AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nuclear Bomb: ప్రపంచం అంతం అవ్వడానికి ఎన్ని అణుబాంబులు కావాలి.? అసలు నిజం తెలిస్తే మైండ్ బ్లాంకే

సాధారణంగా ఓ ప్రాంతంలో ఒక అణుబాంబు పడితే.! దాని ఎఫెక్ట్ దారుణంగా ఉంటుంది. కోట్లలో మనుషులు చనిపోవడమే కాదు.. ఆకలి చావులు కూడా చూస్తాం. ఇక ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. అయితే మీకు ఇది తెలుసా.? ప్రపంచం అంతం అవ్వడానికి ఎన్ని అణుబాంబులు కావాలి.?

Nuclear Bomb: ప్రపంచం అంతం అవ్వడానికి ఎన్ని అణుబాంబులు కావాలి.? అసలు నిజం తెలిస్తే మైండ్ బ్లాంకే
Nuclear Bomb
Ravi Kiran
|

Updated on: Mar 02, 2026 | 11:51 AM

Share

మూడో ప్రపంచం యుద్ధం మొదలైంది. ఇజ్రాయిల్, అమెరికా సంయుక్తంగా కలిసి ఇరాన్‌పై యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. అటు ఇరాన్ కూడా.. ఆ రెండు దేశాలతో పాటు.. వాటికి దన్నుగా నిలిచిన గల్ఫ్ కంత్రీలపై బాంబులతో విరుచుకుపడుతోంది. ఇక ఇదిలా ఉంటే.. ఎన్ని అణుబాంబులు పడితే.. మన భూమిపై లైఫ్ అంతమైపోతుందో మీకు తెల్సా.! లెక్కలు చూస్తే షాక్ అవుతారు. భూమిపై వివిధ ప్రాంతాల్లో 100 అణుబాంబులు పడ్డాయని అనుకుందాం. ఫస్ట్ అవి పడిన ప్లేస్‌లలో కోట్లలో జనాలు చనిపోతారు.

అన్ని బాంబులు పడటం వల్ల పొగ ఎంత వస్తుందంటే..! సుమారు 10 అంతకంటే ఎక్కువ సంవత్సరాల పాటు ఆ పొగ.. మన భూమిపై సూర్యరశ్మి పడకుండా ఆపేస్తుంది. ఇక సూర్యరశ్మి లేకపోవడం వల్ల ఉష్ణోగ్రతలు పడిపోతాయి. భూమి పూర్తిగా చల్లగా మారిపోయి.. మైనస్ డిగ్రీలకు చేరుకుంటుంది. దీనినే ‘న్యూక్లియర్ వింటర్’ అంటారు. ఇలాంటి వాతావరణంలో పంటలు పండవు. అణుబాంబుల వల్ల గాలి మొత్తం కలుషితం అయిపోతుంది. ఆ బ్రతికి ఉన్న కొంతమంది గాలి కాలుష్యం వల్ల, ఫుడ్ లేకపోవడం వల్ల ఆపై పదేళ్లలో చనిపోతారు. అలా భూమి మీద మనిషి అనేవాడు అంతమైపోతాడు. ఇదంతా కూడా జస్ట్ 100 అణుబాంబులు పడితే వచ్చే ఎఫెక్ట్.

మన ఎర్త్ మీద ఎన్ని అణుబాంబులు ఉన్నాయో తెల్సా..

రష్యా – 5459

అమెరికా – 5277

చైనా – 600

ఫ్రాన్స్ – 290

యూకే – 225

భారత్ – 180

పాకిస్తాన్ – 170

ఇజ్రాయిల్ – 91

నార్త్ కొరియా – 50

ఇలా మొత్తం ప్రపంచంలో 12,000 అణుబాంబులు ఉన్నాయి. 100 అణుబాంబులు పడితేనే భూమిపై లైఫ్ అనేది ఉండదు. అలాంటిది ఈ 12 వేల అణుబాంబులతో సగం సోలార్ సిస్టమ్ లేపెయొచ్చు. ఇదంతా చూస్తుంటే.. అన్ని జీవుల కంటే తెలివైన జీవులు మనుషులు అని అంటారు. కానీ ఆ మనిషే తన చావును తానే తయారు చేసుకుని పక్కన పెట్టుకున్నట్టు లెక్క.!

Follow Us
అతి తక్కవ ధరలో అరకు అందాలు చూడొచ్చు.. ఐఆర్‌సీటీసీ ప్యాకేజ్..
అతి తక్కవ ధరలో అరకు అందాలు చూడొచ్చు.. ఐఆర్‌సీటీసీ ప్యాకేజ్..
నెలకు మీ ఇంట్లో ఎంత నూనె వాడుతున్నారు? ఆరోగ్యంగా ఉండాలంటే..
నెలకు మీ ఇంట్లో ఎంత నూనె వాడుతున్నారు? ఆరోగ్యంగా ఉండాలంటే..
హైదరాబాదీలకు సూపర్ గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో ప్లైఓవర్
హైదరాబాదీలకు సూపర్ గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో ప్లైఓవర్
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌ నారాయణ్‌ ఎన్నిక
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌ నారాయణ్‌ ఎన్నిక
కడుపు నిండా తిండి లేదు.. చెప్పులరిగేలా ప్రయత్నాలు..
కడుపు నిండా తిండి లేదు.. చెప్పులరిగేలా ప్రయత్నాలు..
బ్యాంక్ ఆక్షన్‌లో ప్రాపర్టీలు కొంటున్నారా.?
బ్యాంక్ ఆక్షన్‌లో ప్రాపర్టీలు కొంటున్నారా.?
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై లోక్‌సభలో ఓటింగ్
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై లోక్‌సభలో ఓటింగ్
బంగారం ధరలు మరోసారి పతనం.. ఉన్నట్లుండి కుప్పకూలిన ధరలు..
బంగారం ధరలు మరోసారి పతనం.. ఉన్నట్లుండి కుప్పకూలిన ధరలు..
ప్లాస్టిక్ బాటిల్ ఉంటే చాలు,ఇంట్లోనే తాజా వెల్లుల్లిని పండించొచ్చ
ప్లాస్టిక్ బాటిల్ ఉంటే చాలు,ఇంట్లోనే తాజా వెల్లుల్లిని పండించొచ్చ
రోహిత్ శర్మ మిషన్ 2027.. అగార్కర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
రోహిత్ శర్మ మిషన్ 2027.. అగార్కర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?