Balakrishna: ‘నన్ను ఎవడైనా అలా పిలిస్తే దబిడి దిబిడే.. పగిలిపోద్దంతే’.. స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చిన బాలయ్య

అఖండ, వీరసింహారెడ్డి వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ తర్వాత నందమూరి బాలకృష్ణ నటించిన మరో యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ భగవంత్‌ కేసరి. అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీలో శ్రీలీల బాలయ్య కూతురిగా నటించింది. సీనియర్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ మరో కీలక పాత్రలో మెరిసింది. బాలీవుడ్‌ హ్యాండ్సమ్‌ హీరో అర్జున్‌ రామ్‌పాల్‌ విలన్‌గా భయపెట్టాడు. దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలైన భగవంత్‌ కేసరి మూవీ సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళుతోంది

Balakrishna: 'నన్ను ఎవడైనా అలా పిలిస్తే దబిడి దిబిడే.. పగిలిపోద్దంతే'.. స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చిన బాలయ్య
Balakrishna
Follow us

|

Updated on: Nov 10, 2023 | 9:45 PM

అఖండ, వీరసింహారెడ్డి వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ తర్వాత నందమూరి బాలకృష్ణ నటించిన మరో యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ భగవంత్‌ కేసరి. అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీలో శ్రీలీల బాలయ్య కూతురిగా నటించింది. సీనియర్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ మరో కీలక పాత్రలో మెరిసింది. బాలీవుడ్‌ హ్యాండ్సమ్‌ హీరో అర్జున్‌ రామ్‌పాల్‌ విలన్‌గా భయపెట్టాడు. దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలైన భగవంత్‌ కేసరి మూవీ సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళుతోంది. ఇప్పటికే రూ.125 కోట్ల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్‌ నిపుణులు చెబుతున్నారు. సినిమా విజయాన్ని పురస్కరించుకుని గురువారం (నవంబర్‌ 09) హైదరాబాద్‌లో ‘భగవంత్ కేసరి బాక్సాఫీస్‌ కా షేర్‌ సెలబ్రేషన్స్‌’ పేరుతో స్పెషల్ ఈవెంట్‌ను నిర్వహించారు. బాలయ్య, శ్రీలీల, అనిల్‌ రావిపూడి తదితర చిత్ర యూనిట్‌ సభ్యులతో పాటు రాఘవేంద్ర రావు లాంటి సినీ ప్రముఖులు ఈ ఫంక్షన్‌కు హాజరయ్యారు. ఈ సినిమాకు పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్లు అందరికీ జ్ఞాపికలను అందజేశారు. ఇక ఎప్పట్లాగే తన ప్రసంగంతో అతిథులను ఆకట్టుకున్నారు బాలయ్య. అనిల్ రావిపూడి భగవంత్ కేసరి సినిమాలో శ్రీలలకు తనను చిచ్చా (బాబాయ్‌) గా చూపించారని, అలాగనీ తన వయసును దృష్టిలో పెట్టుకుని ఎవడైనా తనను బాబాయ్ అని పిలిస్తే పగిలిపోద్దని బాలకృష్ణ సరదాగా వార్నింగ్‌ ఇచ్చారు.

హిందీలోనూ భగవంత్ కేసరి..

‘భగవంత్‌ కేసరి సినిమాలో శ్రీలీలకి చిచ్చాగా చేశాను. అలాగనీ వయసులో నన్నెవడైనా బాబాయ్ అనో, ఇంకేమైనా పిలిస్తే జాగ్రత్తగా ఉండండి దబిడిదిబిడే. పగిలిపోద్దంతే. ఈ సినిమా ద్వారా ఒక మంచి సందేశం ఇస్తున్నామని ఎప్పుడైతే అనిపించిందో అప్పుడు మనం దేనికైనా సిద్ధమవ్వాలి. సినిమా కంటే గొప్ప మాధ్యమం లేదు. అది కూడా అందరూ చెబితే జనంలోకి వెళ్లదు. ఒక ఆర్టిస్టుగా మనం చెబితే ప్రజల్లోకి బలంగా వెళ్తుందని నా నమ్మకం. ఈ సినిమాలో ఒక్కో పాత్ర ఒక అద్భుతం.ఇక నా సినిమాలకు నేనే సినిమాలే పోటీ’ అని చెప్పుకొచ్చారు బాలయ్య. కాగా భగవంత్ కేసరి సినిమా త్వరలో హిందీలో కూడా రాబోతుందని బాలకృష్ణ వెల్లడించారు. అంతేకాదు హిందీలో కూడా మొట్టమొదటిసారి తానే డబ్బింగ్ చెప్పానన్నారు. త్వరలోనే తన సినిమా హిందీలోనూ విడుదల కానుందని బాలయ్య ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

భగవంత్‌ కేసరి సినిమాలో బాలకృష్ణ, శ్రీలీల..

View this post on Instagram

A post shared by Sreeleela (@sreeleela14)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.