AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సహారాలోనూ తప్పని ఆన్‌లైన్‌ మీటింగ్‌! ఒంటెపై ల్యాప్‌టాప్‌తో..

సహారాలోనూ తప్పని ఆన్‌లైన్‌ మీటింగ్‌! ఒంటెపై ల్యాప్‌టాప్‌తో..

Phani CH
|

Updated on: Jun 20, 2026 | 1:25 PM

Share

రిమోట్ వర్క్‌కు కొత్త అర్థం చెబుతూ ఓ వ్యక్తి సహారా ఎడారిలో ఒంటెపై ప్రయాణిస్తూ ల్యాప్‌టాప్‌తో ఆఫీస్ పనులు చేస్తూ కనిపించాడు. న్యూయార్క్‌కు చెందిన కంటెంట్ క్రియేటర్ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘వర్క్ ఫ్రమ్ ఎనీవేర్’కు ఇదే అసలైన ఉదాహరణ అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో సందడి చేస్తున్నారు.

సహారా ఎడారికి వెళ్లినా.. బాస్‌ వదలడం లేదా? మండుటెండలోనూ ఆఫీస్ మీటింగ్‌లు తప్పడం లేదా? ఓ వ్యక్తి ఆఫీస్ మీటింగ్‌ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఏకంగా సహారా ఎడారిలో ఒంటెపై ప్రయాణిస్తూ ల్యాప్‌టాప్‌తో ఆఫీస్ పనిలో మునిగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో రిమోట్ వర్క్ కల్చర్‌పై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు, జోకులతో హోరెత్తిస్తున్నారు. న్యూయార్క్‌కు చెందిన రీల్ క్రియేటర్ సాద్ అక్తర్ ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్‌ చేసారు. ఒంటె మూపురంపై ల్యాప్‌టాప్ పెట్టుకుని సీరియస్‌గా పనిచేస్తున్న వ్యక్తిని వీడియో తీశారు. “వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే మీ స్నేహితుడు” అనే క్యాప్షన్‌ను వీడియోకు జోడించారు. అంతేకాకుండా “మా వాడు సహారా ఎడారి నుంచి మీటింగ్‌లకు అటెండ్ అవుతున్నాడు” అంటూ చమత్కరించారు. ఈ విచిత్ర దృశ్యం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ‘వర్క్ ఫ్రమ్ ఎనీవేర్’కు ఇదే అసలైన ఉదాహరణ అని కొందరు కామెంట్ చేయగా, మరికొందరు ఫన్నీగా స్పందించారు. ఆఫీస్ మీటింగులు, డెడ్‌లైన్‌ల నుంచి తప్పించుకోవడానికి సహారా ఎడారికి వెళ్లినా లాభం లేదని జోకులు వేస్తున్నారు. దీంతో ఈ వీడియో లక్షలాది వ్యూస్‌తో నెట్టింట నవ్వులు పూయిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏంటి ఈ సరికొత్త ఆన్‌లైన్‌ షాపింగ్‌ విధానం?

ఇది కదా సంపాదనంటే! ఒక్క రీల్‌కు రూ.80 లక్షలు..

రేయ్‌ మావా.. ఇదేందిరా ఇంత ఉంది!!

అదృష్టం అంటే ఈమెదే.. కోట్లాది సంపద సొంతం!

Maa Inti Bangaram: రఫ్ఫాడించిన సమంత! హిట్టా..? ఫట్టా..?

Follow Us