AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ 10 నాణేలతో పెద్ద గది మొత్తం ఎలా నింపాడు..? బుర్ర వేడెక్కే చిక్కు ప్రశ్న

King and 10 Coins Puzzle: ఒక వృద్ధ రాజు తన తర్వాత రాజ్యాన్ని పాలించగల తెలివైన వారసుడిని ఎంపిక చేయాలనుకున్నాడు. అందుకోసం తన ముగ్గురు కుమారులకు 10 బంగారు నాణేలు ఇచ్చి, ఒక పెద్ద ఖాళీ గదిని పూర్తిగా నింపాలని సవాల్ విసిరాడు. వీరిలో మూడవ యువరాజు అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా గదిని పూర్తిగా నింపేశాడు.. అతను ఏమి చేశాడు? ఈ ఆసక్తికరమైన చిక్కు ప్రశ్నకు సమాధానం ఇక్కడ తెలుసుకోండి..

ఆ 10 నాణేలతో పెద్ద గది మొత్తం ఎలా నింపాడు..? బుర్ర వేడెక్కే చిక్కు ప్రశ్న
King And Prince 10 Coins Puzzle
Srilakshmi C
|

Updated on: Jun 09, 2026 | 6:06 PM

Share

ఓ రాజ్యానికి చెందిన వృద్ధ రాజు తన తర్వాత రాజ్యాన్ని పాలించగల సరైన వారసుడిని ఎంపిక చేయాలనుకున్నాడు. అతనికి ముగ్గురు కుమారులు ఉండగా, వారిలో ఎవరు తెలివైనవారో తెలుసుకోవడానికి ఒక ప్రత్యేక పరీక్ష పెట్టాడు. ఒకరోజు ముగ్గురు యువరాజులను రాజదర్బారుకు పిలిచి, వారి చేతుల్లో ఒక్కరికీ 10 బంగారు నాణేలు చొప్పున పెట్టాడు. తర్వాత రాజభవనంలోని ఒక పెద్ద ఖాళీ గదిని చూపిస్తూ.. ‘ఈ 10 నాణేలతో ఈ గదిని పూర్తిగా నింపాలి. ఎవరు గదిని పూర్తిగా నింపగలరో, వారే నా వారసుడు..’ అని చెబుతాడు. ముగ్గురు కుమారులు సవాల్‌ను స్వీకరించి గదిని నింపే పనిలో మునిగిపోతారు.

పెద్ద యువరాజు వెంటనే మార్కెట్‌కు వెళ్లి తన వద్ద ఉన్న 10 నాణేలతో ఎక్కువ స్థలం ఆక్రమించే వస్తువు కోసం వెతికాడు. చివరకు ఎండుగడ్డి (గడ్డి కట్టలు) కొనుగోలు చేశాడు. ఆ గడ్డిని బండ్లలో తెప్పించి గదిలో నింపించాడు. గది చాలా వరకు నిండినా మూలలు, పైభాగంలో ఇంకా ఖాళీ కనిపించింది. రాజు వచ్చి చూసి.. ‘నువ్వు బాగా ప్రయత్నించావు. కానీ గది పూర్తిగా నిండలేదు’ అని అంటాడు. రెండో కుమారుడు పత్తి వంటి తేలికపాటి వస్తువులు కొనుగోలు చేస్తాడు. అయినా గది మొత్తం నిండదు. ఇక చిన్న కుమారు మాత్రం తొందరపడలేదు. ‘గదిని నింపాలంటే వస్తువులతోనే నింపాలా?’ అని ఆలోచిస్తాడు.

అతను మార్కెట్‌కు వెళ్లి ఒక చిన్న నూనె దీపం, కొద్దిగా నూనె, వత్తి కొనుగోలు చేస్తాడు. ఇందుకు ఖర్చయింది కేవలం కొద్ది నాణేలే. రాత్రి అయ్యాక రాజును, మంత్రులను, ప్రజలను ఆ గది దగ్గరకు పిలవగా.. అందరూ ఆశ్చర్యపోతారు. గదిలో ఎలాంటి వస్తువులు కనిపించలేదు. చిన్న యువరాజు గది మధ్యలో నిలబడి దీపాన్ని వెలిగించడంతో క్షణాల్లో ఆ దీపం వెలుగు గది నలుమూలలా వ్యాపించింది. ప్రతి మూల, ప్రతి గోడ, ప్రతి అంగుళం కాంతితో నిండిపోయింది.

Room Filling With 10 Coins Challenge

Room Filling With 10 Coins Challenge

అప్పుడు యువరాజు రాజును చూసి.. ‘తండ్రీ, మీరు గదిని నింపమన్నారు. వస్తువులతో నింపమని చెప్పలేదు. నేను ఈ గదిని కాంతితో పూర్తిగా నింపాను’ అని అంటాడు. ఆ సమాధానం విన్న రాజు ఎంతో సంతోషంతో తెలివి, సృజనాత్మకత, సమస్యను కొత్త కోణంలో ఆలోచించే సామర్థ్యం చిన్న కుమారుడిలో ఉందని గ్రహించాడు. అతడినే రాజ్యానికి వారసుడిగా ప్రకటించాడు. సమస్యలను బలంతో, ఎక్కువ డబ్బుతో కాకుండా తెలివిగా ఆలోచించి పరిష్కరించవచ్చని రాజు చెబుతాడు.

బలం కాదు లాజిక్‌ అసలు మేటర్‌..

సమస్యను అందరూ చూసే కోణంలోనే చూడాల్సిన అవసరం లేదు. సృజనాత్మక ఆలోచన పెద్ద సమస్యలకు చిన్న పరిష్కారాలను చూపిస్తుంది. ఎక్కువ డబ్బు, బలం కంటే తెలివితేటలే గొప్పవి. అందుకే 10 నాణేలు మాత్రమే ఖర్చు చేసి గదిని పూర్తిగా నింపిన యువరాజు, గదిని వస్తువులతో కాదు… కాంతితో నింపాడు. ప్రశ్నను పూర్తిగా అర్థం చేసుకోవడం విజయంలో కీలకం.

Follow Us