Weekly Horoscope: ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలు వింటారు.. 12 రాశుల వారికి వారఫలాలు ఇలా..
వార ఫలాలు (నవంబర్ 26 నుంచి డిసెంబర్ 2, 2023 వరకు): మేష రాశి వారికి ఈ వారం గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా సానుకూలంగా గడిచిపోతుంది. వృషభ రాశి వారికి రెండు మూడు శుభ గ్రహాలను అనుకూలంగా సంచరిస్తున్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మిథున రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
వార ఫలాలు (నవంబర్ 26 నుంచి డిసెంబర్ 2, 2023 వరకు): మేష రాశి వారికి ఈ వారం గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా సానుకూలంగా గడిచిపోతుంది. వృషభ రాశి వారికి రెండు మూడు శుభ గ్రహాలను అనుకూలంగా సంచరిస్తున్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మిథున రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా సానుకూలంగా గడిచిపోతుంది. ఒక విధంగా బాగా కలిసి వచ్చే సమయం ఇది. ఆదాయానికి లోటుండదు. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి, ఉద్యోగాలపరంగానే కాకుండా, కుటుంబపరంగా కూడా ప్రశాంతంగా గడిచిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. అనవసర పరిచయాలకు, విలాసాలకు, దురలవాట్లకు దూరంగా ఉండడం మంచిది. విలాసాలు, వ్యసనాల మీద డబ్బు బాగా ఖర్చయ్యే అవకాశం ఉంది. మంచి మిత్రులు పరిచయం అవుతారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. విహార యాత్రకు ప్లాన్ చేయడం జరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
రెండు మూడు శుభ గ్రహాలను అనుకూలంగా సంచరిస్తున్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఒత్తిడి, శ్రమ బాగా తగ్గిపోతాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. వృత్తి వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ఉద్యో గంలో ఆదరణ పెరుగుతుంది. ప్రతిభకు, శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. పిల్లల నుంచి శుభ వార్తలు వినడం జరుగుతుంది. కుటుంబంలో అనుకోకుండా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. బంధువుల్లో కొందరు అపనిందలు వేయడం, దుష్ర్పచారం సాగించడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఒకరిద్దరు స్నేహితులను ఆర్థికంగా ఆదుకుం టారు. విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు అందివస్తాయి. దాంపత్య జీవితం అనుకూలంగా సాగిపో తుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆర్థిక ప్రయ త్నాలు సత్ఫలితాలనిస్తాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి. మొత్తం మీద అన్ని విధాలుగానూ కలిసి వచ్చే కాలం ఇది. వీలైనంతగా సద్వినియోగం చేసుకోవడం మంచిది. ప్రతి చిన్న ప్రయత్నం అనుకూల ఫలితాలను ఇస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడు తుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా కోలుకునే సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాలలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబానికి సంబంధించిన ఒకటి రెండు సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతాయి. ఆదాయం చాలావరకు ఆశాజనకంగా ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
గ్రహ బలం పూర్తి స్థాయిలో అనుకూలంగా లేనందువల్ల కొద్దిగా మిశ్రమ ఫలితాలు అనుభవానికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఏ పనైనా, ఏ ప్రయత్నమైనా, ఏ వ్యవహారమైనా ఒత్తిడి, వ్యయ ప్రయాసలతో కానీ పూర్తి కావు. కొన్ని మంచి పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. వృత్తి, ఉద్యోగాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ప్రయాణాలలో అతి జాగ్రత్తగా ఉండడం మంచిది. డబ్బు గానీ, విలువైన వస్తువులు గానీ పోగొట్టుకునే అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించడం మంచిది. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, అనవసర ఖర్చులు మీదపడే సూచనలున్నాయి. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఈ రాశివారికి శనీశ్వరుడి ప్రభావం ఈ వారం ఎక్కువగా ఉంది. ఫలితంగా ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆర్థికంగా, వ్యక్తిగతంగా కొన్ని కష్టనష్టాలు తప్పకపోవచ్చు. దీర్ఘ కాలిక అనారోగ్యాలు, మొండి వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారికి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలోనే కాక, కుటుంబపరంగా కూడా అదనపు బాధ్యతలు మీద పడవచ్చు. సంతానం నుంచి లేదా జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు వింటారు. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదాలకు, స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. తల్లితండ్రుల జోక్యంతో సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఈ రాశివారికి గ్రహ బలం కాస్తంత ప్రతికూలంగా ఉన్నందువల్ల మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. కొన్ని ప్రయత్నాలు ఇబ్బంది పెడతాయి. వ్యక్తిగత సమస్యలు ఒత్తిడిని పెంచుతాయి. ఇక ఉద్యోగంలో కూడా బాగా శ్రమ ఉంటుంది. అధికారులు అదనపు బాధ్యతలు అప్పగించడమో, లక్ష్యాలను పెంచడమో జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం పరవాలేదనిపిస్తుంది. అనవసర ఖర్చులు అదుపు తప్పుతాయి. ఆహార, విహా రాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. సేవా కార్యక్రమాల్లో గానీ, సహాయ కార్యక్రమాల్లో గానీ పాల్గొంటారు. కుటుంబ సభ్యు లతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. వాగ్దానాలు చేయకపోవడం మంచిది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
శుభ గ్రహాలు బాగా అనుకూలంగా సంచారం చేయడం వల్ల, ముఖ్యంగా రాశ్యధిపతి శుక్రుడు ఈ రాశిలో ప్రవేశిస్తున్నందువల్ల శుభవార్తలు వినడం, ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఉద్యోగానికి సంబంధించి తప్పకుండా శుభవార్తలు వినడం జరుగుతుంది. ఆదాయం పెరిగి, కొద్దిగా ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. కుటుంబానికి సంబంధించి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వాదోపవాదాలకు అవకాశం ఇవ్వవద్దు. వృత్తి జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారంలో కలిసి వస్తుంది. ఏ ప్రయత్నం ప్రారంభిస్తే అది నెరవేరుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ )
రాశ్యధిపతి కుజుడు స్వస్థానంలో ఉండడం వల్ల ముఖ్యమైన వ్యవహారాలు, పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. చేసే పనులలో చొరవ పెరుగుతుంది. తలపెట్టిన పనులు ప్రశాంతంగా పూర్తవు తాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది కానీ, కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. తోబుట్టువు లతో సఖ్యత బాగా పెరుగుతుంది. కొత్తవారు పరిచయం అవుతారు. ఉద్యోగం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. చిన్ననాటి స్నేహితులు కలుస్తారు. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు తదితర వృత్తి నిపుణులకు సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరే సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
రాశ్యధిపతి గురువుతో సహా కొన్ని ముఖ్యమైన గ్రహాలు ప్రస్తుతం అనుకూలంగా సంచరిస్తున్నం దువల్ల వృత్తి, ఉద్యోగాల్లోనే కాక వ్యక్తిగతంగా కూడా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు పూర్తిగా అనుకూలంగా మారతాయి. కుటుంబానికి సంబంధించి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. ఆదాయ పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. డబ్బు ఇవ్వాల్సినవారు తీసుకు వచ్చి ఇస్తారు. ఆరోగ్యం కూడా చాలావరకు మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు, సాఫీగా సాగిపోతాయి. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్య మైన పనులు పూర్తి చేస్తారు. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. తోబుట్టువులకు సహాయంగా ఉంటారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
రాశ్యధిపతి శనీశ్వరుడితో సహా అయిదు గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. ఉద్యోగంలోనే కాక, కుటుం బానికి సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైన బాధ్యతలు పూర్తి చేస్తారు. తొందరపాటుతో వ్యవహ రించవద్దు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యక్తిగత సమస్య ఒకటి దానం తటదే పరిష్కారం అవుతుంది. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగు తాయి. సామాజికంగా కూడా ఆశించిన గుర్తింపు లభిస్తుంది. డబ్బు నష్టపోయే సూచనలున్నాయి.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఏలిన్నాటి శని ప్రభావం వల్ల కొన్ని కష్టనష్టాలు తప్పకపోవచ్చు. శని, కుజుల పరస్పర వీక్షణ వల్ల అటు ఉద్యోగంలోనూ, ఇటు కుటుంబంలోనూ కొద్దిగా టెన్షన్లు పెరిగే అవకాశం ఉంది. ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది. సాధారణ సమస్యలను కూడా భూతద్దంలో చూడడం సమంజసం కాదు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆదాయం పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల, చేసే ప్రయత్నాల వల్ల మున్ముందు కలిసి వస్తుంది. నిరుద్యోగులు శుభవార్త వినడం జరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
రాశ్యధిపతి గురువు ధన స్థానంలో బలంగా ఉన్నప్పటికీ, ఈ మీన రాశిలో రాహువు సంచారం వల్ల, ఏలిన్నాటి శని ప్రభావం వల్ల కొద్దిగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు ఒత్తిడికి గురి చేస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, అనవసర ఖర్చులు, అనుకోని ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో ఒత్తిడి, శ్రమ పెరిగే అవకాశం ఉంది. అదనపు బాధ్యతల వల్ల, సహచరులతో బాధ్యతలు పంచుకోవాల్సి రావడం వల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద దృష్టి కేంద్రీకరించడం మంచిది.