Vastu Tips: బాత్‌రూమ్‌లో ఈ వస్తువులు ఉన్నాయా.? ఇబ్బందులు తప్పవు..

ఇలాంటి వాటిలో ఇంటి బాత్‌ రూమ్‌ ఒకటి. దాదాపు మనలో చాలా మంది కేవలం హాల్‌, బెడ్ రూమ్‌, కిచెన్‌లో వాస్తు ప్రకారం వస్తువులు ఉంటే చాలని అనుకుంటాం. అయితే బాత్‌రూమ్‌లో ఉంచే వస్తువుల విషయంలో కూడా వాస్తు పండితులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం బాత్‌రూమ్‌లో ఎట్టి పరిస్థితుల్లో కొన్ని వస్తువులను ఉంచకూడదని చెబుతున్నారు. తెలిసో తెలియకో ఉంచే కొన్ని వస్తువుల వల్ల వాస్తు...

Vastu Tips: బాత్‌రూమ్‌లో ఈ వస్తువులు ఉన్నాయా.? ఇబ్బందులు తప్పవు..
Wash Room
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 14, 2023 | 2:59 PM

ఇంట్లో ప్రతీ గది వాస్తుకు అనుకూలంగా ఉండేలా చూసుకుంటాం. అందుకోసం వాస్తు పండితుల సలహాలు, సూచనలు తీసుకుంటుంటారు. కేవలం ఇంటి నిర్మాణంలోనే కాకుండా ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలోనూ వాస్తు చిట్కాలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

ఇలాంటి వాటిలో ఇంటి బాత్‌ రూమ్‌ ఒకటి. దాదాపు మనలో చాలా మంది కేవలం హాల్‌, బెడ్ రూమ్‌, కిచెన్‌లో వాస్తు ప్రకారం వస్తువులు ఉంటే చాలని అనుకుంటాం. అయితే బాత్‌రూమ్‌లో ఉంచే వస్తువుల విషయంలో కూడా వాస్తు పండితులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం బాత్‌రూమ్‌లో ఎట్టి పరిస్థితుల్లో కొన్ని వస్తువులను ఉంచకూడదని చెబుతున్నారు. తెలిసో తెలియకో ఉంచే కొన్ని వస్తువుల వల్ల వాస్తు దోశం ఏర్పడి ఇంట్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతాయి. ఇంతకీ బాత్‌రూమ్‌లో ఎలాంటి వస్తువుల ఉంచకూడదు.? ఇప్పుడు తెలుసుకుందాం..

* సాధారణంగా ఇంట్లో అసలు పగిలిన అద్దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు. బాత్‌రూమ్‌లో కూడా పగిలిన అద్దాన్ని పెట్టుకోకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. పగిలిన అద్దం ఇంట్లో ఉంచడం వల్ల వాస్తు దోషాలు వస్తాయి. పగిలిన అద్దం ఉంచడం వల్ల ఇంట్లో ఆర్థిక పరిస్థితులు దిగజారుతాయని చెబుతున్నారు.

* బాత్‌రూమ్‌లో చెప్పులను ఉపయోగించడం సర్వసాధారణమైన విషయమే అయితే కొందరు ఎలాగో బాత్‌రూమ్‌లో వాడే చెప్పులే కదా అని పాడైపోయినవి, తెగిపోయిన వాటిని ఉపయోగిస్తుంటారు. అయితే వాస్తు వాస్తు శాస్తు ప్రకారం ఇది అస్సలు మంచిదికాదని నిపుణులు చెబుతున్నారు. తెగిపోయిన చెప్పులు ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ పెరగడానికి కారణంగా మారుతుంది. కాబట్టి ఇలాంటి చెప్పులను వెంటనే ఇంటి నుంచి తొలగించాలి.

* ఇక బాత్‌రూమ్‌లో ఉండే బకెట్‌ను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. బక్కెట్‌లో కొంతైనా నీరు ఎప్పుడూ ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఖాళీ బకెట్‌ దురదృష్టానికి సూచికగా చెబుతుంటారు.

* ఇక బాత్‌రూమ్‌లో ఎప్పుడూ ట్యాప్‌లు లీక్‌ కాకుండా చూసుకోవాలి. ఇలా నీరు నిత్యం లీక్‌ అవుతుంటే.. ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ పెరగడంతో పాటు, డబ్బు నీటిలా వృథాగా పోతుందని వాస్తు పండితులు చెబుతున్నారు.

* కొందరు దుస్తులను పిండిన తర్వాత చాలా సేపు తడి దుస్తులను బాత్‌రూమ్‌లలోనే ఉంచుతుంటారు. అయితే ఇలా చేయడం మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. తడి దుస్తులను బాత్‌రూమ్‌లో వదిలేస్తే దోషం కలుగుతుందని చెబుతున్నారు. దుస్తులను పిండేసిన వెంటనే ఆరేయాలని చెబుతున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..