AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాత ఫోన్ అమ్మేస్తున్నారా? మీ పర్సనల్ డేటా సేఫ్టీ గురించి ఎప్పుడైనా ఆలోచించారా

ప్రతి ఏటా కొత్త స్మార్ట్‌ఫోన్ కొనే ట్రెండ్ పెరిగింది, కానీ పాత ఫోన్లను అమ్మే విషయంలో మాత్రం భారతీయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాజాగా క్యాషిఫై నిర్వహించిన సర్వేలో దాదాపు 70 శాతం మంది తమ వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు దుర్వినియోగం అవుతాయని భయపడుతున్నట్లు వెల్లడైంది. డేటా భద్రత పట్ల వినియోగదారుల ఆందోళనలు, ఆ భయాలకు గల కారణాల వివరంగా తెలుసుకుందాం!

పాత ఫోన్ అమ్మేస్తున్నారా? మీ పర్సనల్ డేటా సేఫ్టీ గురించి ఎప్పుడైనా ఆలోచించారా
Selling Your Old Phone.jpg
Nikhil
|

Updated on: Jun 21, 2026 | 7:20 AM

Share

ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేసినా డేటా భద్రంగా ఉంటుందా? పాత ఫోన్ విక్రయించేటప్పుడు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? డేటా గోప్యత విషయంలో ప్రజలు ఎలాంటి హామీలను కోరుకుంటున్నారు? పాత ఫోన్ల రీసేల్ మార్కెట్‌లో జరుగుతున్న పరిణామాలు, వినియోగదారుల భయాలు మరియు డేటా భద్రత కోసం వారు సిద్ధపడుతున్న వినూత్న పరిష్కారాల వివరంగా తెలుసుకుందాం..

రీసేల్ మార్కెట్

కొత్త ఫోన్ కోసం పాత ఫోన్‌ను అమ్మేటప్పుడు అందరిలోనూ మొదట మెదిలే ఆలోచన “నా వ్యక్తిగత ఫొటోలు, బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు, రహస్య చాట్స్ ఇతరుల చేతుల్లోకి వెళ్తే ఏంటి పరిస్థితి?” అని. క్యాషిఫై సర్వే ప్రకారం, ప్రతి నలుగురిలో ముగ్గురు ఇదే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ అమ్మకంలో ధర కంటే డేటా గోప్యతకే 45 శాతం మంది మెుదటి ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఫ్యాక్టరీ రీసెట్ నమ్మకమేంటి?

పాత ఫోన్ అమ్మేటప్పుడు ‘ఫ్యాక్టరీ రీసెట్’ చేయడం ప్రాథమిక నియమం. కానీ, 83 శాతం మంది ఈ రీసెట్ అవసరమని సూచించినప్పటికీ, అందులో 41 శాతం మంది ఆ ప్రక్రియపై నమ్మకం లేదని పేర్కొన్నారు. మూడింట ఒకవంతు మంది సర్వేలో పాల్గొన్నవారు, తాము పాత ఫోన్ నుండి డిలీట్ చేసిన డేటాను తిరిగి పొందగలిగామని చెప్పడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అందుకే ఫ్యాక్టరీ రీసెట్ చేసినా కూడా డేటా సేఫ్ అని వారు భావించడం లేదు.

వినియోగదారుల డిమాండ్స్

డేటా భద్రతపై గ్యారెంటీ ఉంటే పాత ఫోన్‌లను ధైర్యంగా అమ్ముతామని చాలా మంది స్పష్టం చేస్తున్నారు. ఇందుకోసం వారు కొన్ని కీలక సూచనలు చేస్తున్నారు.

  • డేటా డిలీషన్ సర్టిఫికేట్: ఫోన్‌లోని డేటా మొత్తం శాశ్వతంగా తొలగించబడిందని ధ్రువీకరించే సర్టిఫికేట్ ఇస్తే, దానికి అదనపు రుసుము చెల్లించడానికి కూడా 83 శాతం మంది సిద్ధంగా ఉన్నారు.
  • కఠినమైన చట్టాలు: రీసేల్ ప్లాట్‌ఫామ్స్ బాధ్యత తీసుకోవాలని, డేటా దొంగతనం చేసే వారిని కఠినంగా శిక్షించే చట్టాలు రావాలని కోరుకుంటున్నారు.

డిజిటల్ యుగంలో మీ డేటానే మీ అతిపెద్ద సంపద. పాత ఫోన్ అమ్మేముందు సాధ్యమైనంత వరకు క్లౌడ్ డేటాను తొలగించి, అవసరమైతే ఎక్స్‌పర్ట్స్ సలహా తీసుకోండి. ప్లాట్‌ఫామ్స్ కూడా వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకునేందుకు ‘డేటా క్లీనింగ్ సర్టిఫికేషన్’ వంటి పద్ధతులను అనుసరించడం ఇప్పుడు అనివార్యంగా మారింది. కొత్త ఫోన్ కొనడం ఎంత ముఖ్యమో, పాత ఫోన్ అమ్మేటప్పుడు జాగ్రత్తగా ఉండటం అంతకంటే ముఖ్యం!

Follow Us