AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బైక్‌పై పాముతో రిస్కీ స్టంట్.. వైరల్ వీడియోపై నెటిజన్ల ఆగ్రహం

సోషల్ మీడియాలో పాముల వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలో, ఒక కొత్త వీడియో నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తూ, ఒకరు చేతిలో భారీ పామును పట్టుకుని ప్రమాదకరంగా ప్రయాణించారు. పాము పదే పదే కాటు వేయడానికి ప్రయత్నించినా వారు లెక్కచేయలేదు. చివరికి దాన్ని పొదల్లో వదిలేసే ప్రయత్నంలోనూ రిస్క్ చేశారు. వారి ఈ నిర్లక్ష్యపూరిత చర్యపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Viral Video: బైక్‌పై పాముతో రిస్కీ స్టంట్.. వైరల్ వీడియోపై నెటిజన్ల ఆగ్రహం
Dangerous Snake Encounter
Jyothi Gadda
|

Updated on: Mar 02, 2026 | 11:20 AM

Share

సోషల్ మీడియాలో పాముల వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతాయి. నెట్టింట విస్తృతంగా లైకులు, షేర్లు అవుతున్నాయి. కొన్నిసార్లు, కొంతమంది పిచ్చి వ్యక్తులు పాములతోనూ వెకిలీ చేష్టాలకు పాల్పడుతుంటారు. వాటిని జోక్‌గా తీసుకుని ప్రాణాలను రిస్క్‌లో పెడుతుంటారు. మరికొందరు విషపూరిత పాములతో ప్రమాదకరంగా ఫైట్‌ చేస్తుంటారు. నాగుపాములను కూడా ఎగతాళి చేసే చాలా మంది తమను తాము హీరోలుగా పోల్చుకుంటారు. అలాంటి వీడియోలను తరచూ సోషల్ మీడియాలో షేర్‌ చేస్తుంటారు. ఈ సిరీస్‌లో ఒక కొత్త వీడియో కనిపించింది. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తున్నారు. వారిలో వెనుక కూర్చున్న వ్యక్తి ఒక చేతిలో భారీ పొడవైన పామును పట్టుకుని ఉన్నాడు. కారులో వారి వెనుక వస్తున్న వారు ఇదంతా వీడియో తీశారు.

వైరల్ వీడియోలో ఇద్దరు వ్యక్తులు బైక్ నడుపుతున్నారు. బైక్‌ డ్రైవర్ వెనుక కూర్చున్న వ్యక్తి చేతిలో పామును పట్టుకుని ఉన్నాడు. బైక్ వేగంగా వెళుతుండగా, వెనుక కూర్చున్న వ్యక్తి తన చేతిలోని పాము తోకను పట్టుకుని కిందకు వేలాడదీసుకుని వెళ్తున్నాడు. ఆ సమయంలో పాము పదే పదే అతనిపై దాడి చేసేందుకు చూసింది. కానీ, అతను పాము నోటికి తగలకుండా తృటిలో తప్పించుకోవడం వీడియోలో చూపిస్తుంది. బైక్‌ను వెంబడిస్తున్న కారులో ఉన్న ఒక మహిళ ఈ సంఘటనను కెమెరాలో బంధించింది.

ఇవి కూడా చదవండి

వీడియో ప్రకారం.. కారులో వెళ్తున్న ఆ మహిళ బైకర్‌ను చూసి షాక్ అవుతుంది. వారి చేతిలో ఉన్నది పాము అని చెప్పింది. ఆ తర్వాత ఆమె బైకర్ ని ఏం చేస్తున్నావు?అని అడుగుతుంది. కారు బైక్ దగ్గరికి రాగానే, బైకర్ ఆపుతాడు. పామును పట్టుకున్న వ్యక్తి బండి దిగి అడవి వైపు నడవడం ప్రారంభిస్తాడు. అలా కొంతదూరం లొపలికి వెళ్లిన తర్వాత, అతను పామును పొదలలోకి వదిలేశాడు. అతను పామును వదలడానికి వెళ్ళినప్పుడు, పాము కాటు వేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ, ఆ వ్యక్తి దానిని తోసివేస్తాడు. ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర