AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vanda Devullu: తల్లి మళ్లీ పెళ్లి చేసుకుంటే తప్పేంటి? 'వంద దేవుళ్లు' రివ్యూ..

Vanda Devullu: తల్లి మళ్లీ పెళ్లి చేసుకుంటే తప్పేంటి? ‘వంద దేవుళ్లు’ రివ్యూ..

Phani CH
|

Updated on: Jun 20, 2026 | 12:53 PM

Share

విజయ్ ఆంటోనీ, దర్శకుడు శశి కాంబినేషన్‌లో వచ్చిన ‘వంద దేవుళ్లు’ సమాజంలో వితంతువుల జీవితాలపై ప్రశ్నలు లేవనెత్తే భావోద్వేగ కథ. తల్లి మళ్లీ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి కొడుకులు అండగా నిలిచే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం హృదయాలను తాకుతుంది. స్వాసిక విజయ్ నటన, క్లైమాక్స్ ఎమోషన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.

‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో బలమైన ముద్ర వేసిన విజయ్ ఆంటోనీ, డైరెక్టర్ శశి కాంబినేషన్ అంటేనే అంచనాలు భారీగా ఉంటాయి. సరిగ్గా పదేళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో, ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఎమోషనల్ సోషల్ డ్రామానే ‘వంద దేవుళ్లు’. ‘బిచ్చగాడు’ సినిమాలో తల్లి కోసం కొడుకు పడే తపనను చూపిస్తే… ఈ సినిమాలో ఒక వితంతువు అయిన తల్లి హక్కుల కోసం కొడుకులు చేసే పోరాటాన్ని చూపించారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు కదిలించిందో ఇప్పుడు చూద్దాం!” ఇక స్టోరీ విషయానికి వస్తే… వాసవి అలియాస్ స్వాసిక విజయ్ చిన్న వయసులోనే భర్తను కోల్పోతుంది. సమాజం నుంచి ఎన్నో అవమానాలు ఎదురైనా, కష్టపడి తన ఇద్దరు కొడుకులు భాస్కర్, వివేక్‌లను పెంచి పెద్ద చేస్తుంది. కొడుకులు ప్రయోజకులు అయ్యాక… ఒంటరితనంతో బాధపడుతున్న వాసవి, సమాజంలో తనకంటూ ఒక తోడుండాలని మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. కానీ ఆమె తీసుకున్న ఈ నిర్ణయాన్ని కన్న కొడుకులతో పాటు ఈ సమాజం ఎలా రిసీవ్ చేసుకుంది? సమాజం పెట్టే రూల్స్ ని కాదని ఒక తల్లి తీసుకున్న నిర్ణయానికి కొడుకులు ఎలా అండగా నిలిచారు? ఈ కథలోకి ఏడుకొండలు అలియాస్ విజయ్ ఆంటోనీ ఎలా ఎంటర్ అయ్యాడు? అతని పాత్ర ఈ ఫ్యామిలీని ఎలా ప్రభావితం చేసింది? అనేది సిల్వర్ స్క్రీన్ పైనే చూడాలి. భర్త చనిపోయిన మహిళలు తమ జీవితాంతం త్యాగాలు చేస్తూనే బతకాలా? వారికి నచ్చినట్టు జీవించే హక్కు లేదా? అని డైరెక్టర్ శశి ప్రశ్నించిన తీరు అద్భుతం అనే చెప్పాలి. ఈ సినిమాతో డైరెక్టర్ శశి, హీరో విజయ్‌, సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు.సినిమాకి మెయిన్ పిల్లర్ వాసవి పాత్ర చేసిన స్వాసిక విజయ్. ఒక వితంతువుగా, తల్లిగా ఆమె నటన కన్నీళ్లు పెట్టిస్తుంది. విజయ్ ఆంటోనీ స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ సమయమే అయినా, తన సహజ నటనతో, డైలాగ్ డెలివరీతో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో మెప్పించారు.ముఖ్యంగా సెకండ్ హాఫ్, ప్రీ-క్లైమాక్స్ మరియు చివరి 20 నిమిషాల ఎమోషనల్ సీన్స్ థియేటర్ లో ప్రతి ఒక్కరినీ కదిలిస్తాయి. ఇవి ఈ సినిమాకు ప్లస్‌ పాయింట్స్ అని చెప్పొచ్చు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే.. ఫ్యామిలీ డ్రామాని ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్ కాస్త నెమ్మదిగా సాగుతాయి. అది ఈ సినిమాకు మైనస్ అని చెప్పొచ్చు. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా అనుకున్నంత రేంజ్‌లో ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. కొన్ని క్యారెక్టర్ల ఆర్క్స్ ఇంకా బలంగా రాసుకోవాల్సింది. ఫైనల్‌గా చెప్పాలంటే.. ‘వంద దేవుళ్లు’ కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశించి వెళ్లే మాస్ ఆడియన్స్‌కి కాస్త నిదానంగా అనిపించవచ్చు. కానీ, ఒక ప్యూర్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాని, సమాజంలో మారాల్సిన ఒక పాత నమ్మకాన్ని ప్రశ్నించే మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఇష్టపడే వారికి నచ్చొచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Honeymoon Tragedy: నగ్నంగా రక్తపు మడుగులో భార్య | ముస్సోరీలో ఆ రాత్రి..ఏం జరిగింది?

Follow Us