Bigg Boss 7 Telugu: రతికకు ఆల్‌ ద బెస్ట్‌ చెప్పిన సింగర్‌ రాహుల్.. భోలే గురించి ఏమన్నాడో తెలుసా?

రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌తో చనువుగా వ్యవహరించడం, ఆపై అతనితోనే గొడవలకు దిగడం చాలామందికి నచ్చలేదు. పైగా అందరి ముందూ ప్రశాంత్‌ను చులకన చేసి మాట్లాడింది. ప్రిన్స్‌ యావర్‌తో సైతం ఇలాగే డిఫరెంట్‌గా ప్రవర్తించడంతో బుల్లితెర ప్రేక్షకులు రతికకు తక్కువ ఓట్లు వేసి హౌజ్‌ నుంచి బయటకు పంపించారు. అయితే అదృష్టం రతికాను మళ్లీ వెతుక్కుంటూ వచ్చింది

Bigg Boss 7 Telugu: రతికకు ఆల్‌ ద బెస్ట్‌ చెప్పిన సింగర్‌ రాహుల్.. భోలే గురించి ఏమన్నాడో తెలుసా?
Rahul Sipligunj, Rathika Rose, Singer Bhole
Follow us
Basha Shek

|

Updated on: Nov 09, 2023 | 11:50 PM

రతికా రోజ్‌.. బిగ్‌బాస్‌ తెలుగు ఏడో సీజన్‌తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన అందాల తార. ఏవిషయమైనా సూటిగా, ధైర్యంగా మాట్లాడే ఈ అమ్మడు తన క్యూట్‌ లుక్స్‌తో బుల్లితెర ఆడియెన్స్‌ను బాగానే ఆకట్టుకుంది. అలాగే హౌజ్‌లో యాక్టివ్‌గా ఉంటూ టాస్క్‌లు, గేముల్లో పార్టిసిపేట్‌ చేసింది. అయితే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌తో చనువుగా వ్యవహరించడం, ఆపై అతనితోనే గొడవలకు దిగడం చాలామందికి నచ్చలేదు. పైగా అందరి ముందూ ప్రశాంత్‌ను చులకన చేసి మాట్లాడింది. ప్రిన్స్‌ యావర్‌తో సైతం ఇలాగే డిఫరెంట్‌గా ప్రవర్తించడంతో బుల్లితెర ప్రేక్షకులు రతికకు తక్కువ ఓట్లు వేసి హౌజ్‌ నుంచి బయటకు పంపించారు. అయితే అదృష్టం రతికాను మళ్లీ వెతుక్కుంటూ వచ్చింది. హౌజ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే దీనిని కూడా ఈ బ్యూటీ సద్వినియోగం చేసుకోలేకపోతోందని టాక్‌ వినిపిస్తోంది. త్వరలోనే మళ్లీ బయటకు వస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా బిగ్‌ బాస్‌ హౌజ్‌లో ఉండగానే తన మాజీ ప్రియుడి గురించి ఒక హింట్‌ ఇచ్చింది. సింగర్‌తో బ్రేకప్‌ అయ్యిందని చెప్పగానే రాహుల్‌ సిప్లీగంజ్‌- రతికల ప్రైవేట్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో దర్శనమిచ్చాయి. దీనిపై రాహుల్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కావాలనే వీటిని నెట్టింట షేర్‌ చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇక రతిక- రాహుల్‌ల బ్రేకప్‌పై రతిక తల్లిదండ్రులు, ఆమె సోదరి కూడా రకరకాలుగా కామెంట్స్‌ చేశారు. తాజాగా రతికతో ప్రేమ వ్యవహారం, బ్రేకప్‌పై స్పందించాడు సింగర్‌ రాహుల్.

తాజాగా ఓ ప్రోగ్రామ్‌కు హాజరైన రాహుల్‌ సిప్లీగంజ్‌.. ‘ప్రతి ఒక్కరి జీవితంలో గతం, వర్తమానం అనేవి రెండూ ఉంటాయి. భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియదు. రతికతో పాటు హౌస్‌లో ఉన్న అందరి కంటెస్టెంట్‌కు నేను ఆల్‌ద బెస్ట్‌ చెప్తున్నాను. బాగా ఆడి బిగ్‌ బాస్‌ ట్రోఫీతో బయటకు రావాలని కోరుకుంటున్నాను. విజేత ఎవరనేది ఇప్పుడే మనం నిర్ణయించలేము. ప్రస్తుతానిని నాకైతే భోలె షావళి హౌజ్‌లో మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తున్నారు. అలాగే శివాజీ ఇంట్లో పెద్దన్నలా ఉన్నారు. ఇక పల్లెటూరు నుంచి వచ్చిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ ఒకప్పుడు బిగ్‌బాస్‌ షోను సగటు ప్రేక్షకుడిలా చూశాడు. ఇప్పుడు ఆడియెన్స్‌ ఆయనను బిగ్‌బాస్‌ హౌస్‌లో చూస్తున్నారు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం రాహుల్‌ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ హౌజ్ లో రతికా రోజ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.