- Telugu News Photo Gallery Cinema photos Salaar to Naa Sami Ranga latest movie updates from film industry
Movie Updates: ఆ రోజు నుంచి సలార్ ప్రమోషన్స్ షురూ.. అక్కడ నా సామిరంగ చిత్రీకరణ..
మార్ఫింగ్ వీడియో వైరల్ అవ్వటంపై ఆవేదన వ్యక్తం చేశారు స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న. సలార్ ప్రమోషన్స్ స్పీడు పెంచేందుకు రెడీ అవుతోంది మూవీ టీమ్. కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ నా సామిరంగ. అనుష్క బర్త్ డే సందర్భంగా అప్ కమింగ్ సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. బ్రేకప్ వార్తలపై క్లారిటీ ఇచ్చారు బాలీవుడ్ బ్యూటీ తారా సుతారియా. యాత్ర సినిమాకు సంబంధించి మరో కీలక అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Prudvi Battula
Updated on: Nov 08, 2023 | 8:52 AM

మార్ఫింగ్ వీడియో వైరల్ అవ్వటంపై ఆవేదన వ్యక్తం చేశారు స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న. ఈ విషయంలో ఇండస్ట్రీ నుంచి చాలా మంది ప్రముఖులు రష్మికకు మద్దతు తెలుపుతున్నారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా స్పందించటంతో జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయ్యింది. టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేయటం భయం కలిగిస్తుందన్నారు రష్మిక.

సలార్ ప్రమోషన్స్ స్పీడు పెంచేందుకు రెడీ అవుతోంది మూవీ టీమ్. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ట్రైలర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తోంది. నవంబర్ నెలాఖరున లేదా, డిసెంబర్ మొదటి వారంలో గ్రాండ్ ఈవెంట్‌లో ట్రైలర్‌ను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకుడు.

కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ నా సామిరంగ. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయం అవుతూ రూపొందిస్తున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ మైసూర్‌లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో లీడ్ క్యారెక్టర్స్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అల్లరి నరేష్ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అనుష్క బర్త్ డే సందర్భంగా అప్ కమింగ్ సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. రీసెంట్‌గా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ, తన 50 సినిమాను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. సూపర్ హిట్ థ్రిల్లర్ భాగమతికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే భాగమతి 2 సెట్స్ మీదకు వెళుతుందని వెల్లడించారు మేకర్స్.

బ్రేకప్ వార్తలపై క్లారిటీ ఇచ్చారు బాలీవుడ్ బ్యూటీ తారా సుతారియా. అసలు తాను ఎవరితోనూ రిలేషన్‌లోనే లేను అన్నారు తారా. కలిసి వర్క్ చేసినంత మాత్రానా వాళ్లతో రిలేషన్‌లో ఉన్నాననటం కరెక్ట్ కాదు అన్నారు. ఈ విషయంలో తనను అర్ధం చేసుకునే తల్లి దండ్రులు ఉండటం తన అదృష్టం అన్నారు తారా సుతారియా.

యాత్ర సినిమాకు సంబంధించి మరో కీలక అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో కీలకమైన సోనియా పాత్రలో జర్మనీ నటి సుజానే బెర్నెర్ట్ నటిస్తున్నారు. మోడల్‌గా కెరీర్ ప్రారంబంచిన సుజానే హిందీ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు, టీవీ సీరియల్స్‌లోనూ నటించారు. మహి వి రాఘవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జీవా లీడ్ రోల్‌లో నటిస్తున్నారు.





























