AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips: ఈ రాశులకు చెందిన వ్యక్తులకు ప్రాక్టికాలిటీ ఫుల్.. హాస్య రసం నిల్..

మరి కొందరు మాత్రం ఎప్పుడూ సీరియస్ గా ఉంటారు. అంతేకాదు నవ్వినా.. నవ్వించినా అదేదో చెయ్యరాని నేరం అన్నట్లు ఉంటారు. వాస్తవానికి హాస్యం అనేది జీవితంలోని ఒక ముఖ్యమైన అంశం.. ఇది వివిధ రూపాల్లో వ్యక్తమవుతుంది. కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు హాస్యచతురతకు దూరంగా ఉంటారు.  ఆ రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.. 

Astro Tips: ఈ రాశులకు చెందిన వ్యక్తులకు ప్రాక్టికాలిటీ ఫుల్.. హాస్య రసం నిల్..
Astro Tips
Surya Kala
|

Updated on: Nov 17, 2023 | 8:32 AM

Share

నవ్వడం ఒక భోగం .. నవ్వించడం ఒక యోగం.. నవ్వక పోవడం ఒక రోగం అన్నారు పెద్దలు. కొందరితో పరిచయం కూడా అవతలి వ్యక్తులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అయితే మరి కొందరు మాత్రం ఎప్పుడూ సీరియస్ గా ఉంటారు. అంతేకాదు నవ్వినా.. నవ్వించినా అదేదో చెయ్యరాని నేరం అన్నట్లు ఉంటారు. వాస్తవానికి హాస్యం అనేది జీవితంలోని ఒక ముఖ్యమైన అంశం.. ఇది వివిధ రూపాల్లో వ్యక్తమవుతుందని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది. కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు హాస్యచతురతకు దూరంగా ఉంటారు.  ఆ రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

మకర రాశి: ఈ రాశి వారు క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే స్వభావానికి ప్రసిద్ధి చెందారు. వీరు తమ జీవితంలో  అనేక అంశాలలో రాణిస్తున్నప్పటికీ.. తీవ్రమైన దృక్పథాన్ని కలిగి ఉంటారు. మకరరాశి వారు బాధ్యతకు ప్రాధాన్యత ఇస్తారు. లక్ష్యాలపై వారి దృష్టిని సారిస్తారు.. తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడంతో.. కొన్నిసార్లు వీరి జీవితంలో సరదాగా ఉండడానికి సమయం లేకుండా పోతుంది.

కన్య రాశి: ఈ రాశి వారి విశ్లేషణాత్మకంగా ఉంటారు. వివరాల ఆధారిత మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంతేకాదు వీరు పరిపూర్ణత, ప్రాక్టికాలిటీ పట్ల నిబద్ధతను కలిగి ఉంటారు. అంతేకాదు చిన్న చిన్న విషయాలకు కూడా తీవ్రమైనవిగా పరిగణిస్తారు. అంతేకాదు తీవ్రమైన స్వరంతో జీవితాన్ని గెలవడానికి ప్రయత్నిస్తారు. వీరు హాస్యాన్ని ఆనందిస్తారు.. అయితే చిన్న చిన్న విషయాలకే నవ్వరు.

ఇవి కూడా చదవండి

వృశ్చిక రాశి: ఈ రాశి వారు తీవ్రమైన భావోద్వేగ స్వభావానికి ప్రసిద్ధి. వీరు ఉద్వేగభరితమైన వ్యక్తులు అంతేకాదు విశ్వసనీయమైన వ్యక్తులు కూడా. ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ సంబంధాలను చక్కగా ఉండేలా చూస్తారు. అయితే అన్నింటా తామే పెద్ద అన్నట్లు బాధ్యత తీసుకుని ఉండడంతో వీరిలో హాస్యచతురత అనే భావం మరుగుపడి ఉండవచ్చు. ఈ రాశివారు అర్థవంతమైన బంధాలకు విలువ ఇస్తారు. తమ చర్యల్లో హాస్యానికి ప్రాధాన్యత  ఇవ్వరు,

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు