జామకాయ నిల్వ పచ్చడి.. ఊరగాయలాగే ఇలా చేసి తింటే అలెర్జీ సమస్యలు మాయం 

Prasanna Yadla

01 March 2026

Pic credit - Pixabay

జామకాయ నిల్వ పచ్చడి గురించి ఎప్పుడైనా విన్నారా? వీటిని మనం తింటాం కదా.. పచ్చడి ఎలా చేస్తామా అని సందేహిస్తున్నారా? 

జామకాయ నిల్వ పచ్చడి

 మామిడికాయలతో మాత్రమే కాకుండా పండ్లతో కూడా పచ్చడి చేసుకుని తినొచ్చు. ఒకసారి మీరు చేస్తే ప్రతి ఏడాది చేసుకుని తింటారు.

జామకాయ నిల్వ పచ్చడి

ఈ జామ నిల్వ పచ్చడికి కావాల్సిన పదార్ధాలు, దీనిని ఎలా తయారుచేయాలో ఇక్కడ వివరంగా చూద్దాం

ఎలా తయారు చేయాలంటే? 

 15 పచ్చి జామకాయలు, 200 గ్రాముల నూనె,  ఎండు మిర్చి కారం, ఆవాల పొడి, మెంతి పొడి,  ఉప్పు రుచికి సరిపడినంత, 20 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పసుపును తీసుకోవాలి. 

కావాల్సిన పదార్ధాలు

ముందుగా జామకాయలను తీసుకుని బాగా శుభ్రపరచి తడి లేకుండా ఆరబెట్టి ఆ తర్వాత నిమ్మకాయలో సైజ్ లో చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 

స్టెప్ - 1

ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని జామకాయ ముక్కలకు కొద్దిగా ఉప్పు, కారం మెంతు ఆవ పిండి ఒక కప్పు నూనె వేసి బాగా పట్టించాలి

స్టెప్ - 2

స్టవ్ వెలిగించి పాన్‌ పెట్టి దానిలో ఆయిల్ వేసి రెండు ఎండుమిర్చి, నాలుగు కరివేపాకు ఆకులు, వెల్లుల్లి రెబ్బలు వేసి ఈ మిశ్రమాన్ని  పచ్చడిలో మిక్స్ అయ్యేలా గరిటేతో కలుపుకోవాలి.

స్టెప్ - 3

ఈ పచ్చడిని తీసుకుని గాజు సీసాలో నిల్వ చేసుకుంటే రుచికరంగా ఉంటుంది. అయితే, మూడు రోజులు కదిలించకుండా అలాగే వదిలేసి నాలుగో రోజు వేడి వేడి అన్నంలో తింటే అద్భుతంగా ఉంటుంది. 

స్టెప్ - 4