AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: టీటీడీ బోర్డు సంచలన నిర్ణయం.. ఇకపై కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ..

టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన పాలకమండలి కీలక నిర్ణయాలను ప్రకటించింది. ఈ నెల 23 నుంచి అలిపిరిలో శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్విరామంగా నిర్వహించాలని నిర్ణయించారు. టికెట్లు ఆన్‌లైన్‌లో ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ధర వెయ్యి రూపాయిలు. ఇక టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయించిన వడమాల పేటలో 25 కోట్ల 67 లక్షలతో రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

Tirumala: టీటీడీ బోర్డు సంచలన నిర్ణయం.. ఇకపై కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ..
Bhumana Karunakar Reddy
Basha Shek
|

Updated on: Nov 14, 2023 | 8:36 PM

Share

టీటీడీ కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు కొండంత ఊరట దొరికింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌ను పర్మినెంట్‌ చేస్తున్నట్టు టీటీడీ బోర్డు ప్రకటించింది. టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన పాలకమండలి కీలక నిర్ణయాలను ప్రకటించింది. ఈ నెల 23 నుంచి అలిపిరిలో శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్విరామంగా నిర్వహించాలని నిర్ణయించారు. టికెట్లు ఆన్‌లైన్‌లో ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ధర వెయ్యి రూపాయిలు. ఇక టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయించిన వడమాల పేటలో 25 కోట్ల 67 లక్షలతో రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. వ్యయాన్ని ఉద్యోగుల నుంచి రీఎంబర్స్‌ చేస్తారు. సీఎం జగన్‌ప్రకటన మేరకు టీటీడీలోని ప్రతీ ఉద్యోగి సహా రిటైరయిన వాళ్లకు కూడా ఇంటి స్థలాలు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేశామన్నారు భూమన. ఇక బ్రహ్మోత్సవాల బహుమానం పేరిట టీటీడీ ఉద్యోగులకు 14 వేలు, కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌కు దాదాపు 7వేలు నగదు ప్రొత్సాహాన్ని ఇవ్వాలని కూడా నిర్ణయించింది టీటీడీ.

ఇక ప్రసాదాల ముడిసరకుల నిల్వ కోసం అలిపిరి దగ్గర 11 కోట్లతో గోడౌన్ల నిర్మణం, మంగళం నుంచి రేణిగుంట వరకు రూ.15 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణం, రూ. 6.15 కోట్ల వ్యయంతో తిరుపతిలోని రామ్ నగర్ క్వార్టర్స్ అభివృద్ధి పనులు, పుదిపట్ల జంక్షన్ నుంచి వకులామాత ఆలయం వరకు 21 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణంకు సంబంధించి టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది టీటీడీ. వీటితో పాటు ఆయుర్వేద హస్పిటల్, రుయాలో నూతన భవనాల నిర్మాణం.. స్విమ్స్‌లో రూ 74 కోట్లతో కార్డియో,న్యూరో బ్లాక్‌ను అభివృద్ధికి పాలకమండలి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది పాలకమండలి.

ఇవి కూడా చదవండి

ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి అధ్యక్షతన టీటీడీ బోర్డు సమావేశం..

బ్రహ్మోత్సవ బహుమానాల పేరిట..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి