Astro Tips: ఈ 4 రాశుల స్త్రీలు తమ బాధను చిరునవ్వుతో దాచేస్తారు.. వీరి స్నేహం వెరీ వెరీ స్పెషల్

కొందరు స్త్రీలు ఆత్మస్తైర్యం కలవారుగా ఉండి చేపట్టిన పనిని ఎన్ని అడ్డంకులు ఎదురైనా సాధిస్తారు. అదే సమయంలో తమకు ఎన్ని బాధలు, కష్ట, నష్టాలు ఎదురైనా సరే.. అవతలివారికి తెలియకూడదని చిరునవ్వు మాటున తమ బాధలను దాచుకుంటారు. ముఖ్యంగా నాలుగు రాశులకు చెందిన స్త్రీలు కష్టం ఎదురైతే అద్భుతమైన ఆత్మబలంతో వ్యవహరిస్తారు. అంతర్గత పోరాటాన్ని ఇతరులకు కనిపించకుండా తమ చిరునవ్వుతో దాచేస్తారు. ఆ రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..  

Astro Tips: ఈ 4 రాశుల స్త్రీలు తమ బాధను చిరునవ్వుతో దాచేస్తారు.. వీరి స్నేహం వెరీ వెరీ స్పెషల్
Sadness Hide With A Smile
Follow us
Surya Kala

|

Updated on: Nov 21, 2023 | 2:32 PM

ప్రపంచంలో భిన్నమైన ఆలోచనలు, వ్యక్తిత్వం కలిగిన మనుషులున్నారు. కొందరు జీవితం చిన్నది ఉన్నంతలో సంతోషంగా జీవించాలనే ఆలోచన కలిగి ఉంటె.. మరికొందరు.. జీవితంలో ఎదో సాధించాలంటూ నిరంతరం శ్రమ పడుతూ ఉంటారు. అదే విధంగా ప్రతి వ్యక్తి ఆలోచన తీరు, నడవడికలను రాశులను బట్టి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది. ఈ నేపథ్యంలో జనన సమయం, తిధి, ప్లేస్ ను బట్టి కూడా వ్యక్తుల ఆలోచనగా తీరు ఉంటుందని వెల్లడించింది. కొందరు స్త్రీలు ఆత్మస్తైర్యం కలవారుగా ఉండి చేపట్టిన పనిని ఎన్ని అడ్డంకులు ఎదురైనా సాధిస్తారు. అదే సమయంలో తమకు ఎన్ని బాధలు, కష్ట, నష్టాలు ఎదురైనా సరే.. అవతలివారికి తెలియకూడదని చిరునవ్వు మాటున తమ బాధలను దాచుకుంటారు. ముఖ్యంగా నాలుగు రాశులకు చెందిన స్త్రీలు కష్టం ఎదురైతే అద్భుతమైన ఆత్మబలంతో వ్యవహరిస్తారు. అంతర్గత పోరాటాన్ని ఇతరులకు కనిపించకుండా తమ చిరునవ్వుతో దాచేస్తారు. ఆ రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

మిథున రాశి: ఈ రాశికి చెందిన స్త్రీలు స్నేహశీలితను కలిగి ఉంటారు. అనుకూలతతో నడుచుకుంటారు. తమకు ఎదురైన సవాళ్ళను ఎదుర్కొనేందుకు ఉల్లాసంగా ముందుకు వస్తారు. వీరికి ఆత్మపరిశీలన ఎక్కువ.. చిరునవ్వుతో లోతైన భావోద్వేగాల క్షణాలను దాచగలరు. ప్రతికూలతను ఎదుర్కోగల బలమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.

సింహ రాశి: ఈ రాశికి చెందిన స్త్రీలు ఆత్మవిశ్వాసానికి పెట్టింది పేరు. అంతేకాదు శక్తివంతమైన నారీగా  పేరుగాంచుతారు. ఈ రాశికి చెందిన స్త్రీలు తమ అంతర్గతంగా ఉన్న ఆలోచనలు, చెలరేగే గందరగోళాన్ని  ఇతరులకు తెలియకుండా ప్రకాశవంతమైన చిరునవ్వును ఉపయోగిస్తారు. తమ విచారాన్ని, కష్టాన్ని ముఖం మీద చిరునవ్వుతో దాచేస్తారు.  తమ దుర్బలత్వాన్ని, కష్టాన్ని ఇతరులు తెలియకుండా పెదువుల మీద చిరునవ్వుని తెచ్చుకునే నేర్పు వీరి సొంతం.

ఇవి కూడా చదవండి

ధనుస్సు రాశి: ధనుస్సు రాశికి చెందిన స్త్రీలు సాహసోపేతంగా ఉంటారు. అంతేకాదు ఆశావాదులు కూడా.. తమకు వచ్చిన ఎటువంటి బాధనైనా తగ్గించడానికి తరచుగా చిరునవ్వును ఉపయోగిస్తారు. దుఃఖాన్ని ఇతరులకు కనిపించడకుండా చేయడానికి చిరునవ్వుని అరువు తెచ్చుకుంటారు. ఈ ఆలోచనాతీరు.. వీరి మనసులో ఎంత అంతర్గత పోరాటం జరుగుతున్నప్పటికీ ఉత్సాహభరితమైన స్ఫూర్తిని కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది.

మీన రాశి: ఈ మీన రాశి స్త్రీలు దయగల స్వభావాణ్ణి కలిగి ఉంటారు. సున్నితమైన మనస్కులు. చిరు మందహాసం వెనుక తమకున్న విచారాన్ని దాచే నేర్పు కలిగి ఉంటారు. అయితే వీరులో ఇతరులతో మానసికంగా కనెక్ట్ అయ్యే సామర్ధ్యం ఎక్కువ. వీరు ఎన్ని వ్యక్తిగత సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ.. తమ  చుట్టూ ఉన్నవారి శ్రేయస్సుకు ప్రాధాన్యతనిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు