NEET 2026 re-exam Exam: నీట్ 2026 రీటెస్ట్ నేడే.. 22 లక్షల మంది విద్యార్థులపై AI, త్రివిధ దళాల నిఘా
NEET 2026 re-exam Exam Today: దేశవ్యాప్తంగా 22 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్న నీట్ యూజీ 2026 పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. 1.38 లక్షల సీసీ కెమెరాలు, 51 వేలకుపైగా జామర్లు, AI ఆధారిత నిఘా వ్యవస్థలతో పరీక్షను పర్యవేక్షించనున్నారు. పేపర్ లీకేజీలు, అక్రమాలకు తావులేకుండా ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, పోలీస్, పోస్టల్ శాఖల సమన్వయంతో ప్రత్యేక భద్రత కల్పించారు..

మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ 2026 రీ-టెస్ట్ కు కౌంట్‌డౌన్ మొదలైంది. దేశవ్యాప్తంగా నభూతో అనే రీతిలో నీట్ పరీక్ష జరగబోతోంది. మొత్తం 22 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాయబోతున్నారు. దేశంలోని 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 సెంటర్లతో కలిపి.. మొత్తం 5వేల 440 పరీక్షా కేంద్రాలను NTA ఏర్పాటు చేసింది. పరీక్షల్లో అక్రమాలకు, కాపీయింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఈసారి టెక్నాలజీని పెద్ద ఎత్తున వాడుతున్నారు. 95 వేలకు పైగా గదుల్లో.. ఏకంగా లక్షా 38 వేల సీసీటీవీ కెమెరాలను అమర్చారు. విశేషం ఏంటంటే.. ఈ కెమెరాల ఫుటేజీని నేరుగా ఢిల్లీ కంట్రోల్ రూమ్ నుంచి లైవ్‌లో మానిటర్ చేయడమే కాకుండా.. ఎగ్జామ్ హిస్టరీలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో విశ్లేషించనున్నారు. ఎక్కడైనా చిన్న తేడా వచ్చినా AI వెంటనే పట్టేస్తుంది.
ఎలక్ట్రానిక్ డివైజ్‌ల ద్వారా మోసాలకు పాల్పడకుండా ఉండేందుకు పరీక్షా కేంద్రాల దగ్గర రికార్డు స్థాయిలో 51వేల 311 జామర్లను అమర్చారు. అభ్యర్థుల తనిఖీ కోసం 38 వేల మంది స్క్రీనింగ్ స్టాఫ్‌ను, అత్యాధునిక ఫేస్ అథెంటికేషన్ కోసం మరో 48 వేల మంది సిబ్బందిని రంగంలోకి దించారు. ఇక క్వశ్చన్ పేపర్ లీకేజీ అనే మాట వినపడకుండా ఉండేందుకు.. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్, పోస్టల్ శాఖల సమన్వయంతో పక్కా సెక్యూరిటీని అరేంజ్ చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం ఈసారి కీలక మార్పులు చేశారు. టైమ్ తెలుసుకునేందుకు వీలుగా మునుపెన్నడూ లేని విధంగా ప్రతి గదిలో గోడ గడియారాన్ని పెట్టారు. బుక్‌లెట్ ముందే అదనపు రఫ్ పేపర్లను సిద్ధం చేశారు. అలాగే.. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున విద్యార్థుల కోసం తాగునీరు, ఓఆర్ఎస్, ఆంబులెన్స్ సదుపాయాలను అందుబాటులో ఉంచారు. విద్యార్థులతో పాటు వచ్చే పేరెంట్స్ కోసం ప్రత్యేక వెయిటింగ్ హాళ్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక సోషల్ మీడియాలో వచ్చే పేపర్ లీక్ వార్తలను ఎవరూ నమ్మవద్దని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టం చేసింది. తప్పుడు ప్రచారాలు చేస్తూ విద్యార్థులను తప్పుదోవ పట్టించే వారిపై కఠినమైన క్రిమినల్ చర్యలు ఉంటాయని ఎన్‌టీఏ గట్టిగా హెచ్చరించింది.
నీట్ కోసం గతంలో ఎన్నడూ చూడని రీతిలో, భారీ టెక్నాలజీ అరేంజ్‌మెంట్స్‌తో మెగా ఎగ్జామ్‌కు సర్వం సిద్ధం చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. లీకేజీలు, అక్రమాలకు ఏమాత్రం తావులేకుండా ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ రంగంలోకి దిగాయి. గతంలో ఎన్నడూ చూడని రీతిలో నీట్ ఎగ్జామ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు జరగనుంది. దేశ వ్యాప్తంగా 551 దేశీ నగరాలు.. విదేశాల్లో 14 సెంటర్లలో 5,440 పరీక్షా కేంద్రాలు ఏర్పాట్లు చేశారు. 22 లక్షలమంది అభ్యర్థులు 95వేల గదులు, లక్షా 38వేల సీసీ కెమెరాల నిఘాలో నేడు నీట్ యూజీ 2026 పరీక్ష రాయనున్నారు. 51, 311జామర్లు, 38వేల స్క్రీనింగ్ స్టాఫ్, ఫేస్ అథెంటికేషన్‌కి 48వేల మంది AIతో ఎనాలసిస్, ఎప్పుడూ లేనట్టుగా ప్రతిగదిలో గోడ గడియారాలు ఏర్పాటు చేసిన పకడ్భందీగా పరీక్షలు రాయనున్నారు. తాగునీరు, ఓఆర్ఎస్, ఆంబులెన్స్, పేరెంట్స్‌కి వెయిటింగ్ హాల్స్ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. లీకేజీకి తావు లేకుండా త్రివిధ దళాలు, పోలీస్, పోస్టల్ శాఖల సమన్వయంతో నేడు పహారా కాయనున్నాయి. నేరుగా ఢిల్లీ కంట్రోల్ రూమ్ నుంచి లైవ్ మానిటరింగ్ చేయనున్నారు.
ముంబైలో BEST బస్సుల సమ్మె.. నీట్ పరీక్ష కోసం కీలక నిర్ణయం
బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ అండర్‌టేకింగ్ (BEST) ఆధ్వర్యంలోని కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె కారణంగా శనివారం ముంబై బస్సు నెట్‌వర్క్ దాదాపుగా స్తంభించిపోయింది. పగటిపూట BEST యాజమాన్యంలోని గానీ, వెట్-లీజుకు చెందిన గానీ ఒక్క బస్సు కూడా నడవడం లేదు. అయితే ఆదివారం నీట్ పరీక్ష నేపథ్యంలో ముంబైలోని 63 కేంద్రాల్లో ఆదివారం నీట్ పునఃపరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు విద్యార్థులను తరలించేందుకు 60 అదనపు మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (MSRTC) బస్సులను ఏర్పాటు చేసినట్లు బెస్ట్ (BEST) తెలిపింది. సాధారణ సర్వీసులను పెంచడానికి ఈ సంస్థ 100 MSRTC బస్సులను కూడా నడపనుంది.




