Save The Tigers 3: మొగుళ్ల ఫ్రస్ట్రేషన్.. నవ్వుల జాతర! హిట్టా..? ఫట్టా..?
భార్యాభర్తల మధ్య జరిగే సరదా గొడవలను నవ్వుల పండుగగా చూపించిన ‘సేవ్ ది టైగర్స్ 3’ మరోసారి ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణల కామెడీ టైమింగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కథలో కొత్తదనం తక్కువగా ఉన్నప్పటికీ, కుటుంబంతో కలిసి హాయిగా చూసే వినోదాత్మక వెబ్ సిరీస్‌గా నిలుస్తుంది.
తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సిరీస్‌లలో సేవ్ ది టైగర్స్ ఒకటి. మహి వి రాఘవ్, ప్రదీప్ అద్వైతం క్రియేట్ చేసిన ఈ సిరీస్.. పెళ్లయిన ముగ్గురు భార్యాబాధితుల కష్టాలను నవ్వుల నైట్‌మేర్‌గా చూపిస్తూ సూపర్ సక్సెస్ సాధించింది.మొదటి రెండు సీజన్లు బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో, అదే ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్‌ను కంటిన్యూ చేస్తూ ఇప్పుడు మూడో సీజన్ కూడా వచ్చింది. ఇప్పుడు ఆ సిరీస్ ఎలా ఉందనేది ఈ షార్ట్ రివ్యూలో చూద్దాం.. మొదటి రెండు సీజన్ల లాగే, ఈ మూడో సీజన్ కూడా భార్యాబాధితులైన ముగ్గురు స్నేహితులు అలియాస్ ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ చుట్టూనే తిరుగుతుంది. ఈసారి వారి జీవితాల్లోకి కొత్త సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రాహుల్ అలియాస్ అభినవ్ రాసిన బుక్ వల్ల ముగ్గురి వైవాహిక జీవితాల్లో ఎలాంటి గొడవలు జరిగాయి, వాటి నుంచి వారు ఎలా బయటపడ్డారు అనేదే ఈ సీజన్ ముఖ్య కథాంశం. ఇక ఈసిరీస్ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే… ఫస్ట్ ది హిలేరియస్ కామెడీ: ఈ సిరీస్ బలమే హ్యుమర్. ఈ సీజన్‌లో కూడా ముగ్గురు హీరోల టైమింగ్, వన్-లైనర్స్ నవ్విస్తాయి. ముఖ్యంగా అభినవ్ గోమఠం క్యారెక్టర్ డెలివరీ చేసే డైలాగ్స్ చాలా ఫన్నీగా ఉంటాయి.ఇక రెండో ప్లస్ పాయింట్.. నటీనటుల పర్ఫార్మెన్స్! ప్రియదర్శి, అభినవ్, చైతన్య ముగ్గురూ తమ పాత్రల్లో జీవించేశారు. వారికి జోడీగా నటించిన సుజాత, పవిత్ర, దేవియాని కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు.థర్డ్ ఫ్లస్ పాయింట్ ఏంటంటే.. రిలేటబుల్ సీన్స్! భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలు, సాటిలైట్ లైఫ్ సిట్యువేషన్స్‌ను చాలా క్రేజీగా, మిడిల్ క్లాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా చూపించారు. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే.. కొత్తదనం లోపించడం! మొదటి రెండు సీజన్లతో పోలిస్తే కథలో పెద్దగా కొత్తదనం కనిపించదు. కొన్ని సీన్లు పాత సీజన్లని రీసైకిల్ చేసినట్లు అనిపిస్తాయి. ప్రిడిక్టబుల్ స్క్రీన్‌ప్లే కూడా.. ఈ సిరీస్‌కి నెగెటివ్ అనే చెప్పాలి. కథ ఎలా ముగుస్తుందో ముందే ఊహించవచ్చు. కొన్ని చోట్ల కామెడీ కాస్త లాగ్ అయినట్లు అనిపిస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే… సేవ్ ద టైగర్స్ 3′ మునుపటి సీజన్ల అంత స్ట్రాంగ్‌గా లేకపోయినా… వీకెండ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా, ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా నవ్వుకోవడానికి ఒక పర్ఫెక్ట్ టైమ్‌పాస్ ఎంటర్‌టైనర్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vanda Devullu: తల్లి మళ్లీ పెళ్లి చేసుకుంటే తప్పేంటి? ‘వంద దేవుళ్లు’ రివ్యూ..
Honeymoon Tragedy: నగ్నంగా రక్తపు మడుగులో భార్య | ముస్సోరీలో ఆ రాత్రి..ఏం జరిగింది?
ప్రెగ్నెన్సీ నుంచి బిడ్డకు 6 నెలలు వచ్చే వరకు.. రూ.4 లక్షలు ఖర్చు
130 అడుగుల ఎత్తునుంచి పడినా బ్రతికే ఉంది..
గుడ్ల రక్షణకు ప్రాణాలను పణంగా పెట్టిన మాతృప్రేమ
ఒక సాధారణ వెల్డర్.. రాత్రికి రాత్రి కోటీశ్వరుడు ఎలా అయ్యాడు!
మాయమైపోతున్న మాన్సూన్.. రైతుల్లో టెన్షన్ టెన్షన్
బద్రీనాథ్ క్షేత్రానికి ముఖేశ్ అంబానీ కళ్లు చెదిరే విరాళం
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్లో వేసి. కుటుంబం ఆత్మహత్య

