AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asian Games: ఏషియన్ క్రీడల్లో అదరగొట్టిన భారత్.. జావెలిన్ త్రోలో డబుల్ ధమాకా

Asian Games 2026: పురుషుల జావెలిన్ త్రోలో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో రెండు పతకాలు సాధించారు. యశ్‌వీర్ సింగ్ 85.72 మీటర్ల త్రోతో రజతం, రోహిత్ యాదవ్ 84.35 మీటర్ల త్రోతో కాంస్యం గెలుచుకున్నారు. శ్రీలంకకు చెందిన రుమేశ్ పతిరాగే 88.55 మీటర్లతో స్వర్ణం సాధించగా, అర్షద్ నదీమ్ నాలుగో స్థానంలో నిలిచారు.

Asian Games: ఏషియన్ క్రీడల్లో అదరగొట్టిన భారత్.. జావెలిన్ త్రోలో డబుల్ ధమాకా
Asian Games 2026
Rakesh
|

Updated on: Sep 28, 2026 | 7:50 PM

Share

Asian Games: సోమవారం జరిగిన ఆసియా క్రీడల పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో భారత్ తరఫున అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఈ పోటీలో భారత అథ్లెట్లు అంచనాలను తలకిందులు చేస్తూ ఏకకాలంలో రెండు పతకాలను సాధించి చరిత్ర సృష్టించారు. యశ్‌వీర్ సింగ్ అద్భుతమైన ప్రదర్శనతో రజత పతకం కైవసం చేసుకోగా, మరో అథ్లెట్ రోహిత్ యాదవ్ కాంస్య పతకం గెలుచుకున్నారు. ఈ వేదికపై భారత క్రీడాకారులు ప్రదర్శించిన ప్రతిభ దేశానికి గర్వకారణంగా నిలిచింది. యశ్‌వీర్ సింగ్ తన కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ 85.72 మీటర్ల దూరం విసిరి రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. తన ఆఖరిదైన ఆరో ప్రయత్నంలో ఈ రికార్డు నమోదు చేయడం విశేషం. తొలి ప్రయత్నంలోనే 83.56 మీటర్లు విసిరిన ఆయన, ఆరు ప్రయత్నాలలోనూ 80 మీటర్లకు పైగా దూరం విసరడం ఆయన నిలకడకు నిదర్శనం. గాయం కారణంగా తప్పుకున్న నీరజ్ చోప్రా స్థానంలో జట్టులోకి వచ్చిన యశ్‌వీర్, తనకు దక్కిన అవకాశాన్ని వంద శాతం సద్వినియోగం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: Rohit Sharma: క్రిస్ గేల్‌ రికార్డు బ్రేక్ చేసిన హిట్ మ్యాన్.. ప్రపంచంలో నంబర్ 1 బ్యాటర్‎గా రోహిత్

భారత మరో జావెలిన్ త్రోయర్ రోహిత్ యాదవ్ కూడా అద్భుత ఆటతీరుతో పతకం సాధించారు. ఆయన 84.35 మీటర్ల బెస్ట్ త్రోతో కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. తొలి ప్రయత్నంలో 77.25 మీటర్లు విసిరిన రోహిత్, ఆ తర్వాత క్రమంగా పుంజుకున్నారు. మూడో ప్రయత్నంలో తన అత్యుత్తమ త్రోను నమోదు చేసి పోడియంపై స్థానం సంపాదించుకున్నారు. ఆఖరి ప్రయత్నం అమాన్యమైనప్పటికీ, ఆయన మునుపటి ప్రదర్శన భారత్‌కు పతకం తెచ్చిపెట్టింది. ఈ ఉత్కంఠభరితమైన ఈవెంట్‌లో శ్రీలంకకు చెందిన రుమేష్ పతిరగె అద్భుతమైన ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. శ్రీలంక జావెలిన్ త్రోయర్ ఏకంగా 88.55 మీటర్ల దూరం విసిరి ప్రథమ స్థానంలో నిలిచారు. పోటీ ఆద్యంతం హోరాహోరీగా సాగినప్పటికీ, శ్రీలంక అథ్లెట్ వేసిన దూరం అందరికంటే ఎక్కువగా ఉండటంతో గోల్డ్ మెడల్ ఆయన సొంతమైంది.

ఇది కూడా చదవండి: Bats Stolen: భారతీయ క్రికెటర్లకి షాక్.. గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా లక్ష విలువైన బ్యాట్లు చోరీ

ఈ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ తరఫున బరిలో దిగిన ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అర్షద్ నదీమ్ దారుణమైన ప్రదర్శన కనబరిచారు. ఆయన కేవలం 80.29 మీటర్ల బెస్ట్ త్రోతో నాల్గవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తాను వేసిన ఆరు ప్రయత్నాలలో కేవలం రెండే త్రోలు మాత్రమే నిబంధనల ప్రకారం వాలీడ్ అయ్యాయి. మిగతావన్నీ అమాన్యంగా ప్రకటించడంతో పాకిస్తాన్ పతకం సాధించలేకపోయింది. నీరజ్ చోప్రా లేని సమయంలో యువ ఆటగాళ్ళు భారత్‌కు పతకాలు తెచ్చిపెట్టడంతో క్రీడా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. కఠినమైన శిక్షణ, పట్టుదల ఉంటే ఏ వేదికపై అయినా విజయం సాధించవచ్చని యశ్‌వీర్, రోహిత్ నిరూపించారు. ఈ విజయంతో ఏషియన్ క్రీడల్లో భారత అథ్లెటిక్స్ సత్తా మరోసారి ప్రపంచానికి చాటిచెప్పినట్లయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..!

Follow Us