AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: బిగ్‌ బాస్‌ పదో వారం నామినేషన్స్‌.. లిస్టులో టాప్‌ కంటెస్టెంట్లు.. ఎవరెవరున్నారంటే?

ఐదో వారం నామినేషన్స్‌ ప్రక్రియ విషయానికి వస్తే.. 'రాజమాత, ప్రజా' అనే కాన్సెప్టును తీసుకొచ్చాడు బిగ్‌ బాస్‌. ఇందులో ప్రియాంక, శోభ, అశ్విని, రతికలు రాజమాతలుగా వ్యవహరిస్తారు. మగ కంటెస్టెంట్లు మగాళ్లనే నామినేట్ చేయాలి. ఇందుకు తగిన కారణాలు చెప్పి రాజమాతలను ఒప్పించాల్సి ఉంటుంది.

Bigg Boss 7 Telugu: బిగ్‌ బాస్‌ పదో వారం నామినేషన్స్‌.. లిస్టులో టాప్‌ కంటెస్టెంట్లు.. ఎవరెవరున్నారంటే?
Bigg Boss 7 Telugu
Basha Shek
| Edited By: |

Updated on: Nov 07, 2023 | 1:12 AM

Share

బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న అతి పెద్ద సెలబ్రిటీ రియాలిటీ షో బిగ్‌ బాస్‌ సక్సెస్‌ ఫుల్‌ గా తొమ్మిది వారాలు పూర్తి చేసుకుంది. పదో వారంలోకి అడుగుపెట్టింది. ఇక బిగ్‌ బాస్‌ లో సోమవారం అంటేనే నామినేషన్స్‌ హీట్ కచ్చితంగా ఉంటుంది. అలా పదో వారం నామినేషన్స్‌ కూడా హోరాహోరీగా సాగాయి. హౌజ్‌లోని కంటెస్టెంట్స్‌ ఒకరినొకరు నామినేట్‌ చేసుకుంటూ రచ్చ రచ్చ చేశారు. పదో వారం నామినేషన్స్‌ ప్రక్రియ విషయానికి వస్తే.. ‘రాజమాత, ప్రజా’ అనే కాన్సెప్టును తీసుకొచ్చాడు బిగ్‌ బాస్‌. ఇందులో ప్రియాంక, శోభ, అశ్విని, రతికలు రాజమాతలుగా వ్యవహరిస్తారు. మగ కంటెస్టెంట్లు మగాళ్లనే నామినేట్ చేయాలి. ఇందుకు తగిన కారణాలు చెప్పి రాజమాతలను ఒప్పించాల్సి ఉంటుంది. అలా పదో వారం నామినేషన్స్‌లోనూ కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు విరుచుకు పడ్డారు. ముఖ్యంగా పాట బిడ్డ భోలేషావలి ప్రియాంక జైన్‌ ల మధ్య మాటల తూటాలు పేలాయి. ఈసారి ప్రియాంకకు తోడుగా అమర్‌దీప్ చౌదరి, శోభా శెట్టిలు కూడా భోలేతో గొడవలు పెట్టుకున్నారని తెలుస్తోంది. ఇక రాజమాతల మధ్య కూడా వాదనలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రతివారం రెండు రోజుల పాటు సాగే ఈ నామినేషన్స్ ప్రక్రియలో సోమవారం ఐదుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయినట్టు తెలుస్తోంది. అందులో రతికా రోజ్‌, ప్రిన్స్‌ యావర్‌, శివాజీ, భోలే షా వళి, గౌతమ్‌ కృష్ణ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మంగళవారంతో మరికొందరు ఈ లిస్ట్‌లోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం అమర్‌ దీప్‌ చౌదరి, అంబటి అర్జున్‌, పల్లవి ప్రశాంత్‌ కూడా నామినేషన్స్‌లోకి వస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

కాగా బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లోకి మొదట 14 మంది సెలబ్రిటీలు కంటెస్టెంట్లుగా వచ్చారు. ఆతర్వాత ఐదో వారంలో మరో ఐదుగురు కంటెస్టెంట్లుగా హౌజ్‌లోకి అడుగుపెట్టారు. ఇక ఎలిమినేషన్స్‌ విషయానికి వస్తే.. మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారం సింగర్‌ దామిని భట్ల, నాలుగో వారం రతికా రోజ్, ఐదో వారంలో శుభశ్రీ రాయగురు, ఆరో వారంలో నయని పావని, ఏడో వారంలో పూజా మూర్తి ఎలిమినేట్‌ అయ్యారు. ఇక ఎనిమిదో వారంలో సందీప్ మాస్టర్‌ హౌజ్‌ నుంచి బయటకు వెళ్లిపోయాడు. తద్వారా ఈ సీజన్‌లో ఎలిమినేట్‌ అయిన మొదటి మేల్ కంటెస్టెంట్‌గా నిలిచాడు. ఇక తొమ్మిదో వారంలో టేస్టీ తేజా హౌజ్‌ నుంచి బయటకు వెళ్లిపోయాడు. మరి ఈ వారం కూడా మగ కంటెస్టెంటే ఎలిమినేట్‌ అవుతాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

నామినేషన్ లిస్టులో టాప్ కంటెస్టెంట్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ధీరజ్ పొరపాటు.. ప్రేమ మనసుకు మరో గాయం.. ఇక దూరమే..
ధీరజ్ పొరపాటు.. ప్రేమ మనసుకు మరో గాయం.. ఇక దూరమే..
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే