Keedaa Cola: మూవీ లవర్స్‌కు ‘కీడా కోలా’ బంపరాఫర్‌.. రూ.112కే మల్టీప్లెక్స్‌ టికెట్‌.. ఎప్పటివరకంటే?

పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి ఫీల్‌ గుడ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తరుణ్‌ భాస్కర్‌ కీడా కోలా సినిమాను తెరకెక్కించాడు. క్రైమ్‌ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈమూవీకి దగ్గుబాటి రానా సమర్పకుడిగా వ్యవహరించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టే నవంబర్‌ 3న థియేటర్లలో విడుదలైన కీడా కోలా మూవీకి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది

Keedaa Cola: మూవీ లవర్స్‌కు 'కీడా కోలా' బంపరాఫర్‌.. రూ.112కే మల్టీప్లెక్స్‌ టికెట్‌.. ఎప్పటివరకంటే?
Keedaa Cola
Follow us
Basha Shek

|

Updated on: Nov 07, 2023 | 9:14 PM

సినిమా లవర్స్‌కు కీడా కోలా మూవీ టీమ్ బంపరాఫర్‌ ప్రకటించింది. తమ సినిమా టికెట్‌ మల్టీప్లెక్స్‌లో రూ. 112 కే పొందవచ్చని వెల్లడించింది. అయితే తెలంగాణ రాష్ట్రంలోని మల్టీప్లెక్స్‌ల్లో మాత్రమే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉందనుందని సూచించింది. బుధవారం (నవంబర్‌ 8) నుంచి శుక్రవారం (నవంబర్‌ 10) వరకు మూడు రోజుల పాటు ఆ స్పెషల్‌ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చునని పేర్కొంది. అయితే ఈ ఆఫర్‌లో షరతులు వర్తిస్తాయని నిబంధనలు విధించింది. రెక్లైనర్స్‌కు ఈ ఆఫర్‌ వర్తించదని సూచించింది. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి ఫీల్‌ గుడ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తరుణ్‌ భాస్కర్‌ కీడా కోలా సినిమాను తెరకెక్కించాడు. క్రైమ్‌ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈమూవీకి దగ్గుబాటి రానా సమర్పకుడిగా వ్యవహరించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టే నవంబర్‌ 3న థియేటర్లలో విడుదలైన కీడా కోలా మూవీకి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. అయితే మరికొంతమంది జనాలకు ఈ సినిమాను అందించాలనే ఉద్దేశంతో కీడా కోల్‌ టీమ్‌ రూ.112 లకే మల్టీప్లెక్స్‌ టికెట్ ఆఫర్‌ ప్రకటించింది.

కీడా కోలా సినిమాలో తరుణ్‌ భాస్కర్‌ కూడా ఓ కీలక పాత్ర పోషించాడు. అలాగే చైతన్య రావు, మయూర్ రాగ్, జీవన్, బ్రహ్మానందం, జీవన్, రఘురామ్, విష్ణు, రవీంద్ర విజయ్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో మెరిశారు. విజి సైన్మా ప్రొడక్షన్ బ్యానర్‌పై కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ కీడా కోలా సినిమాను నిర్మించారు. వివేక్ సాగర్ స్వరాలు సమకూర్చారు. ఏజే ఆరోన్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా, ఉపేంద్ర వర్మ ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వర్తించారు. మరి మంచి క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌ సినిమా చూడాలనుకుంటే కీడా కోలా పై ఓ లుక్కేయండి. పైగా బంపరాఫర్‌ కూడా అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

తెలంగాణ మల్టీప్లెక్సుల్లో మాత్రమే..

పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.