AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sarkar Express Theft: మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!

సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఇద్దరు మహిళల బంగారు ఆభరణాలు దోచుకున్న దుండగులను పట్టుకునేందుకు రైల్వే పోలీసులు 9 రౌండ్ల కాల్పులు జరిపారు. బాపట్ల పరిసరాల్లో పరారీలో ఉన్న ఆరుగురు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున 1.15 గంటల సమయంలో బాపట్ల శివారులోని నల్లమడ వాగు రైల్వే వంతెన సమీపంలో ఈ ఘటన జరిగింది..

Sarkar Express Theft: మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!
Bapatla Sarkar Express Theft
Srilakshmi C
|

Updated on: Jun 15, 2026 | 8:17 AM

Share

బాపట్ల, జూన్‌ 15: రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలో నుంచి వెళ్లే రైల్లలో ప్రయాణించే జనాలకు దినదినగండంగా మారుతుంది. తాజాగా సర్కార్ ఎక్స్ ప్రెస్ లో దోపిడి దొంగలు మరో మారు చోరీకి ప్రయత్నించడం కలకలం రేపింది. తమిళనాడులోని చెంగల్పట్టు నుంచి కాకినాడ వెళ్తున్న ఈ రైలులో నిద్రిస్తున్న ప్రయాణికులు నుంచి ఆభరణాలు లాక్కునే ప్రయత్నం చేశారు. ప్రయాణికులు ప్రతిఘటించి కేకలు వేయడంతో కొందరు చైన్ లాగి రైలు ఆపారు. రైలు ఆగగానే దొంగలు చీకట్లో పరారయ్యారు. చోరీకి పాల్పడిన దుండగులను పట్టుకునేందుకు దొంగలఫై రైల్వే పోలీసులు కాల్పులు 9 రౌండ్ల జరిపారు. బాపట్ల అప్పికట్ల స్టేషన్ల మధ్య ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున 1.15 గంటల సమయంలో బాపట్ల శివారులోని నల్లమడ వాగు రైల్వే వంతెన సమీపంలో ఈ ఘటన జరిగింది. రైలులోని ఎస్-3, ఎస్-6 బోగీల్లో నిద్రిస్తున్న ఇద్దరు మహిళల మెడల నుంచి సుమారు ఏడు సవర్ల బంగారు ఆభరణాలను దుండగులు అపహరించారు.

చోరీ జరిగిన విషయం గుర్తించిన ప్రయాణికులు చైన్ లాగడంతో రైలు వెంటనే నిలిచిపోయింది. అప్పటికే దుండగులు రైలు నుంచి దిగి సమీప పొలాల గుండా బాపట్ల-గుంటూరు రహదారి వైపు పారిపోయారు. దుండగులను వెంబడించిన ఎస్కార్ట్ విధుల్లో ఉన్న రైల్వే రక్షణ సిబ్బంది వారిని పట్టుకునేందుకు మొత్తం తొమ్మిది రౌండ్ల కాల్పులు జరిపారు. ప్రస్తుతం అప్పికట్ల-బత్తిపూడి గ్రామాల పరిసర పొలాల్లో పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు గ్రామీణ పోలీసులను అప్రమత్తం చేసి ప్రత్యేక బృందాలతో అన్వేషణ ప్రారంభించారు. ఈ చోరీలో మొత్తం ఆరుగురు దుండగులు పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

రెండు నెలల్లో ఇది మూడో ఘటన

ఈ ప్రాంతంలో గత రెండు నెలల వ్యవధిలో రైళ్లలో చోరీలు జరగడం ఇది మూడోసారి కావడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏప్రిల్ 19న అప్పికట్ల సమీపంలో బెంగళూరు-నర్సాపూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలులో నిద్రిస్తున్న మహిళల మెడల నుంచి సుమారు 130 గ్రాముల బంగారు ఆభరణాలను దుండగులు అపహరించారు. అలాగే మూడు వారాల క్రితం బాపట్ల సరిహద్దులోని గుంటూరు జిల్లా నిడుబ్రోలు సమీపంలో సిగ్నల్ వ్యవస్థను దుండగులు టాంపరింగ్ చేసి చోరీకి యత్నించారు. ఆ సమయంలో అప్రమత్తమైన రైల్వే పోలీసులు దాదాపు ఆరు రౌండ్ల కాల్పులు జరిపినా నిందితులు తప్పించుకున్నారు. కేవలం 20 కిలోమీటర్ల పరిధిలోనే రెండు నెలల్లో వరుసగా మూడు చోరీలు జరగడం రైల్వే భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. దుండగులను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలింపు కొనసాగిస్తున్నారు.

Follow Us
ఐసీయూలో సీనియర్ నటి షావుకారు జానకి..
ఐసీయూలో సీనియర్ నటి షావుకారు జానకి..
'కోచింగ్ లేకుండా సివిల్స్ సాధ్యమే.. ఈ బుక్స్ చదవండి' UPSC టాపర్
'కోచింగ్ లేకుండా సివిల్స్ సాధ్యమే.. ఈ బుక్స్ చదవండి' UPSC టాపర్
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర