భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చింత్రియాళ సర్పంచ్ హుషారనక్క ఊరిలో విస్తరించిన మద్యం విక్రయాలను నియంత్రించేందుకు వినూత్న మార్గం ఎంచుకున్నారు. యువత చెడిపోకుండా, మహిళలకు ఇబ్బందులు లేకుండా ఒకే బెల్ట్ షాప్ను వేలం వేసి, వచ్చిన ఆదాయాన్ని గ్రామ అభివృద్ధికి ఉపయోగిస్తున్నారు. ఇది నాలుగోసారి జరుగుతున్న వేలంపాట.