ICC World Cup 2023: ఓర్నీ.. ఇలా కూడా ఔట్ అవుతారా? విచిత్రంగా బౌల్డైన జో రూట్.. వీడియో చూస్తే నవ్వాగదంతే
బుధవారం (నవంబర్ 8) నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నైనా జో రూట్ భారీ ఇన్నింగ్స్ ఆడతాడని ఇంగ్లాండ్ అభిమానులు ఆశించారు. కానీ అది జరగలేదు. విచిత్ర రీతిలో క్లీన్ బౌల్డై 28 పరుగులకే పెవిలియన్ చేరాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఎప్పటిలాగే డేవిడ్ మలన్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చాడు జో రూట్. ఎప్పట్లాగే చాలా నిలకడగా ఆడాడు
జో రూట్.. ప్రపంచంలోని టాప్ 4 అత్యుత్తమ బ్యాటర్లలో ఈ ఇంగ్లండ్ ఆటగాడికి పేరుంది. విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్‌లతో సమానంగా పరుగులు చేస్తూ ఫ్యాబ్-4 గ్రూఫ్‌లో భాగమయ్యాడు. అయితే ఈ ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ ప్రపంచ కప్‌లో పెద్దగా రాణించడం లేదు. తొలి రెండు మ్యాచ్‌ల్లో బాగా ఆడినా తర్వాతి మ్యాచ్‌ల్లో అతని బ్యాట్ నుంచి పరుగులు రావడం ఆగిపోయాయి. ఇక బుధవారం (నవంబర్ 8) నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నైనా జో రూట్ భారీ ఇన్నింగ్స్ ఆడతాడని ఇంగ్లాండ్ అభిమానులు ఆశించారు. కానీ అది జరగలేదు. విచిత్ర రీతిలో క్లీన్ బౌల్డై 28 పరుగులకే పెవిలియన్ చేరాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఎప్పటిలాగే డేవిడ్ మలన్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చాడు జో రూట్. ఎప్పట్లాగే చాలా నిలకడగానే ఆడాడు. అయితే ఇన్నింగ్స్‌లోని 20 ఓవర్లో లోగాన్ వాన్ బీక్ వేసిన రెండో బంతికి అనవసరంగా ర్యాంప్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే సరైన పొజిషన్‌లో లేకపోవడం వల్ల బంతి బ్యాట్‌కు మిస్ అయ్యి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో రూట్ విచిత్రంగా పెవిలియన్ బాట పట్టాడు. కాగా అప్పటికే జట్టు రన్ రేట్ కూడా బాగానే ఉంది. కానీ అకస్మాత్తుగా రివర్స్ స్కూప్ షాట్ ఆడి భారీ మూల్యం చెల్లించుకున్నాడు రూట్. అయితే అంతకుముందు ఓవర్‌లోనే ఇదే తరహా షాట్ ఆడి బాల్‌ను బౌండరీ దాటించడం గమనార్హం. సాధారణంగా రూట్ ఈ షాట్‌లను బాగా ఆడతాడు అయితే టైమ్ బాగోలేనప్పుడు మన బలం కూడా బలహీనంగా మారుతుందనడానికి రూట్ వికెట్ నిదర్శనం.
కాగా ప్రపంచకప్‌లో జో రూట్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. అతను 8 మ్యాచ్‌ల్లో 27 సగటుతో 216 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రూట్ పేలవమైన ప్రదర్శన ఇంగ్లాండ్ జట్టుపై కూడా ప్రభావం చూపింది. తన మొదటి 7 మ్యాచ్‌లలో 6 ఓడిపోయింది. గతసారి ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు సెమీఫైనల్ రేసుకు దూరమైంది. ఈ ప్రపంచకప్ తర్వాత రూట్ వన్డే జట్టుకు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై ఇంగ్లండ్ అద్భుత విజయం సాధించింది. పుణెలోని ఎంసీఏ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ బెన్ స్టోక్స్ (108) భారీ సెంచరీ సాధించాడు. ఈ సెంచరీతో ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. 340 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు 37.2 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్ జట్టు 160 పరుగుల తేడాతో విజయం సాధించింది.
రివర్స్ స్కూప్ ఆడి మూల్యం చెల్లించుకున్న రూట్..
View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..