AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సి సెక్షన్ డెలివరీ తర్వాత పొట్ట, అధిక బరువు తగ్గాలంటే.. మీ లైఫ్‌స్టైల్‌లో ఈ మార్పులు చాలు..!

సి సెక్షన్ డెలివరీ తర్వాత బొడ్డు చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించడం మహిళలకు పెద్ద సవాల్‌గా మారుతుంది. సి సెక్షన్ తర్వాత పొట్టను సురక్షితంగా ఎలా తగ్గించాలి అనే విషయంలో వారు ఆందోళన పడుతుంటారు. సిజేరియన్ డెలివరీ తర్వాత బొడ్డు కొవ్వును తగ్గించుకోవడానికి ఎలాంటి కఠినమైన చర్యలు అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. సిజేరియన్ డెలివరీ తర్వాత మీ ఉబ్బిపోయిన పొట్టను తగ్గించుకోవడానికి మీరు ఎలాంటి జిమ్‌కి వెళ్లనవసరం లేదు. ఇంట్లోనే కొన్ని మార్పులు చేసుకోండి.. తల్లి అయిన తర్వాత కూడా మీరు మళ్ళీ ఫిట్‌గా కనిపిస్తారు.

సి సెక్షన్ డెలివరీ తర్వాత పొట్ట, అధిక బరువు తగ్గాలంటే.. మీ లైఫ్‌స్టైల్‌లో ఈ మార్పులు చాలు..!
How To Lose Fat After Pregnancy
Jyothi Gadda
|

Updated on: Mar 02, 2026 | 1:51 PM

Share

ప్రతి స్త్రీ జీవితంలో గర్భధారణ అనేది ఒక ప్రత్యేక సమయం. ఇది వారిలో అనేక మార్పులను తెస్తుంది. వాటిలో కొన్ని మనకు నచ్చుతాయి. మరి కొన్ని ఇబ్బందికరంగా అనిపిస్తాయి. అలాంటి ఒక మార్పు బరువు పెరగడం… ముఖ్యంగా ప్రసవం తర్వాత ఇది మహిళలకు మానసికంగా, శారీరకంగా ఒత్తిడిని కలిగిస్తుంది. ఆరోగ్యంలోచాలా మార్పులు కనిపిస్తాయి.. సిజేరియన్ డెలివరీ తర్వాత పెరిగిన బొడ్డు చుట్టూ కొవ్వును తగ్గించడం చాలా మంది మహిళలు ఆందోళన కలిగించే విషయం. అందుకే కొందరు మహిళలు డెలివరీ తర్వాత వెంటనే ఈ ఫ్యాట్‌ని ఎలా తగ్గించాలో ఆలోచించడం మొదలుపెడుతుంటారు. కొందరు కఠినమైన ఆహార నియమాలు, భారీ వ్యాయామాలు మొదలుపెట్టాలని ఆలోచిస్తారు. అయితే, సి-సెక్షన్ అనేది ఒక పెద్ద శస్త్రచికిత్స అని గమనించడం చాలా ముఖ్యం. దీని నుండి మన శరీరం లోపల నుండి పూర్తిగా కోలుకోవడానికి తగినంత సమయం పడుతుంది. అటువంటి సమయంలో తప్పుడు పద్ధతిని ఉపయోగించడం మన ఆరోగ్యానికి హానికరం. కానీ, మీరు కొన్ని అలవాట్లను మార్చుకుంటే, మీరు త్వరగా ఫలితాలను చూస్తారు…

ఈ గర్భధారణ తర్వాత సమయంలో చాలా మంది మహిళలు తమ కడుపు వదులుగా ఉన్నట్లు, లేదంటే, వారి పొట్ట చుట్టుకొలత పెరిగినట్లు భావించి ఆందోళన చెందుతారు. తొందరపడి డైటింగ్, కఠినమైన వ్యాయామం చేయటం వల్ల శరీరంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. సరైన సంరక్షణ, సమతుల్య ఆహారం, కొన్ని సాధారణ ఇంటి నివారణల మాత్రమే, మీ కడుపు చుట్టు కొలతను క్రమంగా, సురక్షితంగా తగ్గించవచ్చు. అటువంటి పరిస్థితిలో శరీరంపై ఎటువంటి ఒత్తిడిని కలిగించకుండా కడుపు చుట్టుకొలతను సురక్షితంగా ఎలా తగ్గించాలో చూద్దాం? దీన్ని అర్థం చేసుకోవడానికి, పరాస్ హెల్త్‌లో కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రీతి శుక్లా ఒక వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరాలు వెల్లడించారు.

సిజేరియన్ డెలివరీ తర్వాత వచ్చిన పొట్టను తగ్గించే నివారణలు… 1. ముందగా మీ వైద్యుడిని సంప్రదించండి: సి-సెక్షన్ ఒక పెద్ద ఆపరేషన్‌. కాబట్టి, కోలుకునే సమయం సాధారణ ప్రసవం కంటే కొంచెం ఎక్కువ. శస్త్రచికిత్స తర్వాత మొదటి 6 నుండి 8 వారాల పాటు ఎటువంటి కఠినమైన వ్యాయామం చేయకూడదని సాధారణంగా సలహా ఇస్తారు. ప్రతి స్త్రీ శరీరం వేర్వేరు రికవరీ రేటును కలిగి ఉంటుంది. కాబట్టి ఏదైనా వ్యాయామం లేదా ఆహార ప్రణాళికను ప్రారంభించే ముందు మీ వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. కుట్లు వేసిన ప్రదేశంలో మీకు నొప్పి, వాపు లేదా ఏదైనా అసౌకర్యం అనిపిస్తే, మీరు వెంటనే నిపుణుడిని సంప్రదించాలి.

ఇవి కూడా చదవండి

2. నడకతో ప్రారంభించండి: – సిజేరియన్ డెలివరీ అనంతరం కొన్ని వారాల తర్వాత, మీరు డాక్టర్ సలహా ప్రకారం తేలికపాటి వాకింగ్‌ ప్రారంభించవచ్చు. ప్రారంభంలో ప్రతిరోజూ 15 నుండి 20 నిమిషాలు నెమ్మదిగా నడవండి. ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మానసిక ఆనందాన్ని అందిస్తుంది. క్రమంగా కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ శరీరం మీకు మద్దతు ఇస్తుంది. మీరు వాకింగ్‌ సమయం, వేగాన్ని పెంచుకోవచ్చు. మీ కడుపు లేదా తొడలపై అదనపు ఒత్తిడి లేకుండా బరువు తగ్గడానికి ఇది సురక్షితమైన, సులభమైన మార్గం.

3. ప్రసవానంతర తేలికపాటి వ్యాయామాలు చేయండి: సి-సెక్షన్ తర్వాత వెంటనే సిట్-అప్స్ లేదా క్రంచెస్ వంటి పొట్టకు సంబంధించి హేవీ ఎక్సర్‌సైజులు చేయడం మీ ఆరోగ్యానికి చాలా హానికరం. అందువల్ల మీరు తేలికపాటి ప్రసవానంతర వ్యాయామాలతో మీ రోజును ప్రారంభించవచ్చు. దీర్ఘ శ్వాస, లోతైన శ్వాస, నిశ్వాస ప్రక్రియ క్రమంగా ఉదర కండరాలను సక్రియం చేస్తుంది. ఈ వ్యాయామం చేయడం ఉదర కండరాలను బలపరుస్తుంది. శరీరం అంతర్గత బలాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

4. సమతుల్య, పోషకమైన ఆహారం తీసుకోండి: సి-సెక్షన్ తర్వాత బొడ్డు కొవ్వును తగ్గించడానికి ఆకలితో ఉండటం లేదా క్రాష్ డైటింగ్ చేయడం పూర్తిగా తప్పు. ముఖ్యంగా మీరు మీ బిడ్డకు తల్లిపాలు ఇస్తుంటే. శస్త్రచికిత్స నుండి కోలుకోవడానికి, బిడ్డకు పాలు సరిగా అందాలంటే మీ శరీరానికి తగినంత పోషకాహారం అవసరం. మీ సాధారణ ఆహారంలో ఈ క్రింది ఆహారాలను చేర్చండి.

1. ప్రోటీన్: – కండరాలను బలోపేతం చేయడానికి పప్పుధాన్యాలు, పనీర్ తినండి.

2. ఫైబర్: జీర్ణక్రియను మెరుగుపరచడానికి, ఆకలిని నియంత్రించడానికి పుష్కలంగా పండ్లు, కూరగాయలు తినండి.

3. ఆరోగ్యకరమైన కొవ్వులు: – మీ రోజువారీ ఆహారంలో డ్రై ఫ్రూట్స్, ఒమేగా-3 అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోండి.

4. ఈ ఆహారాలు తినడం మానుకోండి: బయటి నుండి వచ్చే చాలా నూనె, జిడ్డు, కారంగా, జంక్ ఫుడ్ తినడం మానుకోండి.

5. తగినంత నీరు: శరీర హైడ్రేషన్‌ను నిర్వహించడానికి, విషాన్ని బయటకు పంపడానికి రోజంతా తగినంత నీరు త్రాగండి.

5. తగినంత నిద్ర, విశ్రాంతి తీసుకోండి: కొత్త తల్లికి తగినంత నిద్రపోవడం ఒక సవాలు వంటిది. కానీ, మీకు సమయం దొరికినప్పుడల్లా విశ్రాంతి తీసుకోండి. నిద్ర లేకపోవడం శరీరంలో హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. ఇది బరువు తగ్గడం కష్టతరం చేస్తుంది. బరువు పెరగడానికి లేదా బొడ్డు కొవ్వుకు ఒత్తిడి కూడా ఒక ప్రధాన కారణం కావచ్చు. కాబట్టి, మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి ప్రతిరోజూ కాసేపు ధ్యానం చేయండి. తేలికపాటి లోతైన శ్వాస వ్యాయామాలు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. మీ కుటుంబంతో కలిసి సమయం గడపండి. ఇది మీకు మానసిక మద్దతును ఇస్తుంది. మీరు కోలుకోవడాన్ని వేగవంతం చేస్తుంది.

6. ఉదర బెల్ట్ వాడకం:- చాలా మంది మహిళలు సి-సెక్షన్ తర్వాత కడుపుకు మద్దతు ఇవ్వడానికి సపోర్ట్ బెల్ట్ లేదా ఉదర బైండర్‌ను ఉపయోగిస్తారు. వైద్యుల సలహా మేరకు మీరు ఈ బెల్ట్‌ను కొంత సమయం పాటు ఉపయోగించవచ్చు. దీని ప్రధాన ప్రయోజనాలు ఏమిటంటే ఇది ఉదర కండరాలకు మద్దతు ఇస్తుంది. ఇది శరీర భంగిమను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బెల్ట్ ధరించడం వల్ల నేరుగా బొడ్డు కొవ్వు తగ్గదు. ఇది మీ కడుపు, వీపుకు మద్దతు ఇవ్వడానికి మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి, ఇది వ్యాయామానికి ప్రత్యామ్నాయం కాదు. సి-సెక్షన్ తర్వాత మీ బొడ్డు కొవ్వును తగ్గించడం అనేది క్రమంగా జరిగే ప్రక్రియ. ఓపిక, స్థిరత్వం కీలకం. ప్రతి స్త్రీ కోలుకోవడం భిన్నంగా ఉంటుంది. కాబట్టి, మీ శరీరాన్ని ఇతరులతో పోల్చవద్దు. సరైన ఆహారం, తేలికపాటి వ్యాయామం, మీ డాక్టర్ సలహాలతో మీరు తిరిగి మీ ఆకారంలోకి రావచ్చు. ముఖ్యంగా, ఈ సమయంలో మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us