AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi: OTTలోకి 'పెద్ది' వచ్చేది.. ఎప్పుడంటే..?

Peddi: OTTలోకి ‘పెద్ది’ వచ్చేది.. ఎప్పుడంటే..?

Phani CH
|

Updated on: Jun 20, 2026 | 12:59 PM

Share

రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటికే రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం త్వరలో ఓటీటీలోకి రానుంది. డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా, జులై చివరి వారంలో లేదా ఆగస్టు తొలి వారంలో స్ట్రీమింగ్ ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు సమాచారం.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘పెద్ది’. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టైంది. భారీ అంచనాల మధ్య జూన్ 04న విడుదలైన పెద్ది సినిమా మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు రాబట్టింది. ఇప్పటివరకు పెద్ది సినిమాకు సుమారు రూ.400 కోట్ల కలెక్షన్లు వచ్చినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికీ ఈ సినిమా చాలా చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఆడుతోంది. దీనికి తోడు కొత్త సీన్లు కూడా జత చేశారు. దీంతో పెద్ది సినిమాకు మళ్లీ రెస్పాన్స్ పెరిగినట్టు తెలుస్తోంది. కలెక్షన్లు కూడా మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. అయితే ఇప్పుడీ పెద్ది సినిమాను ఓటీటీలో చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టే ఈ మెగా మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై ఒక ఆసక్తికర అప్డేట్ వచ్చింది. పెద్ది సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. దీంతో మేకర్స్‌తో కుదిరిన అగ్రిమెంట్ ప్రకారం పెద్ది మూవీని స్ట్రీమింగ్ చేసేందుకు నెట్‌ ఫ్లిక్స్ రెడీ అయినట్టు తెలుస్తోంది. వచ్చే నెల అంటే జులై అఖరున లేదా.. ఆగస్టు ఫస్ట్‌ వీక్‌లో పెద్దిని నెట్‌ప్లిక్స్‌ గ్రాండ్‌గా స్ట్రీమింగ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్‌ చేసుకున్నట్టు టాక్. ఇక ఈ విషయం పక్కకు పెడితే.. పెద్ది మూవీ కలెక్షన్స్‌ ఇంకా పెరిగేట్టు కనిపిస్తున్నాయిని ట్రేడ్ నిపుణులు కోట్ చేస్తున్నారు. పెద్ది ఇప్పటికే 13 రోజుల్లో 405 కోట్లు వసూలు చేసింది. 6 నిమిషాల మేర కొత్త సీన్స్ యాడ్ అయిన నేపథ్యంలో పెద్ది థియేటర్ల దగ్గర మళ్లీ జనసందడి కనిపిస్తోంది. దీంతో పెద్ది 425 నుంచి 450 కోట్ల మేర కలెక్షన్స్‌ రాబడతాడని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Save The Tigers 3: మొగుళ్ల ఫ్రస్ట్రేషన్.. నవ్వుల జాతర! హిట్టా..? ఫట్టా..?

Vanda Devullu: తల్లి మళ్లీ పెళ్లి చేసుకుంటే తప్పేంటి? ‘వంద దేవుళ్లు’ రివ్యూ..

Honeymoon Tragedy: నగ్నంగా రక్తపు మడుగులో భార్య | ముస్సోరీలో ఆ రాత్రి..ఏం జరిగింది?

Follow Us