Virat Kohli: ‘సెల్ఫిష్‌.. ఒక్క సిక్స్ కొట్టలే’.. 49వ సెంచరీ కొట్టిన కోహ్లీపై ట్రోలింగ్‌.. ఫ్యాన్స్‌ కౌంటర్లు

ప్రపంచ కప్ లో భాగంగా దక్షిణాఫ్రికా తో జరిగిన 37వ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీతో చెలరేగాడు. గత రెండు మ్యాచ్‌ల్లోనూ సెంచరీకి దగ్గరికి వచ్చి ఔటైన విరాట్ కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై మాత్రం అజేయ సెంచరీతో చెలరేగాడు. అంతేకాదు సచిన్‌ అత్యధిక సెంచరీల రికార్డును కూడా సమం చేశాడు.

Virat Kohli: 'సెల్ఫిష్‌.. ఒక్క సిక్స్ కొట్టలే'.. 49వ సెంచరీ కొట్టిన కోహ్లీపై ట్రోలింగ్‌.. ఫ్యాన్స్‌ కౌంటర్లు
Virat Kohli
Follow us
Basha Shek

|

Updated on: Nov 05, 2023 | 9:52 PM

కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. 49 వన్డే సెంచరీల సచిన్ రికార్డును విరాట్ కోహ్లీ సమం చేశాడు. ప్రపంచ కప్ లో భాగంగా దక్షిణాఫ్రికా తో జరిగిన 37వ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీతో చెలరేగాడు. గత రెండు మ్యాచ్‌ల్లోనూ సెంచరీకి దగ్గరికి వచ్చి ఔటైన విరాట్ కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై మాత్రం అజేయ సెంచరీతో చెలరేగాడు. అంతేకాదు సచిన్‌ అత్యధిక సెంచరీల రికార్డును కూడా సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 121 బంతులు ఎదుర్కొన్న విరాట్ 10 ఫోర్లతో 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే ఈ మధ్యన విరాట్‌ కోహ్లీపై కొన్ని విమర్శలు వస్తున్నాయి. దేశం కోసం కాకుండా, వ్యక్తిగత రికార్డుల కోసం స్వార్థంగా ఆడుతున్నారంటూ కొందరు కోహ్లీని ట్రోల్‌ చేస్తున్నారు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లోనూ సెంచరీ కోసం నెమ్మదిగా ఆడాడని, కనీసం ఒక్క సిక్స్‌ కూడా కొట్టలేదంటూ టీమిండియా రన్‌ మెషిన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే వీటికి గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌. దక్షిణఫ్రికాతో మ్యాచ్‌లో పిచ్‌ బాగా నెమ్మదిగా ఉందని, కఠినమైన పిచ్‌పై వరుసగా వికెట్లు పడుతున్నందుకే కింగ్‌ కోహ్లీ నెమ్మదిగా ఆడాడని ఫ్యాన్స్‌ చెబుతున్నారు. ఇన్నింగ్స్‌ ఆరంభంతో పోల్చితే తర్వాత పిచ్‌ బాగా స్లో అయినందునే అందరూ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మెరుపు ఆరంభాన్ని అందించారు. వీరిద్దరి అద్భుత బ్యాటింగ్ కారణంగా భారత్ తొలి 10 ఓవర్లలో 91 పరుగులు చేసింది. అయితే వీరిద్దరూ ఔటైన తర్వాత జట్టు రన్ రేట్ ఒక్కసారిగా పడిపోయింది. శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లీ చాలా నెమ్మదిగా బ్యాటింగ్చేశారు. వీరిద్దరూ అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌లు ఆడి 134 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అర్ధ సెంచరీ తర్వాత వేగంగా ఆడే ప్రయత్నంలో శ్రేయాస్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రాహుల్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ కొన్ని బౌండరీలు కొట్టి జట్టు స్కోరును ముందుకు నడిపించాడు. అయితే ఈ సమయంలో కోహ్లీ కేవలం సింగిల్స్‌కి మాత్రమే వెళ్లాడు. సూర్య ఔటైన తర్వాత వచ్చిన జడేజా ధాటిగా బ్యాటింగ్‌ చేసినా సెంచరీ దిశగా దూసుకెళ్తున్న కోహ్లి మాత్రం స్పీడ్ అందుకోలేకపోయాడు. ఎట్టకేలకు 49వ ఓవర్లో కోహ్లీ తన రికార్డు సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే కోహ్లి బ్యాటింగ్ చూసిన నెటిజన్లు రికార్డు సెంచరీ చేయడం కోసమే అతను నిదానంగా బ్యాటింగ్ చేశాడని మండిపడుతున్నారు. ఈరోజు జరిగిన మ్యాచ్‌లో విరాట్ 121 బంతుల్లో 10 బౌండరీలతో 83.47 స్ట్రైక్ రేట్‌తో అజేయంగా 101 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

అందుకే నెమ్మదిగా..

View this post on Instagram

A post shared by ICC (@icc)

కాగా టీమ్ ఇండియా ఇన్నింగ్స్ అనంతరం మాట్లాడిన విరాట్.. మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ చేయడానికి వికెట్ బాగా నెమ్మదిగా మారిందన్నాడు. రోహిత్‌, శుభ్‌మన్‌ అద్భుత ఆరంభాన్ని అందించారు. కానీ ఒక్కసారి వారు ఔట్ అయ్యాక బంతి పాతబడడంతో వికెట్ కాస్త నెమ్మదించింది. అలాగే తొలి 10 ఓవర్లలో రోహిత్, గిల్ ఔటయ్యారు. కాబట్టి ఎక్కువ సేపు బ్యాటింగ్ చేసి ఇన్నింగ్స్‌ను చివరి వరకు తీసుకెళ్లడమే నా పాత్ర. ఈ విషయాన్ని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కూడా చెప్పింది’ అని చెప్పుకొచ్చాడు.

ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయడమే లక్ష్యం..

View this post on Instagram

A post shared by ICC (@icc)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..