రేయ్ మావా.. ఇదేందిరా ఇంత ఉంది!!
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ బేకరీలో భారీ కొండచిలువ కనిపించడంతో సిబ్బంది, కస్టమర్లు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు దాదాపు మూడు గంటల పాటు శ్రమించి ఎనిమిది అడుగుల పొడవున్న పైథాన్‌ను సురక్షితంగా పట్టుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా, రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బేకరీలోకి వెళ్తే కేక్‌లు, కూల్‌డ్రింకులు, బిస్కెట్లు చాకెట్లు కనిపిస్తాయి కదా. కానీ మీరట్‌లోని ఓ షాప్‌లో మాత్రం అంచనాలన్నీ తలకిందులయ్యాయి. అక్కడ కస్టమర్లకు “స్వీట్ షాక్” కాదు, నేరుగా “సర్ప్రైజ్ షాక్” ఎదురైంది. లోపల కనిపించిన దృశ్యం చూసి కొందరు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు! ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ లోని ఓ బేకరీలో భారీ కొండచిలువ కనిపించి అందరినీ హడలెత్తించింది. అది బిస్కెట్ ప్యాకెట్ కోసం వచ్చిందా? లేదంటే డిస్కౌంట్ ఆఫర్ చూసి వచ్చిందా? అనే జోకులు పక్కన పెడితే… అక్కడి సిబ్బంది మాత్రం ‘బాబోయ్’ అంటూ బయటకు పరుగులు తీశారు. పామును చూసిన వెంటనే షాప్‌లో క్షణాల్లోనే “బిజినెస్ క్లోజ్, ఎమర్జెన్సీ ఓపెన్” పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ టీమ్ హుటాహుటిన అక్కడికి చేరుకుంది. కానీ సమస్య ఏంటంటే… ఆ పాము దాగిన చోటు అంత ఈజీగా కనిపించలేదు. దాదాపు 3 గంటల పాటు సాగిన సినిమా స్టైల్ రేస్క్యూ ఆపరేషన్ తర్వాత ఆ భారీ పైథాన్‌ను సురక్షితంగా పట్టుకున్నారు. తీరా చూస్తే అది ఎనిమిది అడుగుల పొడవుతో భయానకంగా ఉంది. చుట్టూ గుమిగూడిన జనాలు మొత్తం “ఇదేందిరా ఇంత ఉంది!” అనే ఫీలింగ్‌లో షాక్‌లోనే నిల్చిపోయారు. ఆ సమయంలో రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నవాళ్లు.. పైథాన్‌ను పట్టుకునే క్రమంలో ఒకరి మీద ఒకరు వేసుకున్న జోకులతో అక్కడంతా నవ్వులు పూశాయి. పైథాన్ 20 అడుగుల పొడవు, 100 కిలోల లోపు వరకు బరువు పెరుగుతుంది. అవి నెమ్మదిగా కదులుతాయి. కానీ, అవి మిగతా జీవులను చాలా బలంగా నిర్బంధించి ఊపిరాడకుండా చేయగలవు. కొండచిలువ విషపూరితమైన పాము కాదు. దాని ప్రధాన బలం.. కండర శక్తి. శత్రువులను బలంతో నలిపేసి ఊపిరి పీల్చుకోకుండా చుట్టేస్తుంది. ఆ తర్వాత ఎరను పూర్తిగా మింగేస్తుంది. చిన్న జంతువులతో పాటు జింకలు, మొసళ్ల వంటి పెద్దవాటిని కూడా ఇది మింగేయగలదు. కొండచిలువల్లో విషం లేనప్పటికీ తమ బలంతో అటాక్ చేస్తుంటాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అదృష్టం అంటే ఈమెదే.. కోట్లాది సంపద సొంతం!
Maa Inti Bangaram: రఫ్ఫాడించిన సమంత! హిట్టా..? ఫట్టా..?
Peddi: OTTలోకి ‘పెద్ది’ వచ్చేది.. ఎప్పుడంటే..?
Save The Tigers 3: మొగుళ్ల ఫ్రస్ట్రేషన్.. నవ్వుల జాతర! హిట్టా..? ఫట్టా..?
Vanda Devullu: తల్లి మళ్లీ పెళ్లి చేసుకుంటే తప్పేంటి? ‘వంద దేవుళ్లు’ రివ్యూ..
రేయ్ మావా.. ఇదేందిరా ఇంత ఉంది!!
అదృష్టం అంటే ఈమెదే.. కోట్లాది సంపద సొంతం!
ప్రెగ్నెన్సీ నుంచి బిడ్డకు 6 నెలలు వచ్చే వరకు.. రూ.4 లక్షలు ఖర్చు
130 అడుగుల ఎత్తునుంచి పడినా బ్రతికే ఉంది..
గుడ్ల రక్షణకు ప్రాణాలను పణంగా పెట్టిన మాతృప్రేమ
ఒక సాధారణ వెల్డర్.. రాత్రికి రాత్రి కోటీశ్వరుడు ఎలా అయ్యాడు!
మాయమైపోతున్న మాన్సూన్.. రైతుల్లో టెన్షన్ టెన్షన్

