Kriti Sanon: నీలిరంగు చీరలోన.. వయ్యారాలు ఒలక బోసిన కృతి సనన్.. మైండ్ బ్లోయింగ్ ఫొటోస్ చూశారా?
బాలీవుడ్ అందాల తార కృతి సనన్ ఆదిపురుష్ సినిమాతో దక్షిణాది ప్రేక్షకులకు మరింత చేరువైంది. సినిమా ఫలితం ఎలా ఉన్నా ప్రభాస్ సినిమాలో జానకిగా కృతి నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. ఇటీవలే టైగర్ ష్రాఫ్‌తో కలిసి గణ్‌పత్ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల్ని పలకరించింది.
Updated on: Nov 08, 2023 | 6:55 AM

బాలీవుడ్ అందాల తార కృతి సనన్ ఆదిపురుష్ సినిమాతో దక్షిణాది ప్రేక్షకులకు మరింత చేరువైంది. సినిమా ఫలితం ఎలా ఉన్నా ప్రభాస్ సినిమాలో జానకిగా కృతి నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. ఇటీవలే టైగర్ ష్రాఫ్‌తో కలిసి గణ్‌పత్ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల్ని పలకరించింది.

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది కృతి. నిత్యం తన లేటెస్ట్, గ్లామరస్ ఫొటోలను ఇన్ స్టా గ్రామ్‌లో షేర్ చేసుకుంటుంది. అలాగే తన సినిమా విషయాలను ఫాలోవర్స్‌తో పంచుకుంటుంది.

ఇక మోడ్రన్ డ్రస్సులతో పాటు తరచూ చీరలు ధరించి ట్రెడిషినల్ లుక్‌తో ఆకట్టుకుంటుంది కృతి. తాజాగా నీలిరంగు చీరలోన తళుక్కుమందీ అందాల తార.

ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ మనీశ్ మల్హోత్రా దీపావళి బ్యాష్ కి హాజరైన ఈ ముద్దుగుమ్మ శారీలో హొయలు ఒలికించింది. అనంతరం దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

ప్రస్తుతం కృతి సనన్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. బ్యూటిఫుల్, గార్జియస్ అంటూ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.