- Telugu News Photo Gallery Spiritual photos Tirumala Sri Srinivasa Divyanugrah Homam Started Bhumana Participated, See Photos
Tirumala: శాస్త్రోక్తంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ప్రారంభం.. భక్తులకూ అవకాశం.. ఎలాగంటే?
అలిపిరి లోని సప్త గో ప్రదక్షణ మందిరంలో నేటి నుంచి శ్రీ శ్రీనివాస దివ్య అనుగ్రహ హోమాన్ని నిరంతరాయంగా టీటీడీ నిర్వహించనుంది. ప్రతిరోజు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు జరిగే శ్రీ శ్రీనివాస దివ్య అనుగ్రహ హోమం ప్రారంభ కార్యక్రమంలో టీటీడీ భూమన కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి పాల్గొన్నారు. నేటి నుంచి ప్రతి రోజూ నిరంతరాయంగా హోమాన్ని నిర్వహించనున్న టిటిడి రూ. 1000 టికెట్ ధర చెల్లించి గృహస్తులు ఇద్దరు హోమంలో పాల్గొనే అవకాశం కల్పించింది
Updated on: Nov 23, 2023 | 9:15 PM

అలిపిరి వద్ద టీటీడీ నేటినుంచి శ్రీ శ్రీనివాస దివ్య అనుగ్రహ హోమాన్ని నిర్వహిస్తోంది. అలిపిరి లోని సప్త గో ప్రదక్షణ మందిరంలో నేటి నుంచి శ్రీ శ్రీనివాస దివ్య అనుగ్రహ హోమాన్ని నిరంతరాయంగా టీటీడీ నిర్వహించనుంది. ప్రతిరోజు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు జరిగే శ్రీ శ్రీనివాస దివ్య అనుగ్రహ హోమం ప్రారంభ కార్యక్రమంలో టీటీడీ భూమన కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి పాల్గొన్నారు. నేటి నుంచి ప్రతి రోజూ నిరంతరాయంగా హోమాన్ని నిర్వహించనున్న టిటిడి రూ. 1000 టికెట్ ధర చెల్లించి గృహస్తులు ఇద్దరు హోమంలో పాల్గొనే అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఆఫ్ లైన్ లో 50 ఆన్ లైన్ లో 50 టికెట్లు జారీ చేస్తున్న టీటీడీ త్వరలో స్లాటెడ్ విధానంలో టికెట్స్ విడుదల చేయనుంది.

హోమం ప్రారంభ కార్యక్రమంలో భాగంగా ఎస్వీ వేదిక్ యూనివర్సిటీ నుంచి అలిపిరిలోని సప్త గో ప్రదక్షణ మందిరం వరకు వేద విద్యార్థుల ప్రదర్శన జరిగింది. హోమ ప్రాశస్త్యాన్ని తెలుపుతూ చేపట్టిన వేద విద్యార్థులు, కళా బృందాల ప్రదర్శనలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం భవిష్యత్తులో టీటీడీ మరిన్ని భక్తి చైతన్య కార్యక్రమాలు నిర్వహించనుందన్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి టిటిడి చేపట్టిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం విశేషంగా భక్తులను చేరుకుంటుందన్నారు.

అలాగే హైందవ సంస్కృతి కాపాడుకోవడానికి ఈ విశేష హోమం ఉపయోగ పడుతుందన్నారు భూమన. శ్రీ వేంకటేశ్వర స్వామి సంకల్పంతో జరుగుతున్న హోమం ఇదన్నారు. ప్రతి నిత్యం నిరాటంకంగా, నిర్విఘ్నంగా ఇది కొనసాగుతుందన్నారు. రోజుకు 100 మంది భక్తులకు టికెట్స్ అందుబాటులోకి తీసుకువచ్చామని, శాశ్వతంగా విశాల వేదిక నిర్మాణానికి దాత సహాయం అందిస్తున్నారన్నారు.

అతి తక్కువ ఖర్చుతో జరుపుకునే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమానికి డిసెంబర్ నెలాఖరుకు ఇప్పటికే టికెట్లను భక్తులు బుక్ చేసున్నారన్నారు. రానున్న రోజుల్లో ప్రత్యక్షంగానూ, వర్చువల్ గా పాల్గొనే విధంగా అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. శ్రీనివాస కల్యాణాలు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని అందరికీ మేలు జరిగే కార్యక్రమాన్ని ఆదరించాలని కోరుతున్నామన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.

తరతరాలుగా సనాతన హైందవ సంస్కృతిలో హోమానికి విశేష ప్రాధాన్యత ఉందన్నారు. భక్తుల కోరికలను భగవంతునికి చేర్చే ఒక బృహత్తర కార్యక్రమానికి టీటీడీ శ్రీకారం చుట్టిందన్నారు. ఎంతో ఖర్చు, శ్రమతో కూడిన హోమ కార్యక్రమాన్ని భక్తుల కోసం తక్కువ ఖర్చుతో ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం 9 నుండి 11 గంటల వరకు ఈ హోమ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. దాత సహకారంతో త్వరలో దాదాపు 500 మంది గృహస్తులు కూర్చుని హోమ కార్యక్రమంలో పాల్గొనేలా వేదికను నిర్మించబోతున్నట్లు భూమన తెలిపారు.

ఎస్వీ వేద విశ్వవిద్యాలయం నుండి అలిపిరి వరకు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ ప్రారంభోత్సవ ఊరేగింపు జరిగింది. టిటిడి చైర్మన్ భూమనతో పాటు ఈఓ ధర్మారెడ్డి పాల్గొనగా వేద విద్యార్థులు, అధ్యాపకులు, భజన మండళ్ల కళాకారులు ఊరేగింపు ఆకట్టుకుంది. హోమం ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి రోజా తో పాటు టిటిడి పాలకమండలి సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు

'ప్రతి ఒక్క భక్తుడు ఈ హోమం లో పాల్గొనేందుకు టిటిడి అవకాశం కల్పించిందన్నారు. రూ. 1000 టికెట్ ధర తో తక్కువ ఖర్చుతో హోమంలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు' మంత్రి ఆర్కే రోజా.
