన పవిత్రమైన స్థలాన్ని ఏర్పరచడం కోసం ఎంతో కృషి చేశామని' తెలిపారు. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అమిత్ ఘూలే మాట్లాడుతూ “ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే మొట్టమొదటి 3డి ఆలయం.

ఈ నిర్మాణం, నిర్మాణ అవసరాలు, ఆలయ రూపకల్పన సూత్రాలు, 3డి ప్రింటింగ్ అవసరాలు, ఇన్-సైట్ నిర్మాణంలో సవాళ్లతో కూడుకున్నది. కాన్సెప్ట్ యొక్క సరిహద్దులు, ఎత్తైన ప్రాంతాలు, డెజర్ట్‌లు, మంచుతో నిండిన ప్రాంతాలు వంటి అగమ్య ప్రాంతాలలో సింప్లిఫోర దృఢమైన సిస్టమ్‌ల భవిష్యత్తు అప్లికేషన్‌లకు వేదికగా నిలుస్తుందన్నారు.

ఇది సవాలు చేసే భూభాగం, విపత్తు దెబ్బతిన్న ప్రాంతాలు మరియు రక్షణ అనువర్తనాలతో అప్లికేషన్‌లను కలిగి ఉంటుందనీ తెలిపారు.
