8 + 8 = 4 ఎలా సాధ్యం? గణితం కాదు, లాజిక్ కావాలి.. మీ బుర్రకు పదునుపెట్టే చిక్కుప్రశ్న
8 + 8 = 4 ఎలా సాధ్యమో తెలుసా? మొదట చూసినప్పుడు ఇది తప్పు లెక్కలా అనిపించినా.. దీని వెనుక ఆసక్తికరమైన లాజిక్ దాగి ఉంది. గణితం కాదు, గడియారం ఆధారంగా ఆలోచిస్తే ఈ చిక్కు ప్రశ్నకు సరైన సమాధానం దొరుకుతుంది. మీ ఆలోచనా శక్తిని పరీక్షించే ఈ బ్రెయిన్ టీజర్ వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోండి.

చిక్కు ప్రశ్నలకు జవాబు ఇవ్వడం అంత సులువుకాదు. తెలిసినవే అయినప్పటికీ మనల్ని తప్పుదోవ పట్టించేలా ఉంటాయి. ఇవి సాధారణంగా వినడానికి సులభంగా అనిపిస్తాయి కానీ లోపల చిన్న “ట్విస్ట్” ఉంటుంది. మనం ఆలోచించకుండా త్వరగా సమాధానం చెప్తే తప్పులో కాలేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రశ్నల్లో ఎక్కువగా లాజిక్ ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఆలోచించడం అవసరం. ఇవి లోతుగా ఆలోచించాల్సిన విధంగా ఉంటాయి. దీంతో మన brain మరింత చురుకుగా పనిచేస్తుంది. సరైన సమాధానం కనుగొనడానికి మనం కారణాలు, పరిస్థితులు బాగా విశ్లేషించాలి. తరచూ వీటిని ప్రాక్టీస్ చేయడం వల్ల తర్కశక్తి అంటే లాజికల్ థింకింగ్ పెరుగుతుంది. అంతేకాకుండా ఇలాంటి కఠినమైన ప్రశ్నలను పరిష్కరించడం వల్ల, నిజ జీవిత సమస్యలను కూడా మెరుగుగా పరిష్కరించగలుగుతాం. అలాంటిదే ఈ కింది బ్రెయిన్ టీజర్..
8 + 8 = 4 ఎలా సాధ్యం?
ఈ ప్రశ్నను మొదటిసారి విన్నవారు దాదాపు అందరూ “ఇది తప్పు లెక్క” అని అనుకుంటారు. ఎందుకంటే సాధారణ గణితంలో 8 + 8 = 16 అవుతుంది. ఇదే సరైన సమాధానం అని అనుకుంటారు. మరి సమాధానం 4 ఎలా వచ్చింది? ఇక్కడ గణితం కాదు, గడియారం (Clock) గురించి ఆలోచించాలి. ఈ ఫజిల్‌లోని సంఖ్యలను గణిత పరంగా కాకుండా గడియారంలోని సమయంగా చూడాలి. అప్పుడు దీని వెనుక ఉన్న లాజిక్ అర్థమవుతుంది.
గడియారం రహస్యం
మన సాధారణ గడియారం 12 గంటల చక్రంలో తిరుగుతుంది. అంటే 12 తర్వాత మళ్లీ 1 నుంచి ప్రారంభమవుతుంది. ఉదాహరణకు ప్రస్తుతం సమయం 8 గంటలు అనుకుందాం. ఇప్పుడు దానికి మరో 8 గంటలు కలుపుదాం.
అప్పుడు లెక్క ఇలా ఉంటుంది?
8 → 9 → 10 → 11 → 12 → 1 → 2 → 3 → 4
అంటే 8 గంటల తర్వాత సమయం 4 గంటలకు చేరేటప్పటికి గడియారంలోని అంకెల ప్రకారం చిన్నముళ్లు 8 గంటలను దాటుతుంది. కానీ గడియారంలో 12 గంటలు పూర్తయ్యాక మళ్లీ 1 నుంచి లెక్క మొదలవుతుంది.
అందువల్ల 16 – 12 = 4
కాబట్టి గడియార సమయం ప్రకారం 8 + 8 = 4 అవుతుందన్నమాట. 8 గంటలకు 8 గంటలు కలిపితే 4 గంటలు అవుతుంది.
ఈ ప్రశ్న గణిత జ్ఞానాన్ని కాదు, ఆలోచనా విధానాన్ని పరీక్షిస్తుంది. చాలా మంది సంఖ్యలను చూసి వెంటనే 16 అని చెబుతారు. కానీ కొంచెం భిన్నంగా ఆలోచిస్తే సమాధానం 4 అని తెలుస్తుంది. నిజానికి గడియారంలో 8 గంటలకు మరో 8 గంటలు కలిపితే 4 గంటలు అవుతుంది. ఎందుకంటే గడియారం 12 గంటల చక్రంలో పనిచేస్తుంది. ఇది గణిత లెక్క కాదు… గడియారం ఆధారంగా ఉన్న తెలివైన చిక్కుప్రశ్న!
అలాంటిదే మరో చిక్కుప్రశ్న: 7 + 7 = 2 ఎలా సాధ్యం?
ఇది కూడా సాధారణ గణితం కాదు, గడియారం (clock) ఆధారంగా చూడాలి.
7 గంటలు + 7 గంటలు = 14 గంటలు
14 గంటలు అంటే గడియారంలో 12 గంటల చక్రం తీసుకుంటే:
14 − 12 = 2
అందుకే 7 + 7 = 2 (గడియారం ప్రకారం) అవుతుంది. లాజిక్ అర్ధమైందా?




