Bigg Boss Telugu 7: అశ్విని శ్రీకి ఇష్టం లేని పెళ్లి చేసిన పేరెంట్స్.. అందుకే భర్తతో విడాకులు.. అసలు విషయమిదే

ప్రముఖ బుల్లితెర రియాల్టీ షో బిగ్‌బాస్ షో పదో వారం ఆఖరుకు వచ్చేసింది. ఈ వీక్‌ ఎలిమినేషన్‌పై సోషల్‌ మీడియాలో సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే దీంతో పాటు బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ అశ్వినీకి శ్రీకి వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ అందాల తారకు ఇదివరకే పెళ్లైందట.

Bigg Boss Telugu 7: అశ్విని శ్రీకి ఇష్టం లేని పెళ్లి చేసిన పేరెంట్స్.. అందుకే భర్తతో విడాకులు.. అసలు విషయమిదే
Ashwini Sri
Follow us
Basha Shek

|

Updated on: Nov 11, 2023 | 9:39 PM

ప్రముఖ బుల్లితెర రియాల్టీ షో బిగ్‌బాస్ షో పదో వారం ఆఖరుకు వచ్చేసింది. ఈ వీక్‌ ఎలిమినేషన్‌పై సోషల్‌ మీడియాలో సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే దీంతో పాటు బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ అశ్వినీకి శ్రీకి వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ అందాల తారకు ఇదివరకే పెళ్లైందట. సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తే.. ఏం అవుతుందోననే భయంతో ముందే అశ్విని తల్లిదండ్రులు 2013లోనే పెళ్లి చేశారట. అయితే భర్తతో విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకుని విడిపోయిందట. భర్తకు దూరమయ్యాకనే మళ్లీ సినిమా కెరీర్‌ మీద అశ్వినీ ఫోకస్‌ పెట్టిందట. అయితే ఈ విషయంలో ఎంత నిజం ఉంది అనేది తెలియదు కానీ ఈ వార్త మాత్రం సామాజిక మాధ్యమాల్లో మాత్రం బాగా వైరల్‌ అవుతోంది. అయితే బిగ్‌బాస్ ఆడియెన్స్‌ మాత్రం అశ్వినీకి పెళ్లి కాలేదని భావిస్తున్నారు. అశ్విని శ్రీ విషయానికొస్తే.. ప్రస్తుతం హౌజ్‌లో కొనసాగుతున్న నలుగురు లేడీ కంటెస్టెంట్లలో ఆమె కూడా ఒకరు. మరి బాగా ఆడుతుందని చెప్పలేం కానీ రోజురోజుకూ తన ఆటతీరుతో బిగ్‌ బాస్ ఆడియెన్స్‌ను అలరిస్తోంది. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి అడుగుపెట్టిన ఆమె తన క్యూట్‌ లుక్స్‌తో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. అయితే గేమ్స్‌, టాస్కుల్లో మాత్రం చురుగ్గా పార్టిసిపేట్‌ చేయలేకపోయింది. ఇప్పుడిప్పుడే తన ఆటతీరును మెరుగుపర్చుకుంటోంది.

కాగా అశ్విని శ్రీ వరంగల్‌ నిట్‌ కాలేజీలోనే బీటెక్ పూర్తి చేసింది. అయితే స్నేహితుల సలహాతో మోడలింగ్‌లోకి అడుగుపెట్టిందట. అయితే సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లేందుకు అశ్విని శ్రీ తల్లిదండ్రులు అంగీకరించలేదట. అయితే పట్టుబట్టి మొదట మోడలింగ్‌, ఆతర్వాత సినిమాల్లోనూ అడుగుపెట్టిందట. మహేశ్‌ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో రష్మిక మందన్నా అక్క పాత్రలో మెరిసింది. అలాగే రాజా ది గ్రేట్‌ సినిమాలో రవితేజ తో కలిసి ఓ పాటలో హుషారైన స్టెప్పులేసింది. అలాగే అమీర్ పేట్ లో,బీటెక్ బాబులు, నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్ వంటి చిన్న సినిమాల్లో నటించింది. అయితే పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. అయితే సోషల్‌ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు బోలెడు ఫాలోయింగ్‌ ఉంది. అదే క్రేజ్‌తో ఇప్పుడు బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి అడుగుపెట్టింది. మరి ఎన్నిరోజుల పాటు హౌజ్‌లో కొనసాగుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ హౌజ్ లో అశ్విని శ్రీ..

View this post on Instagram

A post shared by Ashwini Sri (@ashwinii_sree)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే