Vaibhav Sooryavanshi : వైభవ్ సెంచరీని అడ్డుకున్న జింబాబ్వే ఆల్‌రౌండర్.. మ్యాచ్ తర్వాత బయటపడ్డ అసలు నిజం
Vaibhav Sooryavanshi : జింబాబ్వేపై తొలి అంతర్జాతీయ సెంచరీ చేయకుండా వైభవ్ సూర్యవంశీని అడ్డుకోవడానికే డైవింగ్ క్యాచ్ పట్టానని బ్రాడ్ ఇవాన్స్ వెల్లడించాడు. 81 పరుగులతో మెరిసిన వైభవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకున్నాడు.

Vaibhav Sooryavanshi : భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో ఆరో మ్యాచ్‌లోనే మొదటి సెంచరీ చేసే అవకాశాన్ని తృప్తిలో చేజార్చుకున్నాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో వైభవ్ 49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 81 పరుగులు చేసి చాలా నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతను సులువుగా సెంచరీ దిశగా సాగిపోతున్న సమయంలో, ఒక ప్రత్యర్థి ఆటగాడు అతనికి అడ్డుకట్ట వేశాడు. ఆ ఆటగాడు మరెవరో కాదు, జింబాబ్వే ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ బ్రాడ్ ఇవాన్స్. వైభవ్ సెంచరీ కొట్టకుండా చేయడానికే తాను ప్రత్యేకంగా కష్టపడి ఆ క్యాచ్ పట్టినట్లు ఇవాన్స్ స్వయంగా వెల్లడించాడు.
గ్రౌండ్‌లో మైండ్ బ్లాకింగ్ క్యాచ్
ఇన్నింగ్స్ మధ్యలో వెస్లీ మధేవెరే వేసిన బంతిని వైభవ్ షాట్ ఆడగా, బంతి సరైన టైమింగ్ లేకపోవడంతో లాంగ్ ఆన్ దిశగా గాల్లోకి లేచింది. బాంబూ రోప్ దగ్గర నిలబడి ఉన్న జింబాబ్వే ఫీల్డర్ బ్రాడ్ ఇవాన్స్, బంతి తన ముందుకు పడుతోందని గ్రహించి ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఊహించని రీతిలో ముందుకు డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్‌ను పట్టుకున్నాడు. దీంతో వైభవ్ సూర్యవంశీ సెంచరీ చేసే సువర్ణావకాశాన్ని కోల్పోయి 81 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది.
ONLY ONE WAY TO STOP SOORYAVANSHI…
TAKE AN ABSOLUTELY OUTRAGEOUS CATCH! 🤯 🔥
Watch it LIVE on FanCode! 🇮🇳 👇https://t.co/eIbqNipOAB#ZIMvIND #IndiaCricket #RokoNahiThoko pic.twitter.com/yANzGzW94g
— FanCode (@FanCode) July 26, 2026
జింబాబ్వేపై సెంచరీ కొట్టనివ్వకూడదనే అలా చేశా
తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత బ్రాడ్ ఇవాన్స్ బ్రాడ్‌కాస్టర్లతో మాట్లాడాడు. “వైభవ్ సూర్యవంశీ చాలా గొప్ప ఆటగాడు. భవిష్యత్తులో అతను ఖచ్చితంగా పెద్ద పెద్ద రికార్డులు సాధిస్తాడు. కానీ, అతనికి మొదటి అంతర్జాతీయ సెంచరీ మా జింబాబ్వే జట్టుపైనే నమోదు కావడం నాకు ఎంతమాత్రం ఇష్టం లేదు. అందుకే ఆ క్యాచ్ పడే సమయంలో కొంచెం ఎక్కువ శ్రమించి ముందుకు డైవ్ చేసి క్యాచ్ పట్టుకున్నాను” అని ఇవాన్స్ నవ్వుతూ వ్యాఖ్యానించాడు. తన బౌలింగ్ ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. మొదటి ఓవర్లోనే 15 పరుగులు ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత పుంజుకుని 4 ఓవర్లలో 41 పరుగులిచ్చి 2 వికెట్లు తీయడం సంతృప్తినిచ్చిందని తెలిపాడు.
సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్
వైభవ్ సూర్యవంశీ సెంచరీ మిస్ అయినప్పటికీ, అతను సాధించిన 81 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ భారత్‌కు భారీ స్కోరు అందించడంలో సహాయపడింది. ఈ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసి ట్రోఫీని కైవసం చేసుకుంది. అద్భుత ప్రదర్శన కనబరిచిన వైభవ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్,ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి. జింబాబ్వే బౌలర్లు అతన్ని అడ్డుకోవడానికి ఎంతో ప్రయత్నించినప్పటికీ, తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడంలో వైభవ్ సఫలమయ్యాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
