Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుట్టిన సమయం వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది.. ఉదయం, సాయంత్రం వేళలో జన్మిస్తే..

జ్యోతిషశాస్త్రంలో మనోహరమైన పాత్రను పోషిస్తుంది. పుట్టిన సమయం ఉదయం లేదా సాయంత్రం జీవితంపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ రోజు వ్యక్తి జీవితంలో  పుట్టిన సమయం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.. పుట్టిన సమయం ప్రాముఖ్యత:మీ పుట్టిన సమయం వ్యక్తి రాశి లేదా నక్షత్రాన్ని నిర్ణయిస్తుంది. ప్రపంచంలో అడుగుపెట్టిన వ్యక్తికి గల  కమ్యూనికేషన్‌ను సూచిస్తుంది.

పుట్టిన సమయం వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది.. ఉదయం, సాయంత్రం వేళలో జన్మిస్తే..
Birth Time
Follow us
Surya Kala

|

Updated on: Nov 16, 2023 | 9:38 AM

ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్ ఎలా ఉంటుంది తమ జీవితంలో మంచి చెడుల గురించి తెలుసుకోవాలని కోరుకుంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రంలో జనన సమయం, తిథి, ప్రదేశం రాశులబట్టి వ్యక్తుల మంచి చెడుల గురించి తెలుసుకుంటారు. అదే న్యూమరాలజీలో జనన తేదీ బట్టి వ్యక్తి మంచి చెడుల గురించి వెల్లడిస్తారు. అయితే రాశులతో పాటు పుట్టిన సమయం కూడా జ్యోతిషశాస్త్రంలో మనోహరమైన పాత్రను పోషిస్తుంది. పుట్టిన సమయం ఉదయం లేదా సాయంత్రం జీవితంపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ రోజు వ్యక్తి జీవితంలో  పుట్టిన సమయం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం..

పుట్టిన సమయం ప్రాముఖ్యత:

మీ పుట్టిన సమయం వ్యక్తి రాశి లేదా నక్షత్రాన్ని నిర్ణయిస్తుంది. ప్రపంచంలో అడుగుపెట్టిన వ్యక్తికి గల  కమ్యూనికేషన్‌ను సూచిస్తుంది.

ఉదయం (AM) జన్మిస్తే: ఉదయం జన్మించిన వ్యక్తులు సాధారణంగా చురుకైన..  ఆశాజనకంగా ఉంటారు, జీవశక్తిని కలిగి ఉండి జీవితాన్ని అందంగా మలచుకుంటారు. తేజస్సును వెదజల్లుతారు. ముందు చూపు ఉన్న స్వభావం వీరి సొంతం. దీంతో వీరిని సహజ నాయకులుగా తయారు చేస్తుంది. ప్రవృత్తితో అందరిని ఆకర్షిస్తారు. ఉదయం జన్మించిన వారు సానుకూల దృక్పథాన్ని ప్రదర్శిస్తారు.

ఇవి కూడా చదవండి

సాయంత్రం (PM) జన్మించినవారు: సాయంత్రం జన్మించిన వ్యక్తులు అంతర్ దృష్టి కలిగి ఉంటారు. సృజనాత్మకతతో చేపట్టిన పనిని పూర్తి చేస్తారు. ఎటువంటి సమస్యలైనా పరిష్కారం చేసే నేచర్ కలిగి ఉంటారు. సాయంత్రం జన్మించిన వ్యక్తులు వీరు రహస్య స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరి వ్యక్తిత్వంతో ఇతరులను అయస్కాంతంలా ఆకర్షిస్తారు.  సాయంత్రం జన్మించిన వారు కలలు సృహనాత్మకంగా ఉంటాయి.  వివిధ కళాత్మక కార్యక్రమాల్లో  సృజనాత్మకతతో బలమైన సంబంధాన్ని పెంచుకుంటారు.

జనన సమయం రాశితో కలయిక:

పుట్టిన సమయం రాశికి చెందిన గుర్తుతో కలిసి ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అంటే ఉదయం మేష రాశికి సాయంత్రం మేష రాశికి ఉన్న నేచర్ భిన్నంగా ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు