AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవర్‌ఫుల్ కషాయం మావ.. ఉదయాన్నే తాగితే ఆ సమస్యలన్నీ మటుమాయమే..

జామ చెట్టు భారతీయ సంస్కృతిలో ఒక అమృత ఫలంగా ప్రసిద్ధి చెందింది. దీనిని సంస్కృతంలో అమృత ఫలం అని కూడా పిలుస్తారు. జామ మొక్క ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. కేవలం పండ్లు మాత్రమే కాకుండా, దీని ఆకులు, బెరడు, వేర్లు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి.

పవర్‌ఫుల్ కషాయం మావ.. ఉదయాన్నే తాగితే ఆ సమస్యలన్నీ మటుమాయమే..
Guava Leaf Benefits
Shaik Madar Saheb
|

Updated on: Mar 02, 2026 | 10:02 AM

Share

జామ చెట్టు భారతీయ సంస్కృతిలో ఒక అమృత ఫలంగా ప్రసిద్ధి చెందింది. దీనిని సంస్కృతంలో అమృత ఫలం అని కూడా పిలుస్తారు. జామ మొక్క ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. కేవలం పండ్లు మాత్రమే కాకుండా, దీని ఆకులు, బెరడు, వేర్లు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. జామను బొటానికల్‌గా సిడియం గ్వాజావా అని అంటారు. ఇది మెర్టేసి కుటుంబానికి చెందిన వృక్షం. జామ ఆకుల్లోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం వంటి పోషకాలతో నిండిన సహజ ఔషధం ఎన్నో సమస్యలకు దివ్యౌషధంలా పనిచేస్తాయి. ఇవి మధుమేహాన్ని నియంత్రించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, అతిసారం (డయేరియా) తగ్గించడంలో, కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో.. రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తాయని పేర్కొంటున్నారు ఆయుర్వేద నిపుణులు..

జామ – ఆరోగ్యానికి చిరునామా అని చెప్పొచ్చంటున్నారు. జామ చెట్లు భారతదేశంలో ముఖ్యంగా ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతాలలో పెరుగుతాయి. ఇప్పుడు.. అన్ని ప్రాంతాల్లోనూ ఏడాది పొడువునా తక్కువ ధరకే లభిస్తున్నాయి.. జామ పండ్లతోపాటు.. ఆకులను కూడా ఉపయోగించి.. ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు..

ముఖ్యంగా జామ ఆకులు విరేచనాలు, దంత నొప్పులు వంటి సమస్యలకు అద్భుతమైన నివారణిగా పనిచేస్తాయి. ఆయుర్వేదం ప్రకారం, జామ ఆకులు శోధనివారణిగా, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతో పేగులోని ఇన్ఫెక్షన్లను తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. విరేచనాలను తగ్గించేందుకు ఒక పిడికెడు జామ ఆకులను 100 మిల్లీలీటర్ల నీటిలో వేసి 25 మిల్లీలీటర్ల వరకు మరిగించి కషాయం చేసుకుని తాగవచ్చు.

దంత నొప్పికి కొన్ని జామ ఆకులను నమిలి, ఆ పేస్ట్‌ను నొప్పి ఉన్న పంటిపై ఉంచడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. జామ ఆకుల్లోని యాంటీ ప్లేక్ గుణాలు నోటి ఆరోగ్యానికి తోడ్పడతాయి.

జామ ఆకులకి యాంటీ ప్లేక్ లక్షణాలు.. ఇది నోట్లో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేసి, దంతాల మీద పేరుకుపోయే ప్లేక్‌ను తగ్గిస్తుంది. దీనితో దంత నొప్పి, నోటి సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

జామాకుల కాషాయం.. మధుమేహంలో మంచిగా పనిచేస్తుంది. షుగర్ ను కంట్రోల్ ఉంచుతుంది. అంతేకాకుండా.. కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో.. రోగనిరోధక శక్తిని పెంచడంలో పనిచేస్తుంది.

ఈ అద్భుతమైన జామ మొక్క, ఆకులను మనం ఉపయోగించుకుని ప్రయోజనాలను పొందవచ్చని పేర్కొంటున్నారు ఆయుర్వేద నిపుణులు.. దీనికోసం ఉదయాన్నే పరగడుపున ఆకుల కాషాయాన్ని తీసుకోవడం మంచిదని పేర్కొంటున్నారు.

అయితే.. ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే.. జామాకుల కాషాయం ఉపయోగించే ముందు వైద్య నిపుణులను సంప్రదించండి..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us