Ustaad Bhagat Singh: ‘ఈ ఆవేశమే తగ్గించుకుంటే మంచిది’ పవన్ సినిమాపై పుకార్లకు హరీష్ శంకర్ కౌంటర్
గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. పోలీస్ కాప్ స్టోరీతో రూపొందుతోన్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను నిర్మిస్తున్నారు
గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. పోలీస్ కాప్ స్టోరీతో రూపొందుతోన్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను నిర్మిస్తున్నారు. గబ్బర్ సింగ్ సినిమాలో లాగే ఇందులోనూ స్టైలిష్ పోలీస్‌గా కనిపించనున్నాడు పవన్ కల్యాణ్. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ ఫ్యాన్స్‌ను అమితంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఉస్తాద్ కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నాడు డైరెక్టర్ హరీశ్ శంకర్. ఇదిలా ఉంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వార్త బాగా చక్కర్లు కొడుతోంది. పవన్ సినిమా నుంచి డైరెక్టర్ హరీష్ శంకర్ తప్పుకున్నాడని టాక్ వినిపిస్తోంది. జనసేన అధ్యక్షులుగా పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఉస్తాద్ సినిమా షూటింగ్ ఆలస్యమవుతోందని, అందుకే హరీష్ శంకర్ ఈ సినిమా నుంచి వైదొలిగాడంటూ పుకార్లు షికారు చేస్తోన్నాయి. అలాగే పవన్ సినిమా స్థానంలో రవితేజతో ఓ మూవీకి హరీష్ ప్లాన్ చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై వస్తోన్న పుకార్లపై స్పందించాడు డైరెక్టర్ హరీష్ శంకర్. పవన్ కల్యాణ్ సినిమా నుంచి తాను తప్పుకోవడం, రవితేజతో సినిమా చేయబోతుండటం రెండు అబద్ధమేనని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ ఆవేశమే తగ్గించుకుంటే మంచిది అంటూ ఇలాంటి రూమర్లు సృష్టిస్తోన్న వారికి గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు డైరెక్టర్. తద్వారా పవన్ సినిమాపై వస్తోన్న పుకార్లకు చెక్ పెట్టాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో సీనియర్ నటి గౌతమి, అశుతోష్ రాణా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చాలా భాగం వరకు ఈ మూవీ షూటింగ్ పూర్తైనట్లు సమాచారం.
డైరెక్టర్ హరీష్ శంకర్ ట్వీట్..
Rendu wrong…….
ఈ ఆవేశమే తగ్గించుకుంటే
మంచిది!!! May God Bless u https://t.co/K35hrcOYxg
— Harish Shankar .S (@harish2you) November 7, 2023
రవితేజతో సినిమా చేయట్లేదు..
Mass Maharaaj in never before Avatar….. this is going to be something special… 😍😍 https://t.co/O93sniZA9W
— Harish Shankar .S (@harish2you) November 6, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.