Women Astrology: రాశి మారుతున్న బుధుడు, శుక్రుడు.. ఆ రాశికి చెందిన మహిళలకు అదృష్ట యోగం.. !
స్త్రీలకు అనుకూల గ్రహాలైన బుధ, శుక్ర, గురు గ్రహాలు బాగా అనుకూలంగా మారబోతున్నందువల్ల స్త్రీల జీవితాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇందులో బుధుడు ఈ నెల 27న ధనుస్సులో ప్రవేశిస్తుండడం, శుక్రుడు ఈ నెల 29న తన స్వస్థానమైన తులా రాశిలో ప్రవేశించడం ముఖ్యంగా మహిళలకు అదృష్టాన్ని తీసుకు వస్తాయి. ఈ అదృష్ట యోగం రెండు నెలల పాటు అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది.
Budha and Shukra Gochar 2023: కొన్ని రాశుల మహిళలకు వృత్తి, ఉద్యోగాల పరంగానే కాకుండా ఆదాయ ప్రయత్నాల ద్వారా, ఆర్థిక లావాదేవీల ద్వారా అదృష్టం పండే రోజులివి. స్త్రీలకు అనుకూల గ్రహాలైన బుధ, శుక్ర, గురు గ్రహాలు బాగా అనుకూలంగా మారబోతున్నందువల్ల స్త్రీల జీవితాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇందులో బుధుడు ఈ నెల 27న ధనుస్సులో ప్రవేశిస్తుండడం, శుక్రుడు ఈ నెల 29న తన స్వస్థానమైన తులా రాశిలో ప్రవేశించడం ముఖ్యంగా మహిళలకు అదృష్టాన్ని తీసుకు వస్తాయి. ఈ అదృష్ట యోగం రెండు నెలల పాటు అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది.
- మేషం: ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్రుడు, భాగ్య స్థానంలో బుధుడు ప్రవేశించడం వల్ల తప్పకుండా మహిళలకు యోగం పడుతుంది. మహిళా ఉద్యోగులు అధికారం చేపట్టడం, మహిళా అధికారులు మరింత ఉన్నత స్థాయికి వెళ్లడం వంటివి జరుగుతాయి. పోటీ పరీక్షల్లో చక్కని ఫలితాలు సాధించే అవకాశం ఉంది. నిరుద్యోగులు బాగా లాభపడడం జరుగుతుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, భాగస్వామ్యాలు, స్పెక్యులేషన్లు ఆశించిన ఫలితాలనిస్తాయి.
- వృషభం: ఈ రాశినాథుడైన శుక్రుడు స్వస్థానంలో ప్రవేశిస్తున్నందువల్ల, బుధుడు అష్టమ స్థానంలో సంచరించబోతున్నందువల్ల ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాలపరంగా అదృష్టం పట్టే అవకాశం ఉంది. బుధ, శుక్రులు సంచరిస్తున్న రెండు స్థానాలూ వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన స్థానాలే అయినందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఉన్న మహిళలకు స్థిరత్వం లభించడం, ప్రమోషన్లు రావడం, జీత భత్యాలు రావడం వంటివి జరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు సఫలం అవుతారు.
- మిథునం: పంచమ స్థానంలో శుక్రుడు, సప్తమ స్థానంలో రాశ్యధిపతి బుధుడు సంచారం ప్రారంభించడం వల్ల ఈ రాశి మహిళలు వృత్తి, ఉద్యోగాలలోనే కాకుండా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిం చడం జరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యం కూడా అన్ని విధాలుగానూ కలిసి వస్తుంది. ప్రయాణాలు లాభి స్తాయి. ఆర్థికంగా తాము పైకి రావడమే కాకుండా, ఇతరులకు చేయూతనందించడం కూడా జరుగుతుంది.
- కర్కాటకం: ఈ రాశికి శుక్రుడు నాలుగవ స్థానానికి రావడమే ఒక విశేషం కాగా, అది శుక్రుడికి స్వస్థానం కావడం మరో విశేషం. ఈ రాశి స్త్రీలు ఆర్థికంగా బాగా బలపడతారు. ఆస్తి విలువ పెరుగుతుంది. ఆస్తిపాస్తులు సమకూరుతాయి. తల్లి వైపు నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. వారసత్వ సంపద లభించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో మంచి గుర్తింపు, స్థిరత్వం లభించే అవకాశం ఉంది. సామాజికంగా హోదా పెరుగుతుంది. దాంపత్య జీవితం సుఖమయం అవు తుంది.
- సింహం: ఈ రాశికి తృతీయ స్థానంలో శుక్రుడు, పంచమ స్థానంలో బుధుడు సంచారం చేయడంతో పాటు గురువు వీక్షణ కూడా ఉండడం వల్ల ఈ రాశి మహిళలకు పట్టిందల్లా బంగారం కావడానికి అవ కాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. మంచి ఉద్యోగాల్లోకి మారే అవకాశం కూడా ఉంటుంది. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా నెరవేరుతుంది. ప్రయాణాలు లాభి స్తాయి. ఆర్థికంగా విశేషమైన పురోగతి ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశముంది.
- కన్య: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్ర గ్రహం ధన, కుటుంబ స్థానంలోకి ప్రవేశించడం, ఈ రాశ్యధిపతి అయిన బుధుడు చతుర్థ స్థానంలో సంచరించడం వంటి కారణాల వల్ల ఈ రాశి మహిళల జీవి తాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీవితం సానుకూల మలుపులు తిరుగుతుంది. గృహ, వాహన సౌకర్యాలకు అవకాశం ఉంది. అద్దె ఇళ్లలో ఉన్నవారు తప్పకుండా సొంత ఇంటి లోకి మారే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలతో పాటు సామాజికంగా కూడా మంచి గుర్తింపు లభిస్తుంది.
- తుల: ఈ రాశిలోకి ఈ రాశినాథుడు సుఖసంతోషాలకు, భోగభాగ్యాలకు కారకుడు అయిన శుక్రుడు ప్రవే శించడం వల్ల జీవితం తాలూకు దశ, దిశ పూర్తిగా మారిపోయే అవకాశం ఉంటుంది. అనేక విధా లుగా అదృష్టం కలిసి వస్తుంది. వ్యక్తిగత సమస్యలు దాదాపు పూర్తిగా పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురే ఉండదు. ఉద్యోగావకాశాలు బాగా కలిసి వస్తాయి. ప్రముఖుల కోవలో చేరిపోయే అవకాశం కూడా ఉంది. భోగ భాగ్యాలు, సుఖ సంతోషాలకు హద్దులుండవు.
- వృశ్చికం: ఈ రాశికి ఒక వైపు శుక్రుడు, మరొక వైపు బుధుడు ప్రవేశించడమన్నది ఒక మహా యోగంగా పరిగణించాల్సి ఉంటుంది. దీన్ని శుభార్గళ యోగం అంటారు. దీనివల్ల మహిళల మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మాటకు విలువ పెరుగుతుంది.
- ధనుస్సు: ఈ రాశిలో బుధుడు ప్రవేశించడం, శుక్రుడు కూడా లాభస్థానంలో సంచారం ప్రారంభించడం వల్ల మహిళలకు కనీవినీ ఎరుగని పురోగతి ఉంటుంది. ప్రతిదీ సానుకూలంగా గడిచిపోతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. రావ లసిన డబ్బు చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రమోషన్లకు, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంటుంది. అనేక మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
- మకరం: ఈ రాశికి వృత్తి, ఉద్యోగాల స్థానంలో శుక్రుడు ప్రవేశించడం వల్ల, భాగ్యాధిపతి బుధుడు వ్యయ స్థానంలోకి వస్తున్నందువల్ల విదేశాలలో ఉద్యోగాలకు, చదువులకు ప్రయత్నిస్తున్న మహిళలకు శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు సాధారణంగా దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవ కాశం ఉంటుంది. తండ్రి వైపు నుంచి సిరిసంపదలు కలిసి వచ్చే సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. సామాజికంగా ప్రాభవం పెరుగుతుంది.
- కుంభం: ఈ రాశికి లాభస్థానంలో బుధుడు, భాగ్య స్థానంలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల మహిళలు ఎటు వంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ముందుకు దూసుకుపోవడం జరుగుతుంది. మనసు లోని కోరికలు నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. దాంపత్య జీవితం సుఖమయం అవుతుంది. కొత్త ఆలోచనలు, నిర్ణయాలు చాలావరకు సానుకూల ఫలితాలనిస్తాయి.
- మీనం: ఈ రాశికి ఉద్యోగ స్థానంలో బుధుడు, అష్టమ స్థానంలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల ఈ రాశికి చెందిన మహిళలకే కాక, వారి జీవిత భాగస్వాములకు కూడా అదృష్టం పట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు, శక్తి సామర్థ్యాలు బాగా వెలుగులోకి వస్తాయి. ఈ రాశి స్త్రీల మాటకు, చేతకు తిరుగుండదు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పలుకుబడి పెరుగు తుంది. కుటుంబ జీవితంలో మనస్పర్థలు ఏవైనా ఉంటే సమసిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.