100లో నుంచి 10ని ఎన్ని సార్లు తీసేయగలం? 90 శాతం మంది తప్పులో కాలేసే చిక్కుప్రశ్న..
Classic Math Puzzles in telugu: ఈ ప్రశ్న మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. చాలా సందర్భాల్లో ప్రశ్నను పూర్తిగా అర్థం చేసుకోకుండా త్వరగా సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాం. కానీ చిక్కు ప్రశ్నల్లో గణితం కంటే పరిశీలనా శక్తి, తార్కిక ఆలోచన, ప్రశ్నలోని పదాల అర్థాన్ని సరిగ్గా గ్రహించడం చాలా ముఖ్యం. అందుకే ఇలాంటి ప్రశ్నలు కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా, మన ఆలోచనా విధానాన్ని కూడా పరీక్షిస్తాయి. వందలో నుంచి 10ని ఎన్ని సార్లు తీసేయగలం..? 99 శాతం మంది తప్పులో కాలేసే క్లాసిక్ చిక్కు ప్రశ్న ఇది. ఇలాంటి చిక్కు ప్రశ్నల్లో గణితం కంటే ప్రశ్నను జాగ్రత్తగా చదవడం ముఖ్యం!

చిక్కు ప్రశ్నలు, పజిల్స్ మన ఆలోచనా శక్తిని పరీక్షించడమే కాకుండా సమస్యలను ఎలా పరిశీలిస్తున్నామో కూడా తెలియజేస్తాయి. అలాంటి ఒక ఆసక్తికరమైన ప్రశ్నే ఇది. మొదటి చూపులో ఈ ప్రశ్న చాలా సులభంగా అనిపిస్తుంది. ఈ ప్రశ్న విన్న వెంటనే చాలామంది వెంటనే ’10 సార్లు’ అని సమాధానం చెబుతారు. ఎందుకంటే 100ను 10తో భాగిస్తే 10 వస్తుంది. కాబట్టి అదే సరైన సమాధానం అనుకుంటారు. గణితపరంగా చూసినా ఇది సరైన సమాధానంలా అనిపిస్తుంది. కానీ ఇది సాధారణ గణిత ప్రశ్న కాదన్న విషయం మీరు గుర్తించాలి. ఇదొక చిక్కు ప్రశ్న మరీ.. ఇలాంటి చిక్కు ప్రశ్నల్లో కనిపించే సమాధానం ఎప్పుడూ నిజమైన సమాధానం రాకపోవచ్చు.
ఈ ప్రశ్నలోని అసలు మాయ ఏమిటంటే.. మన మెదడు వెంటనే మ్యాథమెటిక్స్ వైపు పరుగెత్తుతుంది. కానీ ప్రశ్న అడిగిన విధానాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే సమాధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అందుకే చిక్కు ప్రశ్నలు మన పరిశీలనా శక్తిని పరీక్షించేలా ఉంటాయి. ఈ ప్రశ్న మనకు మరో ముఖ్యమైన విషయాన్ని కూడా నేర్పుతుంది. జీవితంలో చాలా సమస్యలు మొదటి చూపులో క్లిష్టంగా కనిపిస్తాయి. కానీ వాటిని ప్రశాంతంగా, సరైన కోణంలో పరిశీలిస్తే సమాధానం చాలా సులభంగా ఉండవచ్చు. చాలాసార్లు సమస్య కంటే మన ఆలోచనా విధానమే సమస్యను పెద్దదిగా చేస్తుంది. బీర్బల్ కథలు, తెనాలి రామకృష్ణ కథల్లో ఉండేవి ఇలాంటి చిక్కు ప్రశ్నలే. ఇవి మన తాతల కాలం నుంచి తరతరాలుగా ప్రాచుర్యం పొందుతున్నాయంటే అవి మనలో తార్కిక ఆలోచనను పెంపొందించడమే కారణం. ఒక ప్రశ్నను ఒక్క కోణంలో కాకుండా వివిధ కోణాల్లో పరిశీలించే అలవాటు కలిగిస్తాయి.
Also Read: పులి, మేక, గడ్డి, రైతు.. నది ఎలా దాటాలి? మీ తెలివితేటలకు సవాల్ విసిరే చిక్కు ప్రశ్న
ఈ ప్రశ్నలో ప్రధానంగా గమనించాల్సిన విషయం ‘వందలో నుంచి’ అనే పదం. అంటే 100 అనే సంఖ్య నుంచి 10ని ఎన్ని సార్లు తీసేయగలమని అడుగుతున్నారు. మొదటిసారి 100 నుంచి 10 తీసేస్తే మిగిలేది 90. ఆ తర్వాత మీరు మళ్లీ 10 తీస్తే అది 100 నుంచి కాదు కదా..! ఆ తర్వాత మీరు తీసేది 100లో నుంచి కాదు, మిగిలిన సంఖ్యలో నుంచి అవుతుంది. అప్పుడు అది 90 నుంచి తీసినట్టవుతుంది. అలాగే మూడోసారి 80 నుంచి, నాలుగోసారి 70 నుంచి తీసినట్టవుతుంది. అంటే 100 అనే సంఖ్య నుంచి 10ని తీసేయడం ఒక్కసారి మాత్రమే జరుగుతుంది.
అందువల్ల ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏమంటే..
ఒక్కసారి మాత్రమే..!
అందుకే ‘వందలో నుంచి 10ని ఎన్ని సార్లు తీసేయగలం?’ అనే ప్రశ్నకు సరైన సమాధానం ‘ఒక్కసారి మాత్రమే’ అవుతుంది. గణితం కంటే పరిశీలనా శక్తికి ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ఈ ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పేవారి కంటే ప్రశ్నను జాగ్రత్తగా చదివి ఆలోచించే వారే సరైన జవాబు చెప్పగలుగుతారు. భలేగుంది కదా..




