AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mad OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఎన్టీఆర్ బావమరిది సినిమా.. జవాన్‌ సైతం వెనకే.. మ్యాడ్‌ ఎక్కడ చూడొచ్చంటే?

ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా థియేటర్లలోకి విడుదలైన మ్యాడ్ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది. అక్టోబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యువతను బాగా అలరించింది. అన్ని చోట్ల పాజిటివ్‌ టాక్‌, రివ్యూలు వచ్చాయి. బాక్సాఫీస్‌ వద్ద భారీగానే వసూళ్లు రాబట్టింది. థియేటర్లలో ఆడియెన్స్‌ను కడుపుబ్బా నవ్వించిన మ్యాడ్ సినిమా ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌ను కూడా బాగా అలరిస్తోంది.

Mad OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఎన్టీఆర్ బావమరిది సినిమా.. జవాన్‌ సైతం వెనకే.. మ్యాడ్‌ ఎక్కడ చూడొచ్చంటే?
Mad Movie
Basha Shek
|

Updated on: Nov 06, 2023 | 10:01 PM

Share

యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ ఎన్టీఆర్‌ బావ మరిది నార్నే నితిన్‌ హీరోగా పరిచయమైన చిత్రం మ్యాడ్‌. కల్యాణ్‌ కృష్ణ తెరకెక్కించిన ఈ యూత్‌ ఫుల్ ఎంటర్‌టైనర్‌ మూవీలో హీరో సంతోష్‌ శోభన్‌ తమ్ముడు సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌ సెకెండ్‌, థర్డ్‌ లీడ్‌ రోల్స్‌ పోషించారు. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా థియేటర్లలోకి విడుదలైన మ్యాడ్ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది. అక్టోబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యువతను బాగా అలరించింది. అన్ని చోట్ల పాజిటివ్‌ టాక్‌, రివ్యూలు వచ్చాయి. బాక్సాఫీస్‌ వద్ద భారీగానే వసూళ్లు రాబట్టింది. థియేటర్లలో ఆడియెన్స్‌ను కడుపుబ్బా నవ్వించిన మ్యాడ్ సినిమా ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌ను కూడా బాగా అలరిస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ ఫ్లిక్స్‌ ఈ యూత్‌ ఫుల్‌ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను కొనుగోలు చేసింది. నవంబర్‌ 3 నుంచి మ్యాడ్ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. కాగా ఇండియాలో నెట్‌ఫ్లిక్స్‌ ప్లాట్‌ఫామ్‌లో ఎక్కువ మంది చూస్తున్న చిత్రాల్లో మ్యాడ్ సినిమా ఒకటిగా నిలిచింది. టాప్‌- 10 సినిమాల్లో షారుక్‌ ఖాన్‌ జవాన్‌ హిందీ వెర్షన్‌ మొదటి స్థానంలో ఉంది. అయితే త‌మిళ, తెలుగు వెర్ష‌న్ల‌ను మాత్రం మ్యాడ్ సినిమా వెన‌క్కు నెట్టేసింది. టాప్‌-10 నెట్‌ఫ్లిక్స్‌ సినిమాల్లో మ్యాడ్ ఏకంగా రెండో స్థానంలో నిలిచింది. జ‌వాన్ త‌మిళ వ‌ర్ష‌న్ మూడో స్థానంలో, తెలుగు వ‌ర్ష‌న్ నాలుగో ప్లేస్‌లో నిలిచాయి. ఇక ఆయుష్మాన్‌ ఖురానా డ్రీమ్ గ‌ర్ల్ 2 ఐదో స్థానంలో ఉంది. ఈ జాబితాలో రాఘవ లారెన్స్‌, కంగనా రనౌత్‌ల చంద్ర‌ముఖి 2 ప‌దో స్థానంలో ఉంది.

మ్యాడ్ సినిమాలో శ్రీ గౌరి ప్రియా రెడ్డి, అనంతిక, గోపిక హీరోయిన్లుగా నటించారు. అలాగే రఘు బాబు, రచ్చ రవి, మురళీధర్‌ గౌడ్‌, విష్ణు, ఆంటోని, శ్రీకాంత్‌ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. అలాగే జాతి రత్నాలు ఫేమ్‌ దర్శకుడు కేవీ అనుదీప్‌ కూడా ఓ క్యామియో రోల్‌లో మెరిశారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్లపై త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సతీమణి సాయి సౌజన్య, హారిక సూర్యదేవర సంయుక్తంగా మ్యాడ్ సినిమాను నిర్మించారు. ధమాకా, బలగం వంటి బ్లాక్‌ బస్టర్‌ మూవీస్‌ కు పాటలు అందించిన భీమ్స్‌ సిసిరిలియో ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. మరి థియేటర్లలో మ్యాడ్ సినిమాను మిస్‌ అయ్యారా? లేదా మళ్లీ చూడాలనుకుంటున్నారా? అయితే ఎంచెక్కా నెట్‌ఫ్లిక్స్‌ ఒటీటీ లో ఉంది. చూసి ఇంటిల్లి పాది కడుపుబ్బా నవ్వుకోండి.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

మ్యాడ్ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వ్యక్తి చనిపోయిన తర్వాత ఆధార్ కార్డును ఏం చేయాలి?
వ్యక్తి చనిపోయిన తర్వాత ఆధార్ కార్డును ఏం చేయాలి?
రూపాయి నాణెం తయారీకి ఎంత ఖర్చువుతందంటే..? ప్రభుత్వ లెక్కలివే..
రూపాయి నాణెం తయారీకి ఎంత ఖర్చువుతందంటే..? ప్రభుత్వ లెక్కలివే..
రెడ్ రైస్ ప్రయోజనాలు తెలిస్తే ఇక తెల్లన్నం మానేస్తారు!
రెడ్ రైస్ ప్రయోజనాలు తెలిస్తే ఇక తెల్లన్నం మానేస్తారు!
ఈ స్కూల్ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్
ఈ స్కూల్ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్
ఉడికించిన గుడ్లు బయట పెడుతున్నారా? ఈ టైమ్ దాటితే తినకండి!
ఉడికించిన గుడ్లు బయట పెడుతున్నారా? ఈ టైమ్ దాటితే తినకండి!
Video: చీర కొంగును ఇంజిన్‌కు కట్టి .. ట్రైన్ ముందు మహిళ డ్యాన్స్!
Video: చీర కొంగును ఇంజిన్‌కు కట్టి .. ట్రైన్ ముందు మహిళ డ్యాన్స్!
ఉల్లిపాయ, టమాటాలు ఇంట్లో ఉన్నాయా?.. అదిరిపోయే చట్నీ రెసిపీ
ఉల్లిపాయ, టమాటాలు ఇంట్లో ఉన్నాయా?.. అదిరిపోయే చట్నీ రెసిపీ
ట్రైన్‌లోకి పాములతో ఎంట్రీ ఇచ్చిన ఆరుగురు వ్యక్తులు.. కట్‌చేస్తే.
ట్రైన్‌లోకి పాములతో ఎంట్రీ ఇచ్చిన ఆరుగురు వ్యక్తులు.. కట్‌చేస్తే.
వెండి వస్తువులపై నల్లటి పొర పోవాలంటే.. ఈ ట్రిక్ ట్రై చేయండి!
వెండి వస్తువులపై నల్లటి పొర పోవాలంటే.. ఈ ట్రిక్ ట్రై చేయండి!
బీపీ, కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడుతున్నారా?
బీపీ, కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడుతున్నారా?