Black Thread Rules: చేతికి, కాలికి రక్షణ దారం కట్టుకుంటున్నారా.. దీనికీ కొన్ని నియమాలున్నాయని తెలుసా..

చాలా మంది తమ పాదాలకు నల్ల దారం కూడా ధరిస్తారు. ఇలా ధరించడం వల్ల చెడు దృష్టి పడకుండా చేస్తుందని జాతక దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. అయితే ఇలా రక్షణ దారం  ధరించడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. వీటిని విస్మరించడం వల్ల శుభం కలిగించే బదులు అశుభకరం. మణికట్టుకు లేదా పాదాలకు ధరించే రక్షణ దారం ధరించే ముందు పాటించాల్సిన నియమాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

Black Thread Rules: చేతికి, కాలికి రక్షణ దారం కట్టుకుంటున్నారా.. దీనికీ కొన్ని నియమాలున్నాయని తెలుసా..
Black Thread Rules
Follow us
Surya Kala

|

Updated on: Nov 14, 2023 | 12:01 PM

హిందూ మతంలో పూజ చేయడానికి కొన్ని నియమాలున్నాయి. ముఖ్యంగా దేవాలయాల్లో పూజ చేసిన తర్వాత చేతికి కొందరు నల్లని దారాన్ని.. లేదా ఎర్రని దారాన్ని కట్టుకుంటారు.  ఇలా రక్షా దారాన్ని కట్టుకోవడంతో పూజ పరిపూర్ణం అయినట్లు భావిస్తారు. హిందూ మతంలో ఈ దారం రక్షణ సూత్రంగా పరిగణించబడుతుంది. దీనిని ధరించడం వల్ల మనిషి జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. అంతేకాదు చాలా మంది తమ పాదాలకు నల్ల దారం కూడా ధరిస్తారు. ఇలా ధరించడం వల్ల చెడు దృష్టి పడకుండా చేస్తుందని జాతక దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. అయితే ఇలా రక్షణ దారం  ధరించడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. వీటిని విస్మరించడం వల్ల శుభం కలిగించే బదులు అశుభకరం. మణికట్టుకు లేదా పాదాలకు ధరించే రక్షణ దారం ధరించే ముందు పాటించాల్సిన నియమాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

చేతికి రక్షణ దారం కట్టే సమయంలో

చేతి మణికట్టుకి రక్షణగా దారం కట్టుకుంటుంటే చేతి చుట్టూ మూడు సార్లు మాత్రమే చుట్టాలి. మత విశ్వాసం ప్రకారం ఇలా మూడు సార్లు చుట్టడానికి ఒక కారణం ఉంది.  సాధకుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఆశీర్వాదం పొందుతాడని విశ్వాసం. అంతేకాదు లక్ష్మీ దేవి, పార్వతి ఆశీస్సులు లభిస్తాయి. అదే సమయంలో గ్రహణం తర్వాత చేతికి ఉండే రక్షణ దారాన్ని తొలగించాలి. సూతక కాలంలో ఇది అపవిత్రంగా మారుతుందని నమ్ముతారు. కనుక గ్రహణం ముగిసిన తర్వాత చేతికి ఉన్న దారం తీసి దానిని ప్రవహించే నీటిలో వెయ్యాలి.  లేదా రావి చెట్టుకి కట్టాలి. అంతేకానీ ఎప్పుడు ఈ రక్షణ దారాన్ని చెత్తబుట్టలో వేయకూడదని గుర్తుంచుకోండి. అలా చేయడం అశుభంగా భావిస్తారు.

పాదాలకు నల్ల దారం కట్టే విషయంలో పాటించాల్సిన నియమం

పాదాలకు నల్ల దారం కట్టుకోవడం వల్ల జాతకంలో కుండలి దోషం తొలగిపోతుందని నమ్ముతారు. అదే సమయంలో నల్ల దారాన్ని కట్టడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శనివారం నల్ల దారాన్ని కట్టడం చాలా శుభప్రదంగా, ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది మరింత ప్రభావవంతంగా ఉండడం కోసం  రుద్ర గాయత్రీ మంత్రాన్ని జపించాలి.

ఇవి కూడా చదవండి

ఆర్ధికంగా నష్టాలు తప్పవు. మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు